Godzilla X Kong OTT Release Date: ఫిక్షనల్ క్యారెక్టర్లతో హాలీవుడ్.. ఒక మాన్‌స్టర్ యూనివర్స్‌నే సృష్టించింది. యాక్షన్ సినిమాలను ఇష్టపడే వారిని ఈ మాన్‌స్టర్ యూనివర్స్ విపరీతంగా ఆకట్టుకుంది. అందులో ఒకటే ‘గాడ్జిల్లా x కాంగ్’. మార్చి 29న ‘గాడ్జిల్లా x కాంగ్: ది న్యూ ఎంపైర్’ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దేశవ్యాప్తంగా మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. టీమ్ గాడ్జిల్లా, టీమ్ కాంగ్ అంటూ రెండు వర్గాలుగా విడిపోయి.. ఇండియాలో కూడా ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఇక థియేటర్లలో సెన్సేషన్ సృష్టించిన ఈ మూవీ.. ఓటీటీ విడుదలకు సిద్ధమయ్యిందని వార్తలు వినిపిస్తున్నాయి.
45 రోజుల తర్వాతే..
‘గాడ్జిల్లా x కాంగ్: ది న్యూ ఎంపైర్’ మాత్రమే కాదు.. మాన్‌స్టర్ యూనివర్స్‌లోని ప్రతి సినిమా.. ప్రేక్షకులకు మంచి థియేట్రికిల్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తోంది. మార్చి 29న ఈ మూవీ థియేటర్లలో విడుదల అవ్వడంతో, 45 రోజుల తర్వాత.. అంటే మేలో ఓటీటీలోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అమెజాన్ ప్రైమ్‌తో పాటు యూట్యూబ్‌లో కూడా ముందుగా ‘గాడ్జిల్లా x కాంగ్: ది న్యూ ఎంపైర్’ రెంట్ తరహాలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
స్ట్రీమింగ్ అప్పుడే..
వార్నర్ బ్రోస్ ‘గాడ్జిల్లా x కాంగ్: ది న్యూ ఎంపైర్’ ప్రతిష్టాత్మకంగా నిర్మించింది. కాబట్టి వారి సొంత ఓటీటీ ప్లాట్‌ఫార్మ్ అయిన హెచ్‌బీఓ మ్యాక్స్‌లో కూడా ఈ మూవీ కచ్చితంగా స్ట్రీమ్ అవుతుంది. కానీ ఆ స్ట్రీమింగ్ ఎప్పటినుంచి అనే విషయంపై నిర్మాణ సంస్థ ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. మామూలుగా థియేటర్లలో ఒక సినిమా విడుదలయిన 60 నుంచి 90 రోజుల తర్వాత హెచ్‌బీఓ మ్యాక్స్.. దానిని ఓటీటీలో స్ట్రీమింగ్ ప్రారంభిస్తుంది. అలా చూస్తే.. హెచ్‌బీఓ మ్యాక్స్‌లో ‘గాడ్జిల్లా x కాంగ్: ది న్యూ ఎంపైర్’ స్ట్రీమ్ అవ్వాలంటే ఇంకా చాలా సమయం పడుతుంది. అంటే మొత్తానికి 2024 మే లేదా జూన్‌లో ఈ మూవీ ఓటీటీ ప్రేక్షకులకు అందుబాటులోకి వస్తుంది.
Also Read: ఫ్రెండ్‌తో కోడలు ఎఫైర్ - అత్తను హత్యచేసి మామకు అడ్డంగా దొరికిపోతుంది, ఇక అన్నీ ట్విస్టులే!
ఓపెనింగ్స్‌లో రికార్డ్..
మార్చి 29న బాలీవుడ్ మూవీ ‘క్రూ’కు పోటీగా ఇండియన్ బాక్సాఫీస్ ముందుకు వచ్చింది ‘గాడ్జిల్లా x కాంగ్: ది న్యూ ఎంపైర్’. అనుకున్న అంచనాల కంటే ఎక్కువ ఓపెనింగ్స్‌నే సాధించింది ఈ సినిమా. ఇండియా ఏ హాలీవుడ్ చిత్రానికి రాని ఓపెనింగ్‌ను దక్కించుకుంది. రూ.37.60 కోట్లతో ‘గాడ్జిల్లా x కాంగ్: ది న్యూ ఎంపైర్’ మొదటి రోజు కలెక్షన్స్‌ను ముగించింది. రెబెక్కా హాల్, బ్రయన్ టైరీ హన్రీ, డ్యాన్ స్టీవెన్స్, కైలీ హాటిల్, అలెక్స్ ఫెర్న్స్, ఫాలా చెన్.. ‘గాడ్జిల్లా x కాంగ్: ది న్యూ ఎంపైర్’లో లీడ్ రోల్స్‌లో కనిపించారు. ఇక 135 మిలియన్ డాలర్లతో తెరకెక్కించిన ఈ చిత్రం.. ప్రపంచవ్యాప్తంగా రూ.210 మిలియన్ డాలర్ల కలెక్షన్స్ సాధించింది.
Also Read: ప్రభాస్ 'కల్కి'పై లేటెస్ట్ అప్డేట్ - ఎన్టీఆర్ చేయాల్సిన పాత్రలో అక్కినేని హీరో!