ఇండియన్ సినిమాను గ్లోబల్ స్టేజికి తీసుకు వెళ్లిన ఘనత రాజమౌళి 'ఆర్ఆర్ఆర్: రౌద్రం రణం రుధిరం' సినిమాది. అందులోని 'నాటు నాటు...' పాటకు ఆస్కార్ వచ్చింది. ఆ పాటలో స్టెప్పులు వేసినది ఎన్టీఆర్, రామ్ చరణ్. వాళ్ళిద్దరి కెరీర్‌లో 'ఆర్ఆర్ఆర్' బిగ్గెస్ట్ హిట్. ఆ తర్వాత ఇద్దరి సినిమాలకు ప్రీ రిలీజ్ బిజినెస్ ఎలా జరిగింది? మార్కెట్టులో ఎవరిది అప్పర్ హ్యాండ్? అనేది తెలుసుకోండి. 

దేవర వర్సెస్ పెద్ది... రెండిటి మధ్య పోటీ!Peddi vs Devara Pre Release Business Comparison: 'ఆర్ఆర్ఆర్' తర్వాత రామ్ చరణ్ మూడు సినిమాలు చేశారు. అందులో 'ఆచార్య'ను అభిమానులు, ప్రేక్షకులు చాలా మంది కన్సిడర్ చేయడం లేదు. ఆ సినిమాలో చిరంజీవి హీరో. రామ్ చరణ్ ప్రత్యేక పాత్ర చేశారు. సోలో హీరోగా అయితే... 'గేమ్ ఛేంజర్', 'పెద్ది' చేశారు.

'ఆర్ఆర్ఆర్' తర్వాత ఎన్టీఆర్ రెండు సినిమాలు చేశారు. అందులో ఒకటి 'దేవర'. మరొకటి... 'వార్ 2'. ఇది ఆయన బాలీవుడ్ డెబ్యూ. అందులో హృతిక్ రోషన్ కూడా ఉన్నారు. ఆ సినిమాను అసలు తెలుగులో సరిగా ప్రమోట్ చేయలేదు. బాలీవుడ్ సినిమాగా చూశారు తెలుగు ప్రేక్షకులు కూడా. ఎన్టీఆర్, రామ్ చరణ్... 'ఆర్ఆర్ఆర్' తర్వాత ఇద్దరి సినిమాల బిజినెస్ ఎలా ఉంది? థియేట్రికల్ రైట్స్ ద్వారా ఏ ఏరియా నుంచి ఎన్ని కోట్లు వచ్చాయి? అనేది చూస్తే...

Also Read: Peddi Vs Game Changer Pre Release Business - పెద్ది వర్సెస్ గేమ్ ఛేంజర్... ఫ్లాప్ తర్వాత రామ్ చరణ్ మార్కెట్ పడిందా?

సినిమా గేమ్ ఛేంజర్ (కోట్లలో)దేవర (కోట్లలో)వార్ 2 (కోట్లలో)పెద్ది (కోట్లలో)
ఏపీ, తెలంగాణలో122 112.5590.50135.25
హిందీ ప్లస్ రెస్టాఫ్ ఇండియా (కేరళ, తమిళనాడు, కర్ణాటక)7443193.5049.25 
టోటల్ ఇండియాలో196155.50284184.50
ఓవర్సీస్ (విదేశాల్లో)25275634
వరల్డ్ వైడ్ బిజినెస్221182.25340218.50

Also Read: Coolie vs War 2 Pre Release Business - కూలీ vs వార్ 2... బిజినెస్‌లో ఎవరిది అప్పర్ హ్యాండ్? మార్కెట్టులో ఎవరి సినిమా క్రేజ్ ఎక్కువ?

'ఆర్ఆర్ఆర్' తర్వాత ఎన్టీఆర్, చరణ్ సినిమాల్లో హయ్యస్ట్ ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన సినిమా 'వార్ 2'. అందుకు చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ముఖ్యంగా హిందీలో ఆ సినిమా బిజినెస్ ఎక్కువ జరిగింది. తెలుగు రాష్ట్రాలు, రెస్టాఫ్ ఇండియా పక్కన పెడితే... హిందీ బెల్ట్‌లో 175 కోట్ల బిజినెస్ చేసింది. 'వార్' హిట్ తర్వాత రావడం, యశ్ రాజ్ ఫిలిమ్స్ స్పై యూనివర్స్ మూవీ కావడం కూడా అందుకు ఓ కారణం. అయితే... ఆ సినిమా బాక్సాఫీస్ బరిలో ఫ్లాప్ అయ్యింది. 'దేవర'కు మంచి రెస్పాన్స్ వచ్చింది. కలెక్షన్స్ కూడా బాగా వచ్చాయి.

'ఆర్ఆర్ఆర్' తర్వాత రామ్ చరణ్ ఖాతాలో హిట్ లేదు. 'ఆచార్య', 'గేమ్ ఛేంజర్' సినిమాలు డిజాస్టర్లుగా నిలిచాయి. దాంతో 'పెద్ది'తో హిట్ అందుకోవాల్సిన అవసరం రామ్ చరణ్ మీద ఉంది. ఆయన లాస్ట్ రెండు సినిమాలు ఫ్లాప్ అయినా 'పెద్ది' బిజినెస్ మీద ఎఫెక్ట్ ఏమీ పడలేదు. కానీ, ఈ సినిమాతో ఆయన భారీ హిట్ అందుకోవాల్సిన అవసరం మాత్రం ఉంది. ప్రస్తుతానికి ప్రీ రిలీజ్ బిజినెస్ పరంగా అప్పర్ హ్యాండ్ రామ్ చరణ్ (Ram Charan)ది అయినప్పటికీ... హిట్స్ పరంగా ఎన్టీఆర్ (NTR)ది అప్పర్ హ్యాండ్. 'దేవర' కలెక్షన్లను 'పెద్ది' బీట్ చేస్తుందో? లేదో? వెయిట్ అండ్ సి. 

Also Read: Dragon Glimpse Decoded - ఎన్టీఆర్ 'డ్రాగన్' గ్లింప్స్‌లో హిడెన్ డీటెయిల్స్... ప్రశాంత్ నీల్ సీక్రెట్ క్లూస్ గమనించారా?