లెనిన్ పాత్రలో శ్రీరామ్, చలపతిగా శివ బాలాజీ నటించిన వెబ్ సిరీస్ 'రెక్కీ'. ఇందులో ధన్యా బాలకృష్ణ, 'ఆడు కాలం' నరేన్, ఎస్తర్ నోరోన్హా, శరణ్య ప్రదీప్, రాజశ్రీ నాయర్ ప్రధాన తారాగణం. క్రైమ్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సిరీస్ జీ 5 ఓటీటీలో ఎక్స్‌క్లూజివ్‌గా స్ట్రీమింగ్ కానుంది. 


'రెక్కీ' ఫస్ట్ లుక్ (Recce Web Series First Look)ను ఈ రోజు విడుదల చేశారు. అలాగే, మోషన్ పోస్టర్‌ను కూడా! అందులో వెబ్ సిరీస్‌లో ప్రధాన తారలను పరిచయం చేశారు. జూన్ 17 నుంచి స్ట్రీమింగ్ కానున్న ఈ సిరీస్ 1990ల నేపథ్యంలో తెరకెక్కింది. సుమారు 25 నిమిషాల నిడివి గల ఎపిసోడ్స్ ఏడు ఉన్నాయి. అన్నీ ఒకే రోజున విడుదల చేశారు.
 
'రెక్కీ'కి పోలూరు కృష్ణ దర్శకత్వం వహించారు. ఆయన మాట్లాడుతూ ''తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ హత్యోదంతం నేపథ్యంలో తెరకెక్కిన సిరీస్ ఇది. వీక్షకులను ఉత్కంఠకు గురి చేస్తుంది. ఇన్స్పెక్టర్ ఎలా దర్యాప్తు చేశారనేది ఆసక్తికరం'' అని చెప్పారు. 


Also Read: ఐదు భాషల్లో బోయపాటి - రామ్ సినిమా, 'స్రవంతి' రవికిశోర్ క్లాప్‌తో సినిమా స్టార్ట్


శ్రీరామ్, శివ బాలాజీ ఇంత వరకూ చేయనటువంటి పాత్రలు ఇందులో చేశారని వెబ్ సిరీస్ యూనిట్ చెబుతోంది. గ్రామీణ ఫ్యాక్షన్, క్రైమ్ నేపథ్యంలో డ్రామా మిస్ అవ్వకుండా రూపొందించిన సిరీస్ అని జీ 5 తెలిపింది. రామరాజు, తోటపల్లి మధు, సమీర్, సమ్మెట గాంధీ, ఉమా దానం కుమార్, కృష్ణకాంత్ తదితరులు నటించిన 'రెక్కీ'ని శ్రీ రామ్ కొలిశెట్టి నిర్మించారు. శ్రీరామ్ మద్దూరి సంగీతం అందించారు.


Also Read: పెళ్లి చేసుకోబోతున్న పూర్ణ - ఆమెకు కాబోయే భర్త ఎవరంటే?