Lavanya Tripathi Shares Bad Experience In Her Movie Career : ఓ తమిళ మూవీని రిజెక్ట్ చేసిన టైంలో తనకు ఎదురైన షాకింగ్ ఘటనను షేర్ చేసుకున్నారు మెగా కోడలు లావణ్య త్రిపాఠి. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఆమె ఓ ప్రశ్నకు సమాధానంగా తన సినీ కెరీర్‌లో ఎదురైన చేదు అనుభవాన్ని పంచుకున్నారు.
నాపై తప్పుడు ప్రచారం
తన జీవితంలోనూ కఠిన పరిస్థితులు ఉన్నాయని... వాటిని దాటుకుని ముందుకు వెళ్తున్నట్లు తెలిపారు లావణ్య త్రిపాఠి. 'లైఫ్‌లో అలాంటి సిట్యువేషన్ వచ్చినప్పుడు నాకు ఎవరూ సపోర్ట్ చేయలేదు. సింగిల్ వుమెన్‌గా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఎదుర్కోవాల్సి వస్తుందో నాకు తెలుసు. గతంలో నాకు ఎలాంటి ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ లేదు. ఓసారి తమిళ సినిమా చేసే ఛాన్స్ వచ్చింది. కానీ ఆ డైరెక్టర్ తీరు నాకు నచ్చలేదు. చాలా అసౌకర్యంగా అనిపించి ఆ సినిమాకు నో చెప్పేశా.
దీంతో నాపై వాళ్లు కేసు పెట్టారు. నాపై మీడియాలో తప్పుడు కథనాలు ప్రచురించారు. నన్ను టార్గెట్ చేసి మానసికంగా వేధించారు. ఆ టైంలో నేను ఎవరికీ చెప్పలేదు. ఎవరినీ సాయం అడగలేదు. ఇంటికి వచ్చి రూమ్‌లో కూర్చుని ఏడ్చేశా. కానీ మళ్లీ ఆలోచించా. ఓ టీ తాగి రిలాక్స్ అయ్యా. ఇలాంటి సంఘటనలు మనల్ని మరింత బలంగా మారుస్తాయి. ఈ సంఘటన కొవిడ్‌కు ముందు జరిగింది.' అంటూ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.
Also Read : ఉస్తాద్ భగత్ సింగ్ ట్రైలర్ - ఇచ్చిపడేసే గోత్రం... ఇరగదీసే నక్షత్రం... పెర్ఫార్మెన్స్ బద్దలయ్యే డైలాగ్స్
ఆన్ లైన్ వేధింపులపై...
రీసెంట్‌గా ఆన్ లైన్ వేధింపులపై లావణ్య త్రిపాఠి పోలీసులను ఆశ్రయించారు. సోషల్ మీడియా వేదికగా తమ పరువుకు భంగం కలిగించేలా వేధింపులకు పాల్పడుతున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆమె హైదరాబాద్ సైబర్ క్రైమ్ పీఎస్‌లో కంప్లైంట్ చేశారు. 'పర్పుల్ క్రెయాన్00' ఇన్ స్టా అకౌంట్ ద్వారా తనను, తన ఫ్యామిలీ మెంబర్స్‌ను లక్ష్యంగా చేసుకుని పలు పోస్టులు, కామెంట్స్‌లో దూషణలు, అసభ్యకర కామెంట్స్ చేస్తున్నారని పేర్కొన్నారు.
గత కొంతకాలంగా ఈ వేధింపులు సాగుతున్నాయని... తన వ్యక్తిత్వం, నైతిక విలువలను ప్రశ్నించేలా ప్రచారం చేస్తున్నారని తెలిపారు. సదరు ఇన్ స్టా ఖాతా నడుపుతున్న వ్యక్తిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఆ అకౌంట్ ద్వారా చేసిన పోస్టులు డిలీట్ చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
