Save The Tigers Season 3 OTT Release Date Streaming Platform: జూన్ 19వ తేదీ నుంచి జియో హాట్‌స్టార్ ఓటీటీలో 'సేవ్ ద టైగర్' వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సిరీస్ స్పెషాలిటీ ఏమిటంటే... భార్యాభర్తల మధ్య సంబంధాలు, అనుబంధాలను వినోదాత్మకంగా చూపించడం! ఫస్ట్ రెండు సీజన్‌లు సక్సెస్ అయ్యాయి. మూడో సీజన్ కోసం కథను ఎన్ని మలుపులు తిప్పారు? ఎలా ముందుకు తీసుకు వెళ్లారు? అంటే... 'యమదొంగ' ఫార్మాట్‌ను ఫాలో అయ్యారని తెలిసింది.
అక్కడ యముడు... ఇక్కడ ఇంద్రుడు...టైగర్స్ 3 కంటే ముందు ఎన్టీఆర్ సినిమా!'సేవ్ ద టైగర్స్ 3' వెబ్ సిరీస్ ట్రైలర్ చూశారా? స్వర్గ లోకపు అధిపతి ఇంద్రుడి పాత్రలో 'వెన్నెల' కిశోర్ నటించారు. సిరీస్ మూడో పార్టులో కథను మలుపు తిప్పేది ఆయనే. 'సేవ్ ద టైగర్స్ 3' చూస్తే... వెన్నెల కిశోర్ పాత్రకు, మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ - దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళిల 'యమదొంగ' సినిమాలోని లెజెండరీ నటుడు, కలెక్షన్ కింగ్ మోహన్ బాబు పాత్రకు కొన్ని పోలికలు అయితే తప్పకుండా కనిపిస్తాయి.
'యమదొంగ' కథ గుర్తు ఉందా? ఎన్టీఆర్, అలీ కలిసి రంభ డ్రస్ తీసుకుని వెళ్తే... చెక్ మీద సంతకం చేసే సమయంలో ఎంఎస్ నారాయణ మరణిస్తారు. తనకు రావాల్సిన డబ్బులు రాలేదని, అందుకు కారణం యముడు అని, యముడ్ని పట్టుకుని మద్యం మత్తులో నానా తిట్లు తిడతాడు హీరో. దాంతో అతడి భూలోకం నుంచి యమలోకానికి తీసుకు వెళతారు. ఇక్కడ పాయింట్ ఏమిటి? మానవుడి మీద యముడికి కోపం రావడంతో, ఆ మానవుడి లోకం మారుస్తారు. సేమ్ టు సేమ్ ఈ పాయింట్ పట్టుకున్నారు 'సేవ్ ది టైగర్స్ 3' క్రియేటర్స్.
'Marriages Are Made In Heaven' (పెళ్లిళ్లు స్వర్గంలో నిశ్చయించబడతాయి) - ఈ లైన్ గుర్తు ఉంది కదా! స్వర్గలోకపు అధిపతి ఎవరు? ఇంద్రుడు. తమ తమ సంసార జీవితాల్లో భార్యలతో కష్టాలు ఎదురైన ముగ్గురు భర్తలు కలిసి బారులో కూర్చుని మందు తాగి, ఆ మద్యం మత్తులో ఇంద్రుడ్ని పట్టుకుని నానా తిట్లు తిడతారు. ఆ తిట్లు భరించలేక గుప్తా (చిత్రగుప్తుడు అనుకోవాలి)ను పిలిచి ఏదో ఒకటి చేయమని ఇంద్రుడు చెబుతాడు. 'యమదొంగ'లో హీరో లోకం మార్చడం కాన్సెప్ట్ తీసుకుని... 'సేవ్ ద టైగర్స్ 3' మేకర్స్ భలే మార్పులు చేశారు.
హీరో లోకం మార్చడం - 'యమదొంగ'లో, 'సేవ్ ద టైగర్స్ 3'లో సేమ్ పాయింట్ ఉంది. కానీ, ఇక్కడ టైగర్స్ 3 సిరీస్ మేకర్స్ తమ క్రియేటివిటీ చూపించారు. లోకం మార్చడంతో పాటు మనుషుల్ని పొలిన మనుషులు ఏడుగురు ఉంటారనే / లోకాలను పోలిన లోకాలు ఏడు ఉంటాయనే కాన్సెప్ట్ నుంచి రెండు లోకాలు తీసుకున్నారు. దాంతో కామెడీతో పాటు సస్పెన్స్ కూడా యాడ్ అయ్యింది. సిరీస్ వినోదాత్మకంగా మారింది. 'సేవ్ ద టైగర్స్ 3' ఫ్రాంచైజీలో మొదటి రెండు సిరీస్‌లను భార్యాభర్తల మధ్య నడిపించిన మహి వి రాఘవ్ అండ్ కో, మూడో సిరీస్ వచ్చేసరికి ఫాంటసీ ఎలిమెంట్స్ యాడ్ చేసి కొత్త రూటులోకి తీసుకు వెళ్లారు.
Also Read: Ram Charan Vs NTR - రామ్ చరణ్ vs ఎన్టీఆర్... 'ఆర్ఆర్ఆర్' తర్వాత బిజినెస్‌లో అప్పర్ హ్యాండ్ ఎవరిది?
