After Sankranthiki Vasthunam's 300 crore success, Aishwarya Rajesh is set to entertain the digital audience with Suzhal: The Vortex Season 2, with the release date now locked: 'సంక్రాంతికి వస్తున్నాం'లో విక్టరీ వెంకటేష్ సరసన భార్యగా భాగ్యలక్ష్మి రోల్ చేయడానికి కొంత మంది హీరోయిన్లు వెనకడుగు వేశారు. తెలుగు అమ్మాయి, తమిళ సినిమాలతో పేరు తెచ్చుకున్న ఐశ్వర్య రాజేష్ ధైర్యంగా చేశారు. ఆ సినిమాకు మూడు వందల కోట్లకు పైగా గ్రాస్ సాధించింది. సంక్రాంతికి థియేటర్లలో విడుదలైన ఆ సినిమా ఇంకా విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది. వెండితెరపై సందడి చేస్తున్న ఐశ్యర్య రాజేష్, ఇప్పుడు డిజిటల్ తెరపై సందడి చేసేందుకు రెడీ అయ్యారు.
'సుళుళ్' సీజన్ 2 రిలీజ్ డేట్ ఫిక్స్
Suzhal season 2 release date on Amazon Prime Video: అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ కోసం పుష్కర్ గాయత్రీ దంపతులు రూపొందించిన ఎక్స్‌క్లూజివ్ వెబ్ సిరీస్ 'సుళుళ్: ది వర్టెక్స్'. అందులో ఆర్ పార్తీబన్, ఐశ్వర్య రాజేష్, శ్రియా రెడ్డి, కథిర్, హరీష్ ఉత్తమన్, నివేదితా సతీష్, ప్రేమ్ కుమార్ తదితరులు నటించారు. జూన్ 17, 2022లో ఆ సిరీస్ విడుదల అయ్యింది. అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఇప్పుడు దానికి సీక్వెల్ తెరకెక్కించారు.
కథిర్, ఐశ్వర్య రాజేష్ జంటగా నిలబడిన పోస్టర్ విడుదల చేసింది అమెజాన్ ప్రైమ్ వీడియో. ఈ నెల (ఫిబ్రవరి) 28న తమిళంతో పాటు తెలుగు, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో సిరీస్ స్ట్రీమింగ్ కానున్నట్లు పేర్కొంది.
Also Read: మహేష్ మూవీ కోసం రెండు టైటిల్స్... జక్కన్న మనసు మాత్రం ఆ టైటిల్ మీదేనా?
'సుళుల్' కథ ఏమిటి? ఫస్ట్ సీజన్‌లో ఏం జరిగింది?
అనగనగా ఒక ఊరు. దాని పేరు సాంబాలురు. అందులో ఒక సిమెంట్ ఫ్యాక్టరీ ఉంది. ఆ ఫ్యాక్టరీలోని కార్మికులతో యాజమాన్యానికి గొడవ అవుతుంది. ఆ కార్మికులకు షణ్ముగం (పార్తీబన్) నాయకుడు. ఫ్యాక్టరీ ఎండీ త్రిలోక్ (హరీష్ ఉత్తమన్) దగ్గర డబ్బులు తీసుకుని కార్మికులను అణచివేయాలని సీఐ రెజీనా (శ్రియా రెడ్డి) ప్రయత్నిస్తుంది. దాంతో సమ్మె చేస్తారు కార్మికులు. ఆ రోజు రాత్రి ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం జరిగి బూడిద మాత్రమే మిగులుతుంది. షణ్ముగం మీద త్రిలోక్, రెజీనా సందేహాలు వ్యక్తం చేస్తారు.
షణ్ముగాన్ని అరెస్టు చేయాలని వెళ్లిన రెజీనాకు అతని చిన్న కుమార్తె నీలా (గోపికా రమేష్) కనిపించడం లేదని తెలిసి వెనక్కి వస్తుంది. నీలా మిస్ అవ్వలేదని మర్డర్ అయ్యిందని తెలుసుకుంటుంది. ఊరి చెరువులో నీలాతో పాటు రెజీనా కుమారుడు అతిశయం (ఫెడ్రిక్ జాన్) డెడ్ బాడీ ఉంటుంది. ఆంకాళమ్మ వారి జాతర మయాన్ కొళ్ళాయ్ జరుగుతున్న టైంలో ప్రేమికులు హత్యకు గురి కావడం, ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం, 15 ఏళ్ళ క్రితం జాతరలో మరొక అమ్మాయి మిస్ కావడం... వీటి మధ్య సంబంధం ఉందా? లేదా? చక్రి అలియాస్ చక్రవర్తి (కథిర్), నీలా అక్క నందిని (ఐశ్వర్యా రాజేష్)కి తెలిసిన నిజం ఏమిటి? అనేది 'సుళుల్' వెబ్ సిరీస్ మెయిన్ కాన్సెప్ట్. ఇప్పుడు సీజన్ 2లో ఏం చూపిస్తారో చూడాలి.
Also Read: 'మాస్ జాతర' తర్వాత రవితేజ సినిమా ఫిక్స్... సమ్మర్‌లో సెట్స్ మీదకు, దర్శకుడు ఎవరంటే?