సూపర్ హీరోస్ సినిమాలు, సీరిస్‌లకు కేరాఫ్ అడ్రస్.. ‘మార్వెల్ స్టూడియోస్’. కామిక్ బుక్స్‌లో ఉండే కొత్త సూపర్ హీరోలను పరిచయం చేస్తూ.. ఒక చిత్రంతో మరో చిత్రానికి లింక్ పెడుతూ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంపొందించడం ‘మార్వెల్’ ప్రత్యేకత. తాజాగా మార్వెల్ మరో ప్రయోగం చేసింది. అదే.. ‘She-Hulk: Attorney at Law’. ఈ వెబ్ సీరిస్‌కు సంబంధించిన ట్రైలర్‌ను మార్వెల్ సంస్థ యూట్యూబ్‌లో విడుదల చేసింది.
మార్వెల్ స్టూడియోస్ టటియానా మస్లానీ ప్రధాన పాత్రలో ఈ సీరిస్ తెరకెక్కింది. అయితే, ఈ ట్రైలర్‌పై మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. ‘హల్క్’ అభిమానులకు ఆమె బాగానే నచ్చేసింది. కానీ, CGI (గ్రాఫిక్స్) వర్క్‌ను మాత్రం పలువురు విమర్శిస్తు్న్నారు. హల్క్‌గా ఆమె లుక్స్ మరీ పేలవంగా ఉన్నట్లు కామెంట్లు చేస్తున్నారు. ఈ వెబ్ సీరిస్‌లో ‘ఇన్‌క్రెడిబుల్ హల్క్’ పాత్ర పోషిస్తున్న మార్క్ రుఫలో కూడా ఉన్నారు. ఆయనే అతడికి హల్క్‌గా ట్రైనింగ్ ఇస్తాడు.
షీ-హల్క్‌కు జెస్సికా గావో రచయిత, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. టటియానా ఈ చిత్రంలో జెన్నీఫర్ వాల్టర్స్ అనే న్యాయవాది పాత్రలో కనిపించనుంది. ఆమెకు కూడా హల్క్ తరహా సూపర్ పవర్స్ వస్తాయి. అయితే, ట్రైలర్ పూర్తిగా యాక్షన్ సన్నివేశాలతోనే కాకుండా కామెడీ సిన్స్ కూడా ఉన్నాయి. ఆమె రూపంపై కూడా ఫన్నీ డైలాగ్స్ ఉన్నాయి. చివరికి జెన్నిఫర్ తన టిండర్ డేట్‌ను తన చేతులతో ఎత్తుకోవడంతో ట్రైలర్ ముగుస్తుంది.
Also Read: ఓటీటీలో ‘సన్ ఆఫ్ ఇండియా’, స్ట్రీమింగ్ మొదలైంది!
అయితే, నెటిజనులు జెన్నిఫర్ హల్క్‌గా మారినప్పుడు.. వేరే వ్యక్తిలా కనిపిస్తోందని, ఆమె రూపు రేఖలే కనిపించడం లేదని వ్యాఖ్యానిస్తున్నారు. గ్రాఫిక్స్ విషయంలో దర్శకనిర్మాతలు కాస్త శ్రద్ధ పెట్టాల్సిందని అంటున్నారు. అన్నట్లు ఈ వెబ్ సీరిస్ ‘డిస్నీ+’ ఓటీటీలో ప్రసారం కానుంది. ఇప్పటికే ఈ ఓటీటీలో మార్వెల్‌కు చెందిన ‘ఇది వాండావిజన్’, ‘ది ఫాల్కన్ అండ్ ది వింటర్ సోల్జర్’, ‘లోకి’, ‘వాట్ ఇఫ్ ఇఫ్…?’ ‘హకీ’, ‘మూన్ నైట్’ సీరిస్‌లు అందుబాటులో ఉన్నాయి. త్వరలో ‘Ms మార్వెల్’ కూడా స్ట్రీమింగ్ కానుంది. ‘షీ-హల్క్’ ఆగస్టు 17 నుంచి స్ట్రీమింగ్ కానుంది. అయితే, వీటిలో కొన్ని వెబ్ సీరిస్‌లో తెలుగులోనూ డబ్ అయ్యాయి. ‘షీ-హల్క్’ను కూడా తెలుగులో వీక్షించవచ్చు.
Also Read: నయన తార ‘O2’ టీజర్, ఊపిరి బిగపెట్టుకుని చూడాల్సిందే!