Nagarjuna In Kalki 2898AD : పాన్ ఇండియా హీరో ప్రభాస్ - టాలెంటెడ్ యంగ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న 'కల్కి 2898 AD' సినిమాపై ఎలాంటి అంచనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 'సలార్' వంటి సక్సెస్ తరువాత ప్రభాస్ నటించిన ఫస్ట్ సైన్స్ ఫిక్షన్ మూవీ కావడంతో డార్లింగ్ ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. ప్రభాస్ తో పాటు సౌత్, నార్త్ ఇండస్ట్రీస్ కి చెందిన పలువురు స్టార్ సెలబ్రిటీలు ఈ సినిమాలో భాగం అవుతుండడంతో ఈ సినిమాపై రోజురోజుకీ అంచనాలు పెరిగిపోతున్నాయి. ఇప్పటికే దీపికా పదుకొనే, దిశా పటాని, కమల్ హాసన్, అమితాబచ్చన్, విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్ లాంటి అగ్రతారలు నటిస్తున్న ఈ సినిమాలో ఇప్పుడు మరో స్టార్ హీరో కూడా భాగం అవుతున్నట్లు తాజా సమాచారం.
'కల్కి'లో అక్కినేని హీరో
డైరెక్టర్ నాగ్ అశ్విన్ 'కల్కి' సినిమాని మహాభారతం ఆధారంగా తెరకెక్కిస్తున్నారు. దాని ప్రకారం ఈ సినిమాలో కొన్ని ప్రత్యేక పాత్రలు ఉన్నాయి. వాటికోసం మూవీ టీం కొంతమంది స్టార్ హీరోలను ఎంపిక చేసినట్లు ఇప్పటికే వార్తలు వచ్చాయి. ముఖ్యంగా ఈ సినిమా క్లైమాక్స్ లో వచ్చే పరశురాముడి పాత్రలో జూనియర్ ఎన్టీఆర్ నటిస్తారని ఇటీవల వార్తలు వచ్చాయి. కానీ తాజా సమాచారం ప్రకారం ఇప్పుడు అదే పరశురాముడి పాత్రలో ఎన్టీఆర్ స్థానంలో నాగర్జునని మూవీ టీం ఎంపిక చేసినట్లు లేటెస్ట్ న్యూస్ బయటకు వచ్చింది. 'కల్కి' కథలో పరుశురాముడి పాత్ర చాలా కీలకము కావడంతో ఆ పాత్రలో పేరు ఉన్న హీరో నటించాలని మేకర్స్ భావిస్తున్నారట. ఈ క్రమంలోనే మొదట ఎన్టీఆర్ పేరును పరిశీలించిన మూవీ టీం.. ఇప్పుడు నాగార్జునను ఆ పాత్ర కోసం తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. మరి 'కల్కి'లో పరుశురాముడి పాత్రలో ఎన్టీఆర్ నటిస్తారా? లేక నాగార్జున నటిస్తారా? అనేది చూడాలి.
రిలీజ్ మే 9 కాదు.. ఎప్పుడంటే?
'కల్కి' సినిమాని మే 9న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నట్లు మేకర్స్ చాలా రోజుల క్రితమే ప్రకటించారు. అందుకు తగ్గట్లుగానే షూటింగ్ కూడా పూర్తి చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ముందు ప్రకటించిన డేట్ కే రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ భారీగానే కష్టపడ్డారు. కానీ మధ్యలో ఏపీ ఎలక్షన్స్ రావడంతో మూవీ రిలీజ్ వాయిదా వేయక తప్పదు దీంతో మే 9న 'కల్కి' రిలీజ్ లేనట్లే అని అర్థమవుతుంది. కాకపోతే మూవీ టీం నుంచి ఇంకా అఫీషియల్ అనౌన్స్మెంట్ రావాల్సి ఉంది. మరోవైపు కల్కి కొత్త రిలీజ్ డేట్ ఇదే అంటూ నెట్టింట ఓ అప్ డేట్ కూడా వైరల్ అవుతుంది. దాని ప్రకారం మే 30న సినిమా రిలీజ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారట. ఆ దిశగా చర్చలు జరుగుతున్నాయని అంటున్నారు. త్వరలోనే మూవీ టీం కొత్త రిలీజ్ డేట్ ని అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. వైజయంతి మూవీస్ బ్యానర్ పై సీనియర్ నిర్మాత అశ్వినీ దత్ సుమారు రూ.450 కోట్లకు పైగా భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు.
Also Read : బాలయ్య - బాబీ మూవీకి ఊరమాస్ టైటిల్? ఫ్యాన్స్‌కు పూనకాలు పక్కా!