ఉస్తాద్ హీరో రామ్ పోతినేని నటించిన లేటెస్ట్ మాస్ ఎంటర్టైనర్ 'స్కంద'(Skanda) ఓటీటీ రిలీజ్ వాయిదా పడింది. అక్టోబర్ 27న ఓటీటీలో విడుదల కావలసిన ఈ చిత్రం ఇప్పుడు పోస్ట్ పోన్ అయిందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇంతకీ స్కంద పోస్ట్ పోన్ అవ్వడానికి కారణం ఏంటి? డీటెయిల్స్ లోకి వెళ్తే.. మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో రామ్ పోతినేని నటించిన మొదటి సినిమా 'స్కంద'. జీ స్టూడియోస్ తో కలిసి శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాస చిట్టూరి పాన్ ఇండియా స్థాయిలో నిర్మించిన ఈ చిత్రంలో రామ్ సరసన శ్రీలీల హీరోయిన్ గా నటించింది.


మాస్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ చిత్రంలో సీనియర్ హీరో శ్రీకాంత్, దగ్గుబాటి రాజా, గౌతమి, ఇంద్రజ, సాయి మంజ్రేకర్ తదితరులు ఇతర కీలక పాత్రలు పోషించారు. సెప్టెంబర్ 28న తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో విడుదలైన ఈ చిత్రం మొదటి రోజు నుండి మిశ్రమ స్పందనను సొంతం చేసుకుంది. బోయపాటి తన సినిమాల్లో కథ కన్నా యాక్షన్, ఎలివేషన్స్ సీన్స్ కే ఎక్కువ ఇంపార్టెంట్ చేస్తారు. స్కంద లోనూ అదే చేశారు. ఈ సినిమా కోసం కథను పక్కన పెట్టేసి రామ్ ని ఉర మాస్ వేలో ప్రజెంట్ చేసి భారీ యాక్షన్ సీక్వెన్స్ లను ప్లాన్ చేశారు.


ఇందులో ఫ్యామిలీ సెంటిమెంట్ సీన్స్ కొన్నిచోట్ల పర్వాలేదు అనిపించినా చాలావరకు కథకి యాక్షన్స్ సన్నివేశాలకి సంబంధం లేకుండా మరీ ఓవర్ గా ఉండటంతో ఆడియన్స్ ఈ చిత్రాన్ని తిరస్కరించారు. అయితే యాక్షన్ సీన్స్ లో  రామ్ ని బోయపాటి చూపించిన తీరు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. మొదటిసారి రామ్ ఊర మాస్ లుక్ లో అదరగొట్టేసారు. డ్యాన్స్ కూడా ఇరగదీసారు. అయినా కూడా అవేమీ సినిమాని నిలబెట్టలేకపోయాయి. సినిమాకి నెగిటివ్ టాక్ రావడంతో చాలామంది ఆడియన్స్ థియేటర్స్ కి వెళ్లి చూడడం మానేసి ఓటీటీ రిలీజ్ కోసం ఎదురుచూస్తున్నారు.


ఈ క్రమంలోనే 'స్కంద' మూవీ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వేదికగా అక్టోబర్ 27 నుంచి స్ట్రీమింగ్ కానుందని ప్రకటన వచ్చింది. కానీ తీరా చూస్తే స్కంద ఓటీటీ స్ట్రీమింగ్ పోస్ట్ పోన్ అయినట్లు తెలుస్తోంది. సినీ లవర్స్ ఈ విషయం తెలిసి కొంత నిరాశకు లోనవుతున్నారు. స్కంద ఓటీటీ పోస్ట్ పోన్ కు కారణం కొన్ని టెక్నికల్ రీజన్స్ అని అంటున్నారు. టెక్నికల్ రీజన్స్ వల్ల పోస్ట్ పోన్ అయిన స్కంద నవంబర్ రెండో వారంలో ఓటీటీ స్ట్రీమింగ్ కి అందుబాటులోకి వస్తుందని సమాచారం వినిపిస్తోంది.


అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇదిలా ఉంటే 'స్కంద' మూవీ క్లైమాక్స్ లో సీక్వెల్ ఉండబోతుందని బోయపాటి హింట్ ఇచ్చాడు. స్కంద రిజల్ట్ తేడా కొట్టడంతో సీక్వెల్ ఉంటుందా? లేదా? అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఇదే విషయంపై బోయపాటిని అడిగితే 'అఖండ' సీక్వెల్ తో పాటు 'స్కంద' సీక్వెల్ని కూడా తీస్తానని అన్నారు. మరి 'స్కంద' సీక్వెల్ తోనైనా బోయపాటి - రామ్ కాంబో సక్సెస్ అందుకుంటారేమో చూడాలి.


Also Read : నా ఫస్ట్ లిప్ లాక్ ఆయనతోనే, అసలు విషయం చెప్పిన శ్రీలీల



Join Us on Telegram: https://t.me/abpdesamofficial