Divine Message - Bhagavad Gita: భగవద్గీత గొప్పతనం చెప్పేలా సంతోష్ జాగర్లపూడి షార్ట్ ఫిల్మ్ - అతి త్వరలో ఓటీటీల్లోకి

ఇస్కాన్ ద్వారా భగవద్గీత గొప్పతనాన్ని ఈతరం ప్రజలకు చెప్పేలా యువ దర్శకుడు సంతోష్ జాగర్లపూడి ఓ షార్ట్ ఫిల్మ్ చేశారు. దాని టైటిల్ ఏమిటి? ఏ ఓటీటీలో విడుదల కానుంది? అనేది తెలుసుకోండి.

Continues below advertisement

భగవద్గీత (Bhagavad Gita) తెలియని హిందువులు ఉండరు. ఇతర మతస్తులు కొందరికి సైతం గీత గురించి తెలుసు. అయితే... వాళ్లందరికీ గీతా సారం పూర్తిగా తెలుసా? భగవద్గీత పూర్తిగా చదివారా? అంటే 'ఎస్' అని చెప్పలేం. అందుకని, భగవద్గీత గొప్పతనం చెప్పేలా యువ దర్శకుడు సంతోష్ జాగర్లపూడి (Santhosh Jagarlapudi) ఒక షార్ట్ ఫిల్మ్ తీశారు. ఆ వివరాల్లోకి వెళితే...

Continues below advertisement

సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో 'డివైన్ మెసేజ్'
Divine Message On Bhagavad Gita: తెలుగు ప్రేక్షకులకు సంతోష్ జాగర్లపూడి తెలుసు. సుమంత్ హీరోగా 'సుబ్రహ్మణ్యపురం' చిత్రానికి దర్శకత్వం వహించారు. ఇప్పుడు 'డివైన్ మెసేజ్' పేరుతో భగవద్గీత గొప్పతనం చెప్పేలా ఒక షార్ట్ ఫిల్మ్ తీశారు. ఇస్కాన్ ఆధ్వర్యంలో ఈ ఫిల్మ్ తెరకెక్కింది. 

ఇస్కాన్ అండ దండలతో 'డివైన్ మెసేజ్'
''లోతైన భావాలు ప్రజలు అందరికీ తెలియజేయాలని అనుకున్నా... ఏదైనా ఒక విషయాన్ని ఎక్కువ మందికి తెలిసేలా చెప్పాలని అనుకున్నా... సినిమాను ఓ మాధ్యమంగా చాలా మంది ఉపయోగించుకుంటారు. పలువురు దర్శకులు ఓ సందేశాన్ని సినిమాల ద్వారా ప్రేక్షకులకు చెప్పే ప్రయత్నం చేస్తారు. తమ భావాలు సినిమా ద్వారా ప్రేక్షకులకు తెలిసేలా చేస్తారు. సమాజానికి మంచి చేసే సినిమాలు చూసి మారిన వారెందరో ఉన్నారు. అందుకని, భగవద్గీత గొప్పతనాన్ని ఈ తరం ప్రజలకు సైతం తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ 'డివైన్ మెసేజ్' రూపొందించాం'' అని యూనిట్ సభ్యులు చెప్పారు. ఇస్కాన్ అండదండలతో తాము అనుకున్న విధంగా 'డివైన్ మెసేజ్' వచ్చిందని సంతోషం వ్యక్తం చేశారు.

Also Read: ఆస్పత్రిలో పెద్ద సినిమాలకు పని చేసిన డబ్బింగ్ ఇంజనీర్‌... సర్జరీకి 12 లక్షలు - దాతల కోసం ఫ్యామిలీ ఎదురు చూపులు

తొలుత భగవద్గీత గొప్పతనం చెప్పేలా ఒక సినిమా తీయాలని అనుకున్నామని, ప్రస్తుతం ఆ ప్రయత్నాల్లో ఉన్నామని, దాని కోసం ముందుగా షార్ట్ ఫిలిం చేశామని ఇస్కాన్ ప్రతినిధులు చెప్పారు.

ప్రైమ్ వీడియో సహా వివిధ ఓటీటీల్లో విడుదలకు ఏర్పాట్లు
Divine Message OTT Platform, Release Date: సంతోష్ జాగర్లపూడి దర్శకత్వం వహించిన 'డివైన్ మెసేజ్ 1' షార్ట్ ఫిలింకి కథను సచినందన్ హరిదాస్ అందించారు. సీతారాం ప్రభు నేతృత్వంలో హైదరాబాద్ సిటీలోని అత్తాపూర్ 'ఇస్కాన్' ఆలయంలో చిత్రీకరించారు.

Also Read: ఈ నెలలోనే విశ్వక్ సేన్ 'గామి' ఓటీటీ రిలీజ్... ZEE5లో ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అవుతుందంటే?

ప్రస్తుతం 'డివైన్ మెసేజ్' పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. త్వరలోనే అమెజాన్ ప్రైమ్ వీడియోతో సహా మిగతా ఓటీటీ వేదికల్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారని తెలిసింది. సంతోష్ జాగర్లపూడి చేస్తున్న సినిమాలకు వస్తే... సుమంత్ హీరోగా మరో సినిమా తెరకెక్కిస్తున్నారు. దానికి 'మహేంద్ర గిరి వారాహి' అని టైటిల్ ఖరారు చేశారు.

Also Readప్రేమలు డిజిటల్ స్ట్రీమింగ్ - డిస్నీ ప్లస్ హాట్‌ స్టార్‌ ఓటీటీలో కాదు... ఇందులో మలయాళ బ్లాక్‌ బస్టర్ తెలుగు వెర్షన్ రిలీజ్!

Continues below advertisement