Suriya's Retro OTT Release On Netflix: తమిళ స్టార్ సూర్య లేటెస్ట్ రొమాంటిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'రెట్రో' అనుకున్న దాని కంటే ముందుగానే ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఈ మేరకు ఓటీటీ అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చింది. ఈ నెల 1న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ తమిళంలో హిట్ టాక్ సొంతం చేసుకోగా తెలుగులో మిక్స్‌డ్ టాక్ తెచ్చుకుంది.

ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?

థియేటర్లలో రిలీజ్ అయిన నెలలోపే ఓటీటీలోకి స్ట్రీమింగ్ అయ్యేందుకు రెడీ అవుతోంది. ఈ నెల 30 నుంచి ప్రముఖ ఓటీటీ 'నెట్ ఫ్లిక్స్'లో స్ట్రీమింగ్ కానుంది. తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. ముందుగా 31 నుంచి స్ట్రీమింగ్ అవుతుందని ప్రకటించినా.. ఆ తర్వాత తేదీ మార్చారు. సుమారు రూ.70 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కినన ఈ సినిమా రూ.235 కోట్ల కలెక్షన్లు దాటేసిందని మూవీ టీం ప్రకటించింది. తెలుగులోనూ కలెక్షన్లు బాగానే వచ్చాయని తెలిపింది. దీనిపై సోషల్ మీడియాలో పెద్ద చర్చే సాగింది. మూవీ టీం వచ్చిన దాని కంటే ఎక్కువగా కలెక్షన్లు పెంచేసి చెప్పినట్లు రచ్చ నడిచింది.

2డీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై సూర్య స్వయంగా ఈ మూవీని నిర్మించగా.. ఆయన సరసన బుట్టబొమ్మ పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించారు. కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వం వహించగా.. రొమాన్స్, మాస్ యాక్షన్, ఎమోషన్స్‌తో కూడిన ఎంటర్‌టైనర్‌గా ఈ మూవీ తెరకెక్కింది. జయరామ్, కరుణాకరన్, జోజు జార్జ్ ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు.రాజశేఖర్ కర్పూర సుందర పాండియన్, కార్తికేయ సంతానం (స్టోన్ బెంచ్ ఫిల్మ్స్‌) సహా నిర్మాతలు. సంతోష్ నారాయణన్ మ్యూజిక్ అందించారు.

Also Read: పవన్ కళ్యాణ్ ‘భీమ్లా నాయక్’, రవితేజ ‘క్రాక్’ TO ఎన్టీఆర్ ‘ఆది’, మంచు మనోజ్ ‘బిందాస్’ వరకు- ఈ సోమవారం (మే 26) టీవీలలో వచ్చే సినిమాలివే..

స్టోరీ ఏంటంటే?

పారి అలియాస్ పారివేల్ కణ్ణన్ (సూర్య) ఓ అనాథ. మాఫియా వ్యవహారాలు, గ్యాంగ్ స్టర్‌గా ఉన్న తిలక్ (జోజు జార్జ్) దగ్గర అతని తండ్రి పని చేస్తాడు. ఓసారి తిలక్ ఇంటి మీది జరిగిన దాడిలో పారి తండ్రి ప్రాణాలు కోల్పోతాడు. ఆ సమయంలో పారిని చేరదీసి తన కన్న కొడుకుగా పెంచుతుంది తిలక్ భార్య. తొలుత అతన్ని కొడుకుగా అంగీకరించని తిలక్.. ఆ తర్వాత అనుకోని పరిస్థితుల వల్ల పారిని ప్రేమగా చూసుకుంటాడు.

రుక్మిణి (పూజా హెగ్డే)తో ప్రేమలో పడిన పారి... ఆమెతో పెళ్లి తర్వాత గ్యాంగ్‌స్టర్, రౌడీ పనులకు ముగింపు పలికి కొత్త జీవితాన్ని ప్రారంభించాలని నిర్ణయించుకుంటాడు. అయితే... పెళ్లికి ముందు చేసిన ఓ 'గోల్డెన్ ఫిష్' డీల్ వల్ల తిలక్ - పారి మధ్య శత్రుత్వం ఏర్పడుతుంది. దీంతో పెళ్లి టైంలో గొడవ జరగ్గా.. పారికి కన్మణి దూరంగా వెళ్తుంది. మళ్లీ వీరిద్దరూ కలిశారా?, అసలు పారి ఎందుకు జైలుకు వెళ్లాల్సి వచ్చింది?, గోల్డెన్ ఫిష్ డీల్ ఏంటి?, అండమాన్ దీవుల్లో ఏం జరిగింది? అనేది తెలియాలంటే మూవీ చూడాల్సిందే.  

మరోవైపు.. ఇదే 'నెట్ ఫ్లిక్స్'లోకి నేచురల్ స్టార్ నాని బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ 'హిట్ 3' ఈ నెల 29 నుంచి స్ట్రీమింగ్ కానుంది. అటు.. బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ 'సికిందర్' మూవీ సైతం ఇప్పటికే స్ట్రీమింగ్ అవుతోంది.