Salaar Hindi OTT Release: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ చాలాకాలం తర్వాత రిలీఫ్ ఇచ్చిన చిత్రం ‘సలార్’. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీలో ప్రభాస్ యాక్షన్, క్యారెక్టరైజేషన్.. ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. అందుకే ఫ్యాన్ షో నుండే ఈ మూవీకి పాజిటివ్ రివ్యూలు వచ్చాయి. ఫైనల్‌గా కలెక్షన్స్ విషయంలో కూడా ‘సలార్’.. ఎన్నో రికార్డులను బ్రేక్ చేసింది. ఓటీటీలోకి వచ్చిన తర్వాత ‘సలార్’కు మంచి వ్యూస్ దక్కాయి. కానీ ప్రభాస్ హిందీ ఫ్యాన్స్ మాత్రం ఇంకా ఈ చిత్రం హిందీ వెర్షన్ కోసం ఎదురుచూస్తూనే ఉన్నారు. ఫైనల్‌గా ‘సలార్’ హిందీ వెర్షన్‌పై ఓటీటీ అప్డేట్ వచ్చేసింది.


ఫ్యాన్స్ పిలిచారు..


ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘సలార్ పార్ట్ 1 సీజ్‌ఫైర్’.. కొన్నిరోజుల క్రితమే నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలయ్యింది. అన్ని సౌత్ భాషల్లో ముందుగా ఈ మూవీ నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రైబర్ల ముందుకు వచ్చింది. తాజాగా ఇంగ్లీష్‌లో కూడా ‘సలార్’ అందుబాటులోకి వచ్చింది. కానీ హిందీ వెర్షన్ మాత్రం ఇంకా ఓటీటీలోకి రాకపోవడంతో ప్రభాస్ బాలీవుడ్ ఫ్యాన్స్ మాత్రం కాస్త డిసప్పాయింట్ అయ్యారు. ఇంతలోనే డిస్నీ ప్లస్ హాట్‌స్టార్.. ఓ క్రేజీ అప్డేట్‌ను అందించింది. చాలా క్రియేటివ్‌గా ‘సలార్’ హిందీ ఓటీటీ రిలీజ్ గురించి హాట్‌స్టార్.. ఒక స్పెషల్ పోస్ట్‌ను షేర్ చేసింది. ‘ఫ్యాన్స్ పిలవగానే సలార్ వచ్చేస్తున్నాడు’ అంటూ ట్వీట్ చేసింది.






ఓటీటీలో కూడా హిట్..


ఫిబ్రవరీ 16 నుండి ‘సలార్’ హిందీ వెర్షన్.. హాట్‌స్టార్‌లోకి అందుబాటులోకి రానుందని క్లారిటీ వచ్చేసింది. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇప్పటికే నెట్‌ఫ్లిక్స్‌లో ‘సలార్ పార్ట్ 1’కు మంచి వ్యూస్ వచ్చాయి. హాట్‌స్టార్‌లో కూడా అదే విధంగా వ్యూస్ వస్తాయని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో ‘సలార్’ మంచి హిట్ అయ్యింది. అదే విధంగా ఓటీటీలో కూడా హిట్ అనిపించుకుంది. ఈ మూవీ ఇచ్చిన జోష్‌తో తన తరువాతి సినిమాలపై ఫోకస్ పెట్టాడు ప్రభాస్. ‘సలార్’ విడుదలయిన కొన్నిరోజులకే మారుతీతో చేస్తున్న ‘రాజా సాబ్’ నుండి ఫస్ట్ లుక్ బయటికొచ్చింది.


అప్పుడే పార్ట్ 2 కోసం వెయిటింగ్..


‘సలార్’లో దేవ పాత్రలో ప్రభాస్ కనిపించగా.. తన ప్రాణ స్నేహితుడైన వరద పాత్రలో మలయాళ నటుడు పృథ్విరాజ్ సుకుమారన్ నటించాడు. సినిమాలో వీరిద్దరి బాండింగ్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. వీరితో పాటు జగపతి బాబు, శ్రియా రెడ్డి, బాబీ సింహా, ఈశ్వరి రావు.. ఇతర కీలక పాత్రల్లో నటించారు. ‘కేజీఎఫ్’ రెండు చాప్టర్స్‌కు మ్యూజిక్ అందించిన రవి బాస్రూర్.. ‘సలార్’కు మ్యూజిక్ డైరెక్టర్‌గా వ్యవహరించాడు. ‘సలార్’కు పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో.. త్వరలోనే ‘సలార్ పార్ట్ 2’ను కూడా సెట్స్‌పైకి తీసుకెళ్లాలని మేకర్స్ భావిస్తున్నారు. వచ్చే ఏడాది వరకు ‘సలార్ పార్ట్ 2’ను కూడా సెట్స్‌పైకి తీసుకెళ్తారని తెలుస్తోంది.


Also Read: వామ్మో! జ‌గ‌న్ పాత్రలో నటించడానికి జీవా అన్ని కోట్లు తీసుకున్నాడా?