Prithviraj Sukumaran's OTT Release On Jio Hotstar: ప్రస్తుతం ఓటీటీల ట్రెండ్ నడుస్తోన్న క్రమంలో కొత్త మూవీస్ కూడా నేరుగానే ఓటీటీలోకి రిలీజ్ చేసేందుకు మేకర్స్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇటీవల 'ఎంపురాన్ 2'తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్. ఆయన ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ 'సర్ జమీన్' డైరెక్ట్‌గా ఓటీటీలోకి రిలీజ్ కానుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ స్పెషల్ వీడియో రిలీజ్ చేశారు మేకర్స్.

ఎందులో స్ట్రీమింగ్ అంటే?

ఈ మూవీకి కాయోజ్ ఇరానీ డైరెక్టర్‌గా ఎంట్రీ ఇస్తుండగా...  పృథ్వీరాజ్ సుకుమారన్, ఇబ్రహీం అలీఖాన్, కాజోల్ ప్రధాన పాత్రలు పోషించారు. జులై 25న ప్రముఖ ఓటీటీ 'జియో హాట్ స్టార్'లో మూవీ రిలీజ్ కానుంది. 'మాతృభూమిని కాపాడడం కంటే ముఖ్యమైనది మరొకటి లేదు.' అంటూ ఓ స్పెషల్ వీడియో పంచుకుంది మూవీ టీం. ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ మూవీని నిర్మించగా... దేశ భక్తి బ్యాక్ డ్రాప్‌ ప్రధానాంశంగా తెరకెక్కినట్లు వీడియో బట్టి తెలుస్తోంది. పృథ్వీరాజ్ ఆర్మీ ఆఫీసర్ రోల్‌లో కనిపించనున్నారు.

బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ తనయుడు ఇబ్రహీం అలీ ఖాన్ ఈ మూవీలో ఇంటెన్స్ లుక్‌లో కనిపించారు. ఆయన ఓ ఉగ్రవాది రోల్ చేసినట్లు తెలుస్తోంది. కశ్మీర్ నేపథ్యంలో ఈ మూవీని తెరకెక్కించగా... విధి నిర్వహణలో ఎంతో నిబద్ధత చూపించే ఆర్మీ ఆఫీసర్ విజయ్ మీనన్ (పృథ్వీరాజ్) చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ఆయన భార్య మీరా పాత్రలో కాజోల్ నటించారు. దేశ సరిహద్దుల్లో ఉగ్రవాదులతో పోరాటం దేశాన్ని రక్షించేందుకు సిన్సియర్ ఆర్మీ ఆఫీసర్ ఎలాంటి సాహసం చేశారు? అనేదే స్టోరీ.

Also Read: 15 ఏళ్ల తర్వాత సడన్‌గా ఓటీటీలోకి అల్లరి నరేష్ మూవీ - కె.విశ్వనాథ్ లాస్ట్ సినిమా స్ట్రీమింగ్... ఎందులో అంటే?