Ullozhukku OTT Release Date: గత కొన్నాళ్లుగా మలయాళ సినిమాలకు ఉన్న క్రేజ్ విపరీతంగా పెరిగిపోతోంది. పైగా ఈ సినిమాలు చాలావరకు కేరళ సాంప్రదాయాలను, అక్కడి పరిస్థితులను దేశవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులకు పరిచయం చేసే విధంగా ఉంటున్నాయి. ఇప్పుడు అదే కేటగిరిలో మరో సినిమా ప్రేక్షకులను మెప్పిస్తోంది. అదే ‘ఉల్లోరుక్కు’. ఈ సినిమాలో కేరళలలో వరదలు వచ్చినప్పుడు స్థానికుల పరిస్థితి ఎలా ఉంటుంది అనేది స్పష్టంగా చూపించారు. దాని చుట్టూనే కథను నడిపించి ఆడియన్స్‌ను ఇంప్రెస్ చేశాడు దర్శకుడు క్రిస్టో టోమి. తాజాగా ఈ సినిమా ఓటీటీలో విడుదలయ్యి ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంటోంది.
కథ..
‘ఉల్లోరుక్కు’ కథ విషయానికొస్తే.. అంజు (పార్వతీ).. రాజీవ్ (అర్జున్ రాధాకృష్ణన్) అనే అబ్బాయిని ప్రేమిస్తుంది. కానీ రాజీవ్‌కు సరైన ఉద్యోగం ఉండకపోవడంతో వేరే దారిలేక థామస్ కుట్టీ (ప్రశాంత్ మురళీ)ని పెళ్లి చేసుకుంటుంది. పెళ్లయిన కొన్నాళ్ల తర్వాత రాజీవ్‌ను అనుకోకుండా కలుస్తుంది అంజు. ఆ తర్వాత తరచుగా కలుస్తూనే ఉంటుంది. ఇద్దరూ మళ్లీ చాలా దగ్గరవుతారు. అప్పటికే థామస్ కుట్టీకి బ్రెయిన్ ట్యూమర్ ఉంటుంది. మెల్లగా ఆ ట్యూమర్ వల్ల అతడి ఆరోగ్యం దెబ్బతింటుంది. అలా ఒకరోజు హాస్పిటల్‌లోనే థామస్ మరణిస్తాడు. అప్పటికే అంజు ప్రెగ్నెంట్ అని తెలుస్తుంది. కానీ అది రాజీవ్ వల్ల అని తనకు మాత్రమే తెలుసు.
అంజు కడుపులో పెరుగుతుంది థామస్ కుట్టీ వారసుడు అనుకొని తన తల్లి లీలమ్మ (ఊర్వశి) చాలా సంతోషిస్తుంది. కోడలిని చాలా బాగా చూసుకోవాలని అనుకుంటుంది. కానీ అంజు మాత్రం ఎవ్వరితో నిజం చెప్పలేక తనలో తానే బాధపడుతుంది. థామస్ కుట్టీ మరణించిన తర్వాత తన అంత్యక్రియలు చేయడానికి కేరళలోని వాతావరణ పరిస్థితులు సహకరించవు. వరదల వల్ల ఊరంతా మునిగిపోతుంది. ఇంట్లోకి కూడా నీళ్లు వచ్చేస్తాయి. ఆ నీళ్లలో శవాన్ని పూడ్చడం కష్టమని అందరూ ఆగుతారు. కానీ అంజు మాత్రం అక్కడ ఉండలేక రాజీవ్‌తో వెళ్లిపోదామని నిర్ణయించుకుంటుంది. ఆ తర్వాత ఏం జరిగింది అనేది తెరపై చూడాల్సిన కథ.
డిఫరెంట్ పాయింట్..
కేరళలో తరచుగా వరదలు రావడం, దానివల్ల ఇళ్లల్లోకి నీళ్లు వచ్చేసి ప్రజలంతా ఇబ్బందిపడడం మనం వార్తల్లో చూస్తూనే ఉంటాం. ‘ఉల్లోరుక్కు’ లాంటి ఒక ఎమోషనల్ డ్రామా సినిమాలో వరదలకు సంబంధించిన అంశాన్ని తీసుకోవడం, దాని వల్ల ఒక వ్యక్తి అంత్యక్రియలు ఆగిపోయి.. కథ మలుపులు తిరగడం అనే పాయింట్ కొత్తగా అనిపిస్తుంది. ఈ సినిమాలో పార్వతీ, ఊర్వశీ పాత్రలు మాత్రమే ఎక్కువగా తెరపైకి కనిపిస్తాయి. వీరిద్దరికి ఉన్న అనుభవంతో, యాక్టింగ్ టాలెంట్‌తో మరోసారి ప్రేక్షకులను ఆశ్చర్యపరిచాడు. దర్శకుడైన క్రిస్టో టామీ ఒక సెన్సిటివ్ కథను ప్రేక్షకుల మనసుకు హత్తుకునేలా తెరకెక్కించాడు. ఇది తన మొదటి సినిమా అంటే నమ్మడం కొంచెం కష్టమే. మనసుకు హత్తుకునే ఎమోషనల్ డ్రామా చూడాలనుకునేవారు 'అమెజాన్ ప్రైమ్'లో ఉన్న ‘ఉల్లోరుక్కు’ను చూసేయండి.
Also Read: వరుడికి తాళి కట్టే వధువు, డబ్బు కోసం వేశ్యగా మారే యువకుడు - ఓటీటీలో దుమ్ములేపుతోన్న అడల్ట్ మూవీ