RJ Balaji Singapore Saloon OTT release: ఆర్జేగా కెరీర్ మొదలు పెట్టిన బాలాజీ, హాస్య నటుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. త‌న‌దైన శైలీలో మంచి మంచి క్యారెక్ట‌ర్లు చేస్తూ అంద‌రినీ న‌వ్వించేవాడు. ఆ త‌ర్వాత హీరోగా, ద‌ర్శ‌కుడిగా కూడా సినిమాలు చేశారు. ఆయన నటించి, దర్శకత్వం వహించిన ‘అమ్మోరు తల్లి’ మూవీకి భలే క్రేజ్ లభించింది. రీసెంట్ గా ‘సింగపూర్ సెలూన్’ పేరుతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చారు ఆర్జే బాలాజీ. జ‌న‌వ‌రి 25న థియేట‌ర్ల‌లో రిలీజైన ఈ సినిమా మంచి టాక్ అందుకుంది. ఇప్పుడు ఓటీటీలోకి వ‌చ్చేసింది ‘సింగపూర్ సెలూన్ ’. 


స్ట్రిమింగ్ ఎక్క‌డంటే? 


‘సింగపూర్ సెలూన్’ సినిమా అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో స్ట్రీమ్ అవుతోంది. ఈ విష‌యాన్ని అమెజాన్ ట్విట్ట‌ర్ ద్వారా తెలియ‌జేసింది. "ప్ర‌తి ఒక్క‌రిని ఇన్ స్పైర్ చేసే ‘సింగపూర్ సెలూన్’ సినిమాని ఇంట్లోనే కూర్చుని ఎంజాయ్ చేయండి. అమెజాన్ లో వ‌చ్చేసింది" అంటూ ట్వీట్ చేసింది అమెజాన్. 


ఆర్జే బాలాజీ లీడ్ రోల్ ప్లే చేసిన ‘సింగపూర్ సెలూన్’ చిత్రానికి గోకుల్ దర్శకత్వం వహించారు.  వేల్స్‌ ఫిలిం పతాకంపై ఐసరీ గణేష్‌ ఈ చిత్రాన్ని నిర్మించారు. మీనాక్షి చౌదరి హీరోయిన్ కాగా.. సత్యరాజ్‌, లాల్‌, జీవా కీలక పాత్రల్లో కనిపించగా, దర్శకుడు లోకేష్‌ కనకరాజ్‌ అతిథి పాత్రలో క‌నిపించారు. 'సింగ‌పూర్ సెలూన్' ఓపెనింగ్ కి లోకేశ్ క‌న‌గ‌రాజు చీఫ్ గెస్ట్ గా వ‌స్తారు సినిమాలో. స్టార్ హీరోలతో సినిమాలు తీసే లోకేష్ తొలిసారి ఓ సినిమాలో కనిపించారు అంటూ అభిమానులు థ్రిల్ ఫీల్ అయ్యారు. ఇక బాలాజీ, లోకేశ్ ఇద్ద‌రు మంచి ఫ్రెండ్స్. ‘మా నగరం’ సినిమా విడుదల సమయంలో ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. అప్పటి నుంచి ఇద్దరు మంచి మిత్రులుగా మారారు. ఇక ఆ బంధంతోనే  సినిమాలో ఆయన అతిథి పాత్ర పోషించారు.  


డైరెక్ట‌ర్ గోకుల్ తెర‌కెక్కించిన ఆరో సినిమా ఇది. కామెడీ జోన‌ర్ లో ఈ సినిమాని తీశారు. దాంతో పాటుగా ఇన్ స్పైరింగ్ హెయిర్ స్టైలిస్ట్ క‌థ‌ను కూడా చూపించారు. చ‌దువుకునే రోజుల్లోనే హెయిర్ స్టైలిస్ట్ అవ్వాల‌నుకున్న కుర్రాడు ఎలా స‌క్సెస్ అయ్యాడ‌నేదే ఈ సినిమా. 


ఎంతో క‌ష్ట‌ప‌డ్డాను.. 


‘సింగపూర్‌ సెలూన్‌’ చిత్రం కోసం తాను ఎంతో క‌ష్ట‌ప‌డ్డాన‌ని అన్నారు ఆర్జే బాలాజీ. తన కెరీర్‌లో 10 కాలాల పాటు గుర్తుండిపోతుందని గ‌తంలో చాలాసార్లు చెప్పారు. ఈ సినిమాలో తన క్యారెక్టర్ కోసం హెయిర్‌ స్టైలిస్ట్‌ గా కొద్ది రోజుల పాటు ట్రైనింగ్ కూడా తీసుకున్నట్లు వివ‌రించారు ఆయ‌న‌. ఇక ఈ సినిమాకి వివేక్‌ మెర్విన్‌ సంగీతాన్ని అందించారు. 


ఇక ప్ర‌స్తుతం ఆర్జే బాలాజీ రెండు ప్రాజెక్టుల‌తో బిజీగా ఉన్నారు. 'సొర్గ‌వాస‌ల్' అనే సినిమాలో న‌టిస్తున్నారు ఆయ‌న‌. ఆ సినిమాలో సెల్వ‌రాఘ‌వ‌న్, ష‌రఫుద్దీన్ త‌దిత‌రులు న‌టిస్తున్నారు. ఇంకో యాక్ష‌న్ కామెడీ ఫిలిమ్‌లో కూడా ప్ర‌భుదేవతో క‌లిసి న‌టిస్తున్నార‌ట ఆర్జే బాలాజీ. ఆ సినిమాకి 'యుంగ్ ముంగ్ సుంగ్' అనే టైటిల్ నిర్ణ‌యించిన‌ట్లుగా స‌మాచారం. 


Also Read: 'క్వీన్' సీక్వెల్‌కు క‌థ రెడీ - మళ్లీ కంగనాకే ఛాన్స్?