ప్రముఖ నటుడు రాజా రవీంద్ర (Raja Ravindra) ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం 'సారంగ దరియా' (Sarangadhariya 2024 Movie). పద్మారావు అబ్బిశెట్టి దర్శకుడిగా తొలిసారి తెరకెక్కిన ఈ చిత్రంలో శ్రీకాంత్‌ అయ్యంగార్‌, శివ చందు, యశస్విని, మొయిన్‌, మోహిత్‌ ఇతర ముఖ్య పాత్రధారులు. జూలై 12న విడుదల అయిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి వస్తోంది.


ఆహా ఓటీటీలో ఈ నెల (ఆగస్టు) 31 నుంచి సినిమా స్ట్రీమ్‌ అవుతుందని టీమ్‌ ప్రకటించింది. థియేటర్లలో విడుదలైన సమయంలో మంచి సందేశాత్మక సినిమాగా పేరు తెచ్చుకుంది. ఇప్పుడు  ఓటీటీలో అలరించడానికి సిద్ధమవుతోంది.


Also Read: సరిపోదా శనివారం రివ్యూ: నాని మాస్ హీరోయిజం వర్సెస్ ఎస్.జె. సూర్య విలనిజం - సినిమా ఎలా ఉందంటే?






'సారంగ దరియా' సినిమా కథ ఏమిటంటే?
సినిమా కథ విషయానికి వస్తే... కృష్ణ కుమార్ (రాజా ర‌వీంద్ర‌) ఓ కాలేజీ లెక్చ‌ర‌ర్‌. విద్యార్థుల‌కు నీతి పాఠాల‌ను భోదించే ఆయన త‌న సొంత పిల్ల‌ల‌ను స‌రైన దారిలో ఉంచలేకపోతాడు. పెద్ద కొడుకు అర్జున్ (మొయిన్‌) కుటుంబ బాధ్య‌త‌ల‌ను అసలు ఏమాత్రం ప‌ట్టించుకోకుండా తాగుడుకు బానిస‌గా మారతాడు. దానికి తోడుగా ఎప్పటికప్పుడు గొడవలు పెట్టుకుంటాడు. చిన్న కొడుకు సాయి (మోహిత్‌) ప్రేమ పేరుతో అమ్మాయిల వెంట పడతాడు. ఓ ముస్లిం అమ్మాయి అతడిని ప్రేమిస్తుంది. 


కుమారులు ఇద్దరి కష్టాలు ఇలా ఉంటే... కృష్ణ కుమార్ కూతురు అను (య‌శ‌స్విని) అసలు అమ్మాయి కాద‌ని, ఓ ట్రాన్స్‌ గ‌ర్ల్ అని తెలుస్తుంది. దీంతో వారి కుటుంబం అవ‌మానాలు ఎదుర్కొంటుంది.  ఈ స‌మ‌స్య‌ల నుండి బ‌య‌ట‌ప‌డ‌టానికి కృష్ణ కుమార్ ఏం చేశాడు? పిల్లల భవిషత్తు ఏమైంది? అనేది 'సారంగ‌ ద‌రియా' సినిమా కథ. ముగ్గురు పిల్లల జీవితాల్ని తిరిగి ఒక దారికి తీసుకురావడానికి కృష్ణ కుమార్‌ ఏం చేశారు? అనేది సినిమాలో చూడాలి. సగటు కమర్షియల్ సినిమాల మధ్య ఈ సినిమా కొత్తగా ఉండటంతో పాటు కమర్షియల్ హంగులకు దూరంగా ఉండటం వల్ల కాస్త నిదానంగా ఉంటుంది. కానీ, మనసుకు హత్తుకునే విషయాలతో పాటు సమాజ తీరుతెన్నులను కొన్నిటిని చక్కగా డిస్కస్ చేశారు. 


Also Readఅన్నయ్యా... అన్నయ్యా... అన్నయ్యా... నీది మాములు విలనిజం కాదన్నయ్యా... ఎస్.జె. సూర్య బెస్ట్ విలన్ రోల్స్‌



'సారంగ‌ ద‌రియా' సినిమాతో మంచి మెసేజ్‌ చెప్పే ప్రయత్నం చేశాడు దర్శకుడు పద్మారావు అబ్బిశెట్టి. అయితే... నెగిటివ్‌  షేడ్స్‌ ఉన్న పాత్రలో రాజా రవీంద్రను చూడటం అలవాటు అయిన వాళ్లకు ఈ పాజిటివ్‌ పాత్ర కొత్తగా ఉంటుంది. కామెడీ విషయంలోనూ సినిమా టీమ్‌ ఆశించిన మేర వర్కవుట్‌ చేయలేకపోయింది. అయితే ఓటీటీ ప్రేక్షకుల ఆలోచనలు వేరు. కాబట్టి ఓ ట్రై చేయొచ్చు.


Also Readఆహా ఓటీటీలో టాప్ 5 బెస్ట్ హారర్ మూవీస్... రొమాంటిక్ హారర్ నుంచి ప్యూర్ హారర్ వరకూ... వీటిని అస్సలు మిస్ కావొద్దు