తెలుగు తెరపై వినోదం విషయంలో తన లెగసీని కంటిన్యూ చేసే వారసులలో 'వెన్నెల' కిషోర్ (Vennela Kishore) ఒకరు అని ఇటీవల బ్రహ్మానందం వ్యాఖ్యానించారు. కథ, క్యారెక్టర్ ఏదైనా సరే తనదైన కామెడీతో ప్రేక్షకులు అందరినీ నవ్వించే వెన్నెల కిషోర్ టైటిల్ రోల్ పోషించిన కామెడీ థ్రిల్లర్ 'శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్' (Srikakulam Sherlock Holmes). ఈ వారమే ఓటీటీలోకి వస్తోంది.
బుక్ మై షోలో 7.5 రేటింగ్...
ఓటీటీలో స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 25న 'శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్' థియేటర్లలో విడుదల అయింది. టికెట్ బుకింగ్ యాప్ 'బుక్ మై షో'లో 7.5 రేటింగ్ కూడా అందుకుంది. అయితే... విమర్శకుల నుంచి ఈ చిత్రానికి ఆశించిన స్పందన రాలేదు. సినిమా గొప్పగా ఉందని ప్రశంసలు లేవు. బహుశా... ఆ కారణం వల్ల ఏమో? ఎక్కువ మంది ప్రేక్షకులు థియేటర్లకు రాలేదు. దాంతో విడుదలైన నెలలోపే ఓటీటీలో ప్రీమియర్ షోకు రెడీ అయింది.
Srikakulam Sherlock Holmes OTT Release Date: 'శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్' ఓటీటీ హక్కులను ప్రముఖ టెలివిజన్ నెట్వర్క్ ఈటీవీకి చెందిన 'ఈటీవీ విన్' (ETV Win) యాప్ సొంతం చేసుకుంది. ఈ నెల (జనవరి) 24వ తేదీ నుంచి తమ ఓటీటీ వేదికలో స్ట్రీమింగ్ కానున్నట్లు వెల్లడించింది.
Also Read: పాపం రష్మిక... కుంటి కాలుతో ఎయిర్ పోర్టులో ఎన్ని కష్టాలు పడిందో ఈ ఫోటోల్లో చూడండి
'శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్' కథ ఏమిటి?
ఉత్తరాంధ్రలో రాజకీయ పర్యటన అనంతరం పెరంబదూర్ వెళ్ళిన మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ మానవ బాంబు దాడిలో మరణించిన సంగతి తెలిసిందే. అయితే... ఆయన చివరిసారిగా పర్యటన చేసిన ఉత్తరాంధ్రలో ఎటువంటి అల్లర్లు జరగకుండా సీఐ భాస్కర్ (అనీష్ కురువిల్లా) ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటారు. అయితే భీమిలి సముద్ర తీర ప్రాంతంలో పులిదండి మేరీ అనే యువతి హత్యకు గురైనట్లు ఫోన్ వస్తుంది. ఆ కేసు విషయంలో విలేకరి నుంచి ఒత్తిడి ఎదురు కావడంతో వారం రోజుల్లోపు హంతకులను పట్టుకుని కేసు పూర్తి చేస్తానని, లేదంటే ఉద్యోగానికి రాజీనామా చేస్తానని సవాల్ విసురుతాడు భాస్కర్. ఒక వైపు రాజీవ్ గాంధీ హత్య కేసు, మరొకవైపు యువతి మర్డర్ మిస్టరీ... రెండిటినీ డీల్ చేయలేక మేరీ హత్య కేసును శ్రీకాకుళం షర్లాక్ హోమ్స్ (వెన్నెల కిశోర్) అని పిలవబడే ప్రైవేట్ డిటెక్టివ్ చేతిలో పెడతాడు. ఆ తర్వాత ఏమైంది? అనేది సినిమా. ఈ కేసుకు, ప్రేమికులు బాలు (రవితేజ), భ్రమ (అనన్యా నాగళ్ళ)కు సంబంధం ఏమిటి? ఎస్సై పట్నాయక్ (ప్రభాకర్) ఎందుకు సస్పెండ్ అయ్యాడు? అనేది సినిమాలో చూడాలి.
Also Read: టాలీవుడ్ తాట తీస్తున్న ఐటీ రైడ్స్... అసలు టార్గెట్ దిల్ రాజు కాదా?
'వెన్నెల' కిషోర్ టైటిల్ రోల్ పోషించిన ఈ సినిమాలో రవితేజ మహాదాస్యం మరొక కీలక పాత్ర చేశారు. 'మల్లేశం, వకీల్ సాబ్, తంత్ర' సినిమాలతో పేరు తెచ్చుకున్న తెలుగు అమ్మాయి అనన్య నాగళ్ళ, రవితేజ 'నేనింతే' ఫేమ్ సియా గౌతమ్ హీరోయిన్లుగా నటించారు. 'బాహుబలి'లో కాలకేయ పాత్ర చేసిన ప్రభాకర్, 'డిజె టిల్లు, బలగం' ఫేమ్ మురళీధర్ గౌడ్ ఇతర పాత్రలు పోషించారు. శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ చిత్రాన్ని లాస్య రెడ్డి సమర్పణలో శ్రీ గణపతి సినిమాస్ పతాకం మీద వెన్నపూస రమణారెడ్డి నిర్మించారు. వంశీ నందిపాటి విడుదల చేశారు.