ప్రొద్దుటూరు (Proddatur)లో జరిగే దసరా (Dussehra 2025)ను అందరికీ పరిచయం చేయాలని ఓ కొత్త టీం ఓ ప్రయత్నం చేసింది. బాల్కనీ ఒరిజినల్స్ బ్యానర్ మీద, బుశెట్టి జువెల్లర్స్ సమర్పణలో ప్రేమ్ కుమార్ వలపల 'ప్రొద్దుటూరు దసరా' అనే డాక్యుమెంటరీ (Proddatur Dasara Documentary) నిర్మించారు. మురళీ కృష్ణ తుమ్మ ఈ డాక్యమెంటరీని తెరకెక్కించారు. ఇక ఈ డాక్యుమెంటరీని రీసెంట్‌గా కొంత మందికి ప్రత్యేకంగా వేసి చూపించారు. దర్శకుడు కరుణ కుమార్, ఉదయ్ గుర్రాల ఈ డాక్యుమెంటరీని చూసి మెచ్చుకున్నారు.
దర్శకుడు కరుణ కుమార్ మాట్లాడుతూ... ''ఓ ఘటన లేదా, వ్యక్తికి సంబంధించిన విషయాల్ని, నిజాల్ని చూపించేలా డాక్యుమెంటరీస్ ఉంటాయి. ప్రస్తుతం డాక్యుమెంటరీలకు ప్రపంచ వ్యాప్తంగా రీచ్ ఉందని, నెట్ ఫ్లిక్స్, అమెజాన్ వంటి వాటిల్లో డాక్యుమెంటరీస్ కేటగిరీ కూడా ఉంద''ని అన్నారు. సరైన డాక్యుమెంటరీకి సినిమా కంటే పెద్ద రీచ్ ఉంటుందని ఆయన అన్నారు. డాక్యుమెంటరీ అంటే ఎంగేజింగ్‌గా ఉండదని అంతా అనుకుంటారని, కానీ ఈ ‘ప్రొద్దుటూరు దసరా’ ఎంతో ఎంగేజింగ్‌గా, అద్భుతంగా అనిపించిందని పొగిడారు. అయితే ఇందులో మాట్లాడిన వ్యక్తులకు వారి వాయిస్‌తోనే డబ్బింగ్ చెప్పిస్తే... ఇంకా బాగుండేదని అన్నారు. అది మాత్రం చేసి రిలీజ్ చేయండని సలహా ఇచ్చారు. డాక్యుమెంటరీ అంటే ఇలానే తీయాలి అనే నియమాల్ని బద్దలు కొట్టారని పొగిడారు. యశ్వంత్ నాగ్ మంచి మ్యూజిక్ ఇచ్చారని, ఆర్ఆర్, పాటలు విన్నా కూడా గూస్ బంప్స్ వచ్చాయని ప్రశంసలు కురిపించారు. ‘ప్రొద్దుటూరు దసరా’ని అద్భుతంగా తీసిన ప్రతీ ఒక్కరికీ కంగ్రాట్స్ తెలిపారు.
Also Read: నేను బ్రతికే ఉన్నాను... చావలేదు - ఫేక్ న్యూస్‌పై కాజల్ అగర్వాల్ క్లారిటీ
ప్రొద్దుటూరు నుంచి వచ్చిన మహేష్ విట్టా కూడా ఈ డాక్యుమెంటరీలో కనిపించి ఆ పండుగ గొప్పదనం చెప్పుకొచ్చాడు. ప్రొద్దుటూరు దసరాని అందరి ముందుకు తీసుకు వచ్చిన ప్రేమ్ గారికి థాంక్స్. మా ఊర్లో జరిగే దసరా గురించి అందరికీ చెబుతుంటాను. పది రోజుల పాటు పండుగ అదిరిపోతుందని అన్నారు. నిర్మాత ప్రేమ్ కుమార్ మాట్లాడుతూ .. బాల్కనీ ఒరిజినల్స్‌ని మూడేళ్ల క్రితం ప్రారంభించారు. ఇప్పటి వరకు మా ఏరియా అంటే వయలెన్స్ మాత్రమే ఉంటుందని అంతా అనుకుంటూ ఉన్నారు. కానీ ఇప్పుడు మా మూలాల్లోని కథల్ని చూపిస్తానని అన్నారు. దర్శకుడు మురళీ కృష్ణ మాట్లాడుతూ.. ప్రొద్దుటూరు దసరా తీసే క్రమంలో చేసిన ఈ ప్రయాణంలో సహకరించిన నిర్మాత ప్రేమ్ కుమార్‌కు థాంక్స్ తెలిపారు. అందరికీ తమ డాక్యుమెంటరీ నచ్చుతుందని ఆశిస్తున్నానని అన్నారు.