AHA OTT Platform bags Telugu digital streaming rights of Malayalam blocbuster Premalu: మలయాళ 'ప్రేమలు' (Premalu Movie OTT) తెలుగు ప్రేక్షకుల్ని సైతం ఆకట్టుకుంది. దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తనయుడు ఎస్ఎస్ కార్తికేయ తెలుగులో విడుదల చేయడం, సూపర్ స్టార్ మహేష్ బాబు వంటి అగ్ర హీరోలు చిత్రాన్ని ప్రశంసించడంతో మంచి ప్రచారం లభించింది. భారీ విజయం సాధించింది. అయితే... ఈ సినిమా ఓటీటీ వేదికలో ఎప్పుడు విడుదల అవుతుంది? అని ఎదురు చూసే ప్రేక్షకులు చాలా మంది ఉన్నారు. వాళ్లకు గుడ్ న్యూస్.
ఆహా ఓటీటీలో 'ప్రేమలు' తెలుగు రిలీజ్!
Premalu Movie Telugu Release Date: 'ప్రేమలు' సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఓటీటీ వేదిక సొంతం చేసుకుందని ప్రచారం జరుగుతోంది. అది కొంత వరకు నిజం! అసలు విషయం ఏమిటంటే... 'ప్రేమలు' తెలుగు వెర్షన్ ఓటీటీ / డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ 'ఆహా వీడియో' సొంతం చేసుకుంది. మలయాళ వెర్షన్ సహా తమిళ హక్కులు మాత్రమే డిస్నీ దగ్గర ఉన్నాయి.
'ఆహా'లో 'ప్రేమలు' డిజిటల్ రిలీజ్ ఎప్పుడంటే?
Premalu Telugu OTT Release Date: ఏప్రిల్ రెండో వారంలో 'ప్రేమలు' చిత్రాన్ని డిజిటల్ స్ట్రీమింగ్ చేయడానికి ఆహా వీడియో సన్నాహాలు చేస్తోంది. ఏప్రిల్ 12న 'ప్రేమలు' తెలుగు వెర్షన్ ఓటీటీ రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అదీ సంగతి!
Also Read: తండ్రినే మించిన తనయుడిగా ఎదిగిన రామ్ చరణ్ - ఆయన పడిన కష్టం ఎంత? అసలు అది ఎలా సాధ్యమైంది?
మలయాళంలో ఫిబ్రవరి 9న 'ప్రేమలు' విడుదలైంది. హైదరాబాద్ సిటీలోని కొన్ని థియేటర్లలో షోలు పడ్డాయి. మంచి టాక్ వచ్చింది. రాజమౌళి తనయుడు కార్తికేయ సినిమా చూశారు. ఆయనకు సినిమా విపరీతంగా నచ్చడంతో తెలుగులో డబ్బింగ్ చేశారు. మార్చి 8న తెలుగు రాష్ట్రాల్లో భారీ ఎత్తున విడుదల చేశారు. ఈ సినిమా తెలుగు వెర్షన్ 15 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసింది. తెలుగులో హయ్యస్ట్ కలెక్షన్స్ సాధించిన మలయాళ డబ్బింగ్ సినిమాగా సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది.
Also Read: నిహారిక కొణిదెల కొత్త సినిమాకు క్రేజీ టైటిల్ - యూత్‌ను హైలైట్ చేస్తూ...
'ప్రేమలు'లో నస్లీన్ కె గఫూర్, మమతా బైజు (Mamitha Baiju) జంటగా నటించారు. గిరీష్ ఏడీ దర్శకత్వం వహించారు. మలయాళంలో భావన స్టూడియోస్ సంస్థతో కలిసి ఫహాద్ ఫాజిల్, దిలీష్ పోతతన్, శ్యామ్ పుష్కరణ్ వంటి వారు నిర్మాణంలో భాగం అయ్యారు. తమిళనాడులో ఈ సినిమా మార్చి 15 విడుదలై అక్కడ కూడా మంచి విజయం అందుకుంది. కిరణ్ జోసేతో కలిసి గిరీష్ ఏడీ స్క్రీన్ ప్లే అందించగా... విష్ణు విజయ్ సంగీతాన్ని సమకూర్చారు. అజ్మల్ సాబు సినిమాటోగ్రఫీ, ఆకాష్ జోసెఫ్ వర్గీస్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహించారు. తెలుగులో 'నైన్‌టీస్' (90s) ఫేమ్ ఆదిత్య హాసన్ సంబాషణలు రాశారు. అల్తాఫ్ సలీం, శ్యామ్ మోహన్ .ఎం, అఖిల భార్గవన్, మీనాక్షి రవీంద్రన్, సంగీత్ ప్రతాప్, షమీర్ ఖాన్ తదితరులు ఇతర పాత్రల్లో నటించారు.