Aishwarya Arjun's Seetha Payanam OTT Release Date Locked : యాక్షన్ కింగ్ అర్జున్ దర్శకత్వంలో ఆయన కుమార్తె ఐశ్వర్య హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన లవ్ యాక్షన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ సీతా పయనం. ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ మిక్స్‌డ్ టాక్ సొంతం చేసుకుంది. దాదాపు నెల రోజుల తర్వాత ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అవుతోంది.

ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?

ఈ మూవీ డిజిటల్ రైట్స్ ప్రముఖ ఓటీటీ 'సన్ నెక్స్ట్' (sunNXT) సొంతం చేసుకోగా ఈ నెల 20 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది. దీనిపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రావాల్సి ఉంది. తెలుగుతో పాటు తమిళ భాషలోనూ అందుబాటులోకి వచ్చే ఛాన్స్ ఉంది. ఈ మూవీలో ఐశ్వర్య అర్జున్‌తో పాటు నిరంజన్, సత్యరాజ్, ప్రకాష్ రాజ్, కోవై సరళ, ధ్రువ్ సర్జా, అర్జున్ కీలకపాత్రలు పోషించారు. శ్రీరామ్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై మూవీని నిర్మించారు. అనూప్ రూబెన్స్ మ్యూజిక్ అందించారు.

Also Read : టార్గెట్ చేసి వేధించారు - ఒంటరిగా రూంలో కూర్చుని ఏడ్చేశా... మెగా కోడలి లైఫ్‌లో షాకింగ్ ఘటన

స్టోరీ ఏంటంటే?

తల్లి తన చిన్నతనంలోనే దూరం కావడంతో తండ్రి రాజేంద్ర ప్రసాద్ (సత్యరాజ్)లోనే చూసుకుంటూ గడుపుతుంటుంది సీత (ఐశ్వర్య అర్జున్). తాను పెళ్లి చేసుకుని వెళ్లిపోతే తండ్రి ఒంటరిగా ఉండిపోతాడని పెళ్లిపై కూడా ఇంట్రెస్ట్ చూపించదు. కెరీర్ పరంగా షెఫ్ అయిన సీత కారులో ఒంటరిగా హైదరాబాద్ వెళ్లాల్సి వస్తుంది. అలా వెళ్తుండగా తన కారు చెడిపోయిందని లిఫ్ట్ ఇవ్వాలని అడుగుతాడు అభి (నిరంజన్) అనే యువకుడు.

కొన్ని కండీషన్స్‌తో అతనికి లిఫ్ట్ ఇచ్చేందుు అంగీకరిస్తుంది సీత. అలా అతని ఊరి దగ్గర దించేస్తుంది. అలా వారిద్దరి ప్రయాణంలో ఎదురైన సంఘటనలేంటి? ప్రయాణం తర్వాత కూడా అభిని సీత ఎందుకు కలవాల్సి వచ్చింది? ఈ జర్నీ సీత జీవితంలో ఎలాంటి మార్పులు తీసుకొచ్చింది? అసలు అభి ఎవరు? అనేది తెలియాలంటే మూవీ చూడాల్సిందే.