'పెద్ది' (Peddi Movie)లో రామ్ చరణ్ (Ram Charan) బాడీ ట్రాన్స్‌ఫర్మేషన్, మేకోవర్ గురించి దర్శకుడు బుచ్చిబాబు నుంచి నటులు జగపతి బాబు, సినిమాటోగ్రాఫర్ రత్నవేలు వరకు... ప్రతి ఒక్కరూ గొప్పగా చెబుతున్నారు. సినిమాలో చివరి 50 నిమిషాలు హై ఇస్తుందని కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. ప్రేక్షకులలోనూ సినిమాపై అంచనాలు బావున్నాయి. మరి, ప్రీ రిలీజ్ బిజినెస్ ఎలా జరిగింది? 'గేమ్ ఛేంజర్' ఫ్లాప్ ఎఫెక్ట్ పడిందా? రెండు సినిమాల్లో ఏది ఎక్కువ బిజినెస్ చేసింది? వంటి వివరాలు తెలుసుకోండి.

Continues below advertisement

గేమ్ ఛేంజర్ వర్సెస్ పెద్ది...బిజినెస్‌లో అప్పర్ హ్యాండ్ ఎవరిది?'ఆర్ఆర్ఆర్', 'గేమ్ ఛేంజర్' తర్వాత రెండు వందల కోట్ల కంటే ఎక్కువ ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన రామ్ చరణ్ సినిమాగా 'పెద్ది' రికార్డు క్రియేట్ చేసింది. ఈ మూవీ థియేట్రికల్ రైట్స్ చూస్తే... 'పెద్ది' బిజినెస్ మీద 'గేమ్ ఛేంజర్ ' ఫ్లాప్ ఎఫెక్ట్ పడలేదని చెప్పాలి. 

'గేమ్ ఛేంజర్' వరల్డ్ వైడ్ ప్రీ రిలీజ్ బిజినెస్ 221 కోట్లు అయితే... 'పెద్ది' ప్రీ రిలీజ్ బిజినెస్ 218.50 కోట్లు. రెండిటి మధ్య డిఫరెన్స్ కేవలం రెండున్నర కోట్లు మాత్రమే. 'గేమ్ ఛేంజర్' ఫ్లాప్ వల్ల చరణ్ మార్కెట్ మరీ కిందకు ఏమీ పడలేదు. జస్ట్ రెండు కోట్లు తక్కువ వచ్చిందంతే. ఏ ఏరియా నుంచి ఎన్ని కోట్లు వచ్చింది? అనేది చూస్తే...

Continues below advertisement
ఏరియాగేమ్ ఛేంజర్ (రూ. కోట్లలో)పెద్ది (రూ. కోట్లలో)
నైజాం (తెలంగాణ)43.5048
సీడెడ్ (రాయలసీమ)2324
ఉత్తరాంధ్ర (విశాఖ రీజియన్)14.2018
తూర్పు గోదావరి1010.20
పశ్చిమ గోదావరి8.108.25
గుంటూరు10.2011.20
కృష్ణ8.509.30
నెల్లూరు 4.506.30
ఏపీ & తెలంగాణ (టోటల్)122135.25
కర్ణాటక14.5017
తమిళనాడు155.25
కేరళ 22
హిందీ ప్లస్ రెస్టాఫ్ ఇండియా 42.5025
ఓవర్సీస్2534
వరల్డ్ వైడ్ ప్రీ రిలీజ్ బిజినెస్ 221218.50

'గేమ్ ఛేంజర్'తో కంపేర్ చేస్తే... తెలుగు రాష్ట్రాల్లో 'పెద్ది' ఎక్కువ బిజినెస్ చేసింది. అయితే... శంకర్ దర్శకుడు కావడంతో తమిళనాడులో 'గేమ్ ఛేంజర్' మంచి బిజినెస్ చేసింది. దాంతో ఓవరాల్ బిజినెస్ పరంగా 'పెద్ది' కాస్త వెనుకబడింది. 

Also Read: Peddi Twitter Review - అమెరికాలో 'పెద్ది' ఫస్ట్ షో ఎప్పుడు? రామ్ చరణ్ సినిమా ట్విట్టర్ రివ్యూస్, ప్రీమియర్స్ రిపోర్ట్ వచ్చేది ఎప్పుడంటే?

'గేమ్ ఛేంజర్' కంటే 'పెద్ది' బడ్జెట్ తక్కువ!'పెద్ది' బడ్జెట్ 350 కోట్లు అని ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో దర్శకుడు బుచ్చిబాబు సానా చెప్పారు. సో... అటు ఇటుగా 350 కోట్లు ఖర్చు చేసి ఉంటారని చెప్పవచ్చు. దీని కంటే ముందు రామ్ చరణ్ చేసిన సినిమా 'గేమ్ ఛేంజర్'. ఆ సినిమా నిర్మాత 'దిల్' రాజు తమకు నష్టాలు వచ్చాయని చెప్పారు. కానీ, సినిమాకు ఎంత ఖర్చు చేశారు? అనేది చెప్పలేదు. అయితే... 'గేమ్ ఛేంజర్'కు దర్శకుడు శంకర్ గట్టిగా ఖర్చు చేశారని తెలిసింది. సుమారు 400 నుంచి 450 కోట్ల వరకు ఖర్చు చేశారట. ఆ లెక్కన 'గేమ్ ఛేంజర్'తో కంపేర్ చేస్తే... 'పెద్ది' సేఫ్ ప్రాజెక్ట్. 

Also ReadUpcoming Telugu Movies In June 2026 - జూన్‌లో తెలుగు థియేట్రికల్ రిలీజెస్ లిస్ట్... రామ్ చరణ్ 'పెద్ది' to సమంత 'బంగారం', అఖిల్ 'లెనిన్'

'పెద్ది' నిర్మాతలకు ప్రీ రిలీజ్ బిజినెస్ ద్వారా 218 కోట్లు వచ్చాయి. ఓటీటీ, ఆడియో, శాటిలైట్ డీల్స్ ద్వారా మరో వంద కోట్ల వరకు వచ్చి ఉంటాయని అంచనా. మూవీ హిట్ టాక్ సొంతం చేసుకుంటే... మిగతా డబ్బులు కూడా రికవరీ చేసే అవకాశం ఉంటుంది. క్రిటిక్స్ అండ్ ఆడియన్స్ నుంచి వచ్చే మౌత్ టాక్ మీద 'పెద్ది' రిజల్ట్ డిపెండ్ అయ్యి ఉంది.

Also ReadUpcoming OTT Releases In June 2026 - జూన్‌లో ఓటీటీ లవర్స్‌కు పండగ... ధురంధర్ 2 to కేడీ, పేట్రియాట్... స్ట్రీమింగ్ అయ్యే టైటిల్స్‌ లిస్ట్