బాలీవుడ్ ప్రముఖ రచయిత సలీం ఖాన్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సలీం ఖాన్ తన కెరీర్‌లో ఎన్నో హిట్ చిత్రాలు అందించారు. ఇవాళ అంటే నవంబర్ 24న ఆయన 90వ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయన హిట్ సినిమాలపై, ముఖ్యంగా అమితాబ్ బచ్చన్‌తో చేసిన సినిమాలపై ఓ లుక్ వేయండి.
అమితాబ్ బచ్చన్ ప్రధాన పాత్రలో నటించిన అనేక చిత్రాలను సలీం ఖాన్ రాశారు. సలీం ఖాన్ & జావేద్ అక్తర్ జోడీ సలీం - జావేద్ (Salim Javed)గా బాగా పేరు తెచ్చుకున్నారు. వీరు 'దీవార్', 'త్రిశూల్', 'షోలే' వంటి అనేక చిత్రాలను కలిసి రాశారు. ఈ చిత్రాలలో అమితాబ్ బచ్చన్ ప్రధాన పాత్ర పోషించారు. ఇప్పుడు ఆ చిత్రాలను OTTలలో చూడవచ్చు.
దీవార్'దీవార్' (1975) ఒక యాక్షన్ క్రైమ్ చిత్రం, దీనిని సలీం-జావేద్ (సలీం ఖాన్ మరియు జావేద్ అక్తర్) రాశారు. యష్ చోప్రా దర్శకత్వం వహించారు. ఇది వేర్వేరు మార్గాలను ఎంచుకున్న ఇద్దరు సోదరుల కథ... ఒకరు స్మగ్లర్ అయితే, మరొకరు పోలీసు అధికారి. ఈ చిత్రం అమితాబ్ బచ్చన్‌ను 'యాంగ్రీ యంగ్ మ్యాన్' చేసింది. ఈ చిత్రాన్ని అమెజాన్ ప్రైమ్ వీడియోలో చూడవచ్చు.
Also Read: పూజతో 'స్పిరిట్' షూటింగ్ షురూ... మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా - ప్రభాస్ ఎక్కడ?
షోలే'షోలే'... బ్లాక్ బస్టర్ హిందీ యాక్షన్ ఫిల్మ్. ఇప్పటికీ భారతీయ సినిమా చరిత్రలో గొప్ప చిత్రాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. ఈ కథను సలీం - జావేద్ రాశారు. ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, ధర్మేంద్ర, హేమా మాలిని, అమ్జద్ ఖాన్ వంటి నటీనటుల నటనతో పాటు ప్రతి చిన్న పాత్రను కూడా ప్రేక్షకులు చాలా మెచ్చుకున్నారు. 1975లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. ఈ చిత్రాన్ని అమెజాన్ ప్రైమ్ వీడియోలో చూడవచ్చు.
త్రిశూల్'త్రిశూల్' 1978లో వచ్చిన సూపర్ హిట్ బాలీవుడ్ సినిమా. ఇది బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. నమ్మక ద్రోహం, సోదర భావం, విధేయత గురించి చెప్పే ఒక కుటుంబ కథా చిత్రమిది. ఈ కథనూ సలీం - జావేద్ రాశారు. ఇందులో అమితాబ్ బచ్చన్, సంజీవ్ కుమార్, శశి కపూర్, హేమా మాలిని, రాఖీ వంటి ప్రముఖ నటీనటులు నటించారు. అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది.
Also Read: 'ది రాజా సాబ్'కు ప్రభాస్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా? హీరోయిన్లు, ఆర్టిస్టులకు అందులో సగం కూడా ఇవ్వలేదు
జంజీర్'జంజీర్' 1973లో వచ్చిన ఒక అద్భుతమైన యాక్షన్ క్రైమ్ ఫిల్మ్. అమితాబ్ బచ్చన్, జయా బధురి కెరీర్‌ను మార్చిన చిత్రంగా చెప్పవచ్చు. ఈ చిత్ర కథనూ సలీం - జావేద్ రాశారు. శక్తివంతమైన డైలాగులు, యాక్షన్, అవినీతికి వ్యతిరేకంగా పోరాడే కఠినమైన పోలీసు అధికారి (అమితాబ్ బచ్చన్ నటించారు) పాత్రతో సూపర్ హిట్ అయ్యింది. ఈ చిత్రాన్ని యూట్యూబ్‌లో చూడవచ్చు.
కాలా పత్తర్'కాలా పత్తర్' 1979లో వచ్చిన హిందీ యాక్షన్-థ్రిల్లర్. దీనికి యష్ చోప్రా దర్శకత్వం వహించారు. ఆయనే నిర్మించారు. దీనికి స్క్రీన్ ప్లేను సలీం - జావేద్ రాశారు. ఇందులో అమితాబ్ బచ్చన్, శశి కపూర్, శత్రుఘ్న సిన్హా, రాఖీ నటించారు. మీరు ఈ చిత్రాన్ని నెట్‌ఫ్లిక్స్‌లో చూడవచ్చు.
Also Read: 'బిగ్ బాస్ 9'కు షాక్ ఇవ్వబోతున్న స్టార్ హీరో.... హోస్ట్ చేయడం ఆపేస్తారా?