ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన 'పుష్ప 2 : ది రూల్' మూవీ ఇంకా థియేటర్లలో సందడి చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పటికే థియేటర్లలో సినిమాను చూసి ఎంజాయ్ చేసిన అల్లు అర్జున్ అభిమానులు మాత్రం, ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ గురించి వెయిట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా 'పుష్ప 2' ఓటీటీ రిలీజ్ డేట్ కు సంబంధించి ఓ వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. 


'పుష్ప 2' ఓటీటీలోకి ఎప్పుడంటే?
'పుష్ప 2' మూవీ డిసెంబర్ 5న థియేటర్లలోకి వచ్చిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి మొదలైన ఈ మూవీ కలెక్షన్ల ఊచకోత ఇంకా నడుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా రూ. 1800 కోట్లకు పైగా కొల్లగొట్టి, ఇండియన్ సినిమాలో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్స్ లో ఒకటిగా నిలిచింది ఈ మూవీ. అయితే రిలీజై ఆరు వారాలు పూర్తవుతున్నా కూడా ఈ సినిమా రీలోడెడ్ వెర్షన్ ప్రస్తుతం థియేటర్లలో సందడి చేస్తోంది. ఈ నేపథ్యంలోనే 'పుష్ప 2' మూవీ త్వరలోనే డిజిటల్ స్ట్రీమింగ్ కి రాబోతోందని తెలుస్తోంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ లో 'పుష్ప 2' మూవీ జనవరి 30న తెలుగుతోపాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో కూడా స్ట్రీమింగ్ కాబోతోందని టాక్ నడుస్తోంది. అయితే దీనిపై మేకర్స్ ఇంకా అఫీషియల్ గా అనౌన్స్మెంట్ ఇవ్వాల్సి ఉంది. 


ఓటీటీ వెర్షన్ లో ఎక్స్ట్రా ఫుటేజ్ 
ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే... 'పుష్ప 2' ఓటీటీ వెర్షన్ కి 10 నిమిషాల ఫుటేజ్ ని యాడ్ చేయబోతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఈ మూవీకి 20 నిమిషాల ఎక్స్ట్రా ఫుటేజ్ ని యాడ్ చేసి థియేటర్లలో రీలోడెడ్ వెర్షన్ పేరుతో రన్ చేస్తున్నారు. అయితే ఓటీటీలో ఈ 20 నిమిషాలతో పాటు మరో 10 నిమిషాలు ఎక్స్ట్రా ఫుటేజ్ ని యాడ్ చేసి మొత్తం అరగంట ఎక్స్ట్రా సినిమాను ఓటీటీ మూవీ లవర్స్ కి చూపించబోతున్నట్టు టాక్ నడుస్తోంది. 


Also Readకుంటుకుంటూ... వీల్ ఛైర్‌లో హైదరాబాద్ నుంచి ముంబైకు రష్మిక - అంత అర్జెంటుగా ఎందుకు వెళ్లిందో తెలుసా?



అల్లు అర్జున్ - సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ 'పుష్ప 2'. ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ 'పుష్ప' సీక్వెల్ గా రూపొందిన సంగతి తెలిసిందే. ఇందులో రష్మిక మందన్న హీరోయిన్ గా కంటిన్యూ కాగా, ఫాహద్ ఫాజిల్, సునీల్, జగపతిబాబు, అనసూయ భరద్వాజ్, రావు రమేష్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై ఈ మూవీని అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మించారు. అయితే 'పుష్ప 2' మూవీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవడం మాత్రమే కాదు వివాదాలను కూడా అలాగే మూటగట్టుకుంది. అయితే ఈ మూవీ రీలోడెడ్ వెర్షన్ గత వీకెండ్ నుంచి రోజుకు కోటి వరకు కలెక్షన్లను రాబడుతోంది. 48 రోజు ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా 50 లక్షలకు పైగా గ్రాస్ కలెక్షన్స్ సాధించినట్లు సమాచారం.


Also Readరాజా వారు రాణి గారు... తల్లిదండ్రులు కాబోతున్నారు - గుడ్ న్యూస్ చెప్పిన యంగ్ హీరో కిరణ్ అబ్బవరం