Vishnu Vishal Aaryan Movie OTT Release Date Locked : క్రైమ్, సైకో కిల్లర్ స్టోరీస్‌కు ఉండే క్రేజ్ వేరు. చనిపోయిన వ్యక్తే హత్యలు చేసేట్లుగా డిఫరెంట్ మర్డర్ మిస్టరీ కాన్సెప్ట్‌తో రూపొందిన లేటెస్ట్ తమిళ క్రైమ్ థ్రిల్లర్ 'ఆర్యన్'. తమిళ హీరో విష్ణు విశాల్, శ్రద్ధా శ్రీనాథ్, మానసా చౌదరి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ మూవీ ఈ నెల 7 తెలుగులో రిలీజై మిక్స్‌డ్ టాక్ సొంతం చేసుకుంది. నెల రోజుల్లోపే ఓటీటీలోకి రాబోతోంది.
ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. ఈ నెల 28 నుంచి మూవీ స్ట్రీమింగ్ కానుంది. తమిళంతో పాటు తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో అందుబాటులోకి రానుంది. 'అతను కథను చెప్పడం లేదు. నిజాన్ని తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు.' అంటూ క్యాప్షన్ ఇచ్చి ఓ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేసింది.
ఈ మూవీకి ప్రవీణ్ కె దర్శకత్వం వహించగా... సెల్వ రాఘవన్ విలన్‌గా నటించాడు. వణి భోజన్, వాణీ కపూర్, జీవా సుబ్రహ్మణ్యన్, చంద్రు కీలక పాత్రలు పోషించారు. తమిళంలో వారం ముందే రిలీజై మంచి రెస్పాన్స్ అందుకుంది.
Also Read : మా అమ్మను తిరిగి తీసుకువస్తారా? - ట్రోలింగ్స్‌పై నటి హేమ కన్నీళ్లు... వీడియో వైరల్
స్టోరీ ఏంటంటే?
ఓ టీవీ ఛానల్ లైవ్ ప్రోగ్రాంలో తనను తానే షూట్ చేసుకుని చనిపోతాడు ఆత్రేయ (సెల్వ రాఘవన్). అలా సూసైడ్ చేసుకోబోయే ముందు రోజుకు ఒకరి చొప్పున ఐదుగుర్ని మర్డర్ చేస్తానని చెబుతాడు. అలా రోజుకు ఒకరి పేరు అనౌన్స్ చేస్తాడు. అతను పేరు చెప్పిన వ్యక్తులు రోజుకు ఒకరు చొప్పున అనుమానాస్పదంగా చనిపోతుంటారు. అయితే, చనిపోయిన వ్యక్తి వివరాలు ఎవ్రీ డే పబ్లిక్ ప్లాట్ ఫామ్స్‌లోకి వస్తుంటాయి.
ఈ కేసు టేకప్ చేసిన డీసీపీ నంది (విష్ణు విశాల్) ఎలా సాల్వ్ చేశాడు? ఆత్రేయ సూసైడ్ దగ్గర నుంచీ చూసిన టీవీ హోస్ట్ నయన (శ్రద్ధా శ్రీనాథ్) కేసు విచారణలో ఎలాంటి సాయం చేసింది? అసలు ఈ మర్డర్స్ చేసింది ఎవరు? నందిని ప్రేమ వివాహం చేసుకున్న అనిత (మానసా చౌదరి) డివోర్స్‌కు ఎందుకు అప్లై చేసింది? అసలు హంతకున్ని ఎలా పట్టుకున్నారు? అనేది తెలియాలంటే మూవీ చూడాల్సిందే.