టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. 'కార్తికేయ 2' తో పాన్ ఇండియా హిట్ అందుకున్న నిఖిల్ తో సినిమాలు చేయడానికి అగ్ర దర్శక నిర్మాతలు ముందుకు వస్తున్నారు. 'కార్తికేయ 2', '18 పేజెస్' వంటి బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తర్వాత నిఖిల్ నటించిన తాజా చిత్రం 'స్పై'(Spy). ప్రముఖ ఎడిటర్ గ్యారీ బిహెచ్ఈ సినిమాతో వెండితెరకు దర్శకుడిగా ఎంట్రీ ఇస్తున్నాడు. జూన్ 29 (ఈరోజు) ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా ప్రేక్షకులు ముందుకు వచ్చింది. ఇప్పటికే అమెరికాలో ప్రీమియర్స్ నుంచి ఈ సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చింది. ఇక ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ సినిమా పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంది. దీంతో ఈ సినిమాకి భారీ ఓపెనింగ్స్ వచ్చే అవకాశం ఉన్నట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.


ఈ క్రమంలోనే తాజాగా 'స్పై' మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ వివరాలు బయటికి వచ్చాయి. ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కుల కోసం భారీ స్థాయిలో పోటీ నెలకొంది. 'స్పై' ఓటీటీ రైట్స్ కోసం అగ్ర ఓటీటీ సంస్థలు ముందుకు వచ్చినట్లు సమాచారం. ఈ క్రమంలోనే 'స్పై' మూవీ ఓటిటి స్ట్రీమింగ్ రైట్స్ ను అగ్ర ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ భారీ ధరకు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. తెలుగుతోపాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళం ఐదు భాషలకు సంబంధించిన డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ను ఆమెజాన్ ప్రైమ్ దక్కించుకున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు ఈ సినిమా థియేటర్స్ లో విడుదలైన 50 రోజుల తర్వాతే ఓటీటీలో స్ట్రీమింగ్ చేసేలా నిర్మాతలు ఒప్పందం కుదుర్చుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.


దాని ప్రకారం జూన్ 29న థియేటర్స్ లో విడుదలైన ఈ సినిమా ఆగస్టు మూడో వారంలో స్ట్రీమింగ్ అయ్యే అవకాశాలు ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. కాగా ఫ్రీడమ్ ఫైటర్ సుభాష్ చంద్రబోస్ మర్డర్ మిస్టరీ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాని ఈడి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై కే రాజశేఖర్ రెడ్డి, చరణ్ ఉప్పలపాటి సంయుక్తంగా నిర్మించారు. సినిమాలో నిఖిల్ సరసన ఐశ్వర్య మీనన్ హీరోయిన్గా నటించగా.. సానియా ఠాకూర్, మకరంద్ దేశ్ పాండే, ఆర్యన్ రాజేష్, అభినవ్ గోమఠం కీలక పాత్రలు పోషించారు. విశాల్ చంద్రశేఖర్, శ్రీ చరణ్ పాకాల ఈ సినిమాకి సంగీతం అందించారు.


ఇక 'స్పై' కథ విషయానికొస్తే.. జై (నిఖిల్) ఓ రా ఏజెంట్. అతను గ్లోబల్ టెర్రరిస్ట్ అయిన ఖాధిర్ ఖాన్ ను పట్టుకునే మిషన్ లో భాగం అవుతాడు. ఖాధిర్ ఖాన్ ను పట్టుకోవడం కోసం ఐదేళ్ల పాటు సాగిన ఓ రా ఆపరేషన్ లో జై (నిఖిల్) సోదరుడు సుభాష్ (ఆర్యన్ రాజేష్) ను ఎవరు చంపారు? ఎందుకు చంపారో తెలుసుకునేందుకు ఈ మిషన్ లో జై జాయిన్ అవుతాడు. అందులో భాగంగానే సుభాష్ చంద్రబోస్ మరణానికి సంబంధించి భారతదేశం అత్యంత రహస్యంగా ఉంచిన కొన్ని సీక్రెట్స్ ని ఎలా తెలుసుకున్నాడు. అందుకు సంబంధించిన పరిస్థితులను జై (నిఖిల్)ఎలా పరిష్కరించాడు? అనే విషయాలను తెలుసుకోవాలంటే 'స్పై' మూవీని చూడాల్సిందే.


Also Read : బాలయ్యతో మూవీ తీస్తా, నేను లెక్కలేసి సినిమా తీస్తే ఎలా ఉంటుందో చూపిస్తా: విశ్వక్ సేన్