Shine Tom Chacko's Soothravakyam OTT Streaming: మలయాళ స్టార్ షైన్ టామ్ చాకో ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ ఇన్వెస్టిగేషన్ క్రైమ్ థ్రిల్లర్ 'సూత్రవాక్యం'. జులై 12న థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ హిట్ టాక్ సొంతం చేసుకుంది. మలయాళం రిలీజ్ అయిన సినిమా థ్రిల్లింగ్, మెసేజ్ ఓరియెంటెడ్ కాన్సెప్ట్‌తో విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఈ మూవీ తాజాగా ఓటీటీలోకి అందుబాటులోకి వచ్చింది.

రెండు ఓటీటీల్లో స్ట్రీమింగ్

'సూత్రవాక్యం' మూవీ తాజాగా రెండు ఓటీటీల్లోకి స్ట్రీమింగ్ అవుతోంది. ప్రముఖ ఓటీటీ 'ఈటీవీ విన్'లో తెలుగులో అందుబాటులోకి వచ్చింది. 'ప్రతీ కుటుంబం ఓ రహస్యాన్ని దాచిపెడుతుంది. కానీ నిజం బయటపడినప్పుడు ఏం జరుగుతోంది?' అంటూ క్యాప్షన్ ఇచ్చింది. దీంతో పాటే 'లయన్స్ గేట్ ప్లే' ఓటీటీలోనూ మిగిలిన భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది.

ఈ మూవీకి యుజియన్ జోస్ చిరమ్మల్ దర్శకత్వం వహించగా... షైన్ చాకోతో పాటుగా విస్సీ అలోషియస్, దీపక్ పరంబోర్ కీలక పాత్రలు పోషించారు. 'సినిమా బండి' ప్రొడక్షన్ బ్యానర్‌పై కాండ్రేగుల లావణ్య దేవి సమర్పణలో కాండ్రేగుల శ్రీకాంత్ నిర్మించారు. 

Also Read: 'అఖండ 2' పై బాలయ్య అసంతృప్తి ..సెప్టెంబర్ 25న రిలీజ్ లేనట్టేనా! ఈ ప్రచారంలో నిజమెంత?

స్టోరీ ఏంటంటే?

పోలీస్ ఫ్రీ టైంలో పిల్లలకు పాఠాలు ఎందుకు చెప్పకూడదు? అనే ఓ మెసేజ్ ఓరియెంటెడ్ కాన్సెప్ట్‌‌తో పాటు థ్రిల్లింగ్, ఎంటర్‌టైన్‌మెంట్ జోడించి 'సూత్రవాక్యం' మూవీని రూపొందించారు. కేరళలోని ఓ పీఎస్‌లో క్రిస్టో జేవియర్ (షైన్ టామ్ చాకో) సీఐగా విధులు నిర్వర్తిస్తుంటాడు. కేవలం తన డ్యూటీపైనే మాత్రమే కాకుండా సమాజం గురించి కూడా ఆలోచిస్తుంటాడు. ఇందులో భాగంగానే తనకు ఖాళీ టైం దొరికితే స్టేషన్ ఫస్ట్ ఫ్లోర్‌లోనే పిల్లలకు పాఠాలు చెబుతుంటాడు. అతని టీచింగ్ నచ్చిన పిల్లలు స్కూల్ మానేసి మరీ ట్యూషన్‌కు వస్తుంటారు. దీంతో జేవియర్‌పై లోకల్ స్కూల్ టీచర్ నిమిషా (విన్సీ) ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తుంది.

ఇదిలా ఉండగా... జేవియర్ ట్యూషన్‌కు వచ్చే ఆర్య (అనఘా) అనే అమ్మాయిపై ఆమె సోదరుడు వివేక్ (దీపక్ పరంబోల్) చేయి చేసుకుంటాడు. దీంతో జేవియర్ అతనికి వార్నింగ్ ఇస్తాడు. ట్యూషన్‌కు వచ్చే మరో అబ్బాయితో తన చెల్లెలు స్నేహంగా ఉండడాన్ని చూసి సహించలేని వివేక్ ఇద్దరిపైనా దాడికి దిగుతాడు. ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత రోజు నుంచే వివేక్ కనిపించకుండా పోతాడు. దీంతో పలు అనుమానాలు వ్యక్తమవుతాయి. వివేక్ గురించి అతని పేరెంట్స్‌ను అడిగితే ఇంటర్వ్యూకు హైదరాబాద్ వెళ్లాడని చెబుతారు. ఈ కేసు ఇన్వెస్టిగేషన్ చేసే క్రమంలోనే ఓ అమ్మాయి మర్డర్ కేసు బయటపడుతుంది. అసలు వివేక్ ఏమయ్యాడు? వివేక్ మిస్సింగ్ వెనుక అతని పేరెంట్స్ హస్తం ఉందా? అసలు మర్డర్ అయిన అమ్మాయికి వివేక్‌కు సంబంధం ఏంటి? ఈ 2 కేసులను జేవియర్ ఎలా సాల్వ్ చేశారు? అసలు జరిగిన నిజం ఏంటి? అనేది తెలియాలంటే ఇప్పుడే ఓటీటీలో మూవీ చూసెయ్యండి.