Harsha Chemudu's Bakasura Restaurant OTT Streaming On Amazon Prime Video: రీసెంట్ తెలుగు హారర్ కామెడీ థ్రిల్లర్ 'బకాసుర రెస్టారెంట్' సడన్‌‌‌గా ఓటీటీలోకి వచ్చేసింది. ఇంతకు ముందు అనౌన్స్ చేసిన దాని ప్రకారం ఈ నెల 12 నుంచి ప్రముఖ ఓటీటీ 'సన్ నెక్స్ట్' స్ట్రీమింగ్ కావాల్సి ఉండగా... ఎలాంటి ముందస్తు అనౌన్స్‌మెంట్ లేకుండానే మరో ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.

ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?

ఈ మూవీ ప్రముఖ ఓటీటీ 'అమెజాన్ ప్రైమ్ వీడియో'లో సడన్‌గా అందుబాటులోకి వచ్చింది. ఆగస్ట్ 8న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ మిక్స్‌డ్ టాక్ సొంతం చేసుకుంది. ఎస్ జే శివ దర్శకత్వం వహించిన ఈ మూవీలో ప్రముఖ కమెడియన్స్ వైవా హర్ష, ప్రవీణ్ ప్రధాన పాత్రలో నటించారు. వీరితో పాటే కృష్ణ భగవాన్, కేజీఎఫ్ గరుడ రామ్, షైనింగ్ ఫణి కీలక పాత్రలు పోషించారు. హారర్, కామెడీ, థ్రిల్లింగ్ అంశాలతో మూవీని రూపొందించారు.

Also Read: పవన్ 'ఓజీ' బీజీఎం మోత మోగిపోవాల్సిందే - 117 మంది మ్యుజీషియన్స్... స్పెషల్ ఇన్‌స్ట్రుమెంట్‌తో తమన్

కథ ఏంటంటే?

పరమేశ్వర్ (ప్రవీణ్) తనకు ఇష్టం లేకపోయినా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా జాబ్ చేస్తుంటాడు. ఎప్పటికైనా తన సొంతంగా రెస్టారెంట్ బిజినెస్ చేయాలని కలలు కంటుంటాడు. తన ఫ్రెండ్స్‌తో ఈ విషయం షేర్ చేసుకోగా యూట్యూబ్‌లో దెయ్యం వీడియోలు చేస్తే డబ్బులు బాగా సంపాదించొచ్చనే ఐడియా ఇస్తారు. ఇది నచ్చడంతో ఫస్ట్ ఓ దెయ్యం వీడియో పోస్ట్ చేయగా వైరల్ అవుతుంది. అదే జోష్‌తో రెండో వీడియోను భారీగా ప్లాన్ చేసిన పరమేశ్వర్ అతని ఫ్రెండ్స్ ఓ పాడుపడిన పాత భవనంలోకి వెళ్తారు.

అక్కడ దొరికిన ఓ బుక్ ఆధారంగా క్షుద్ర పూజ చేయగా బక్క సూరి (వైవా హర్ష) ఆత్మ బయటకు వస్తుంది. ఓ నిమ్మ కాయలో ఆత్మ ప్రవేశించగా దాన్ని కట్టడి చేసేందుకు యత్నిస్తారు. అయితే, ఆ ఆత్మ పరమేశ్వర్ ఫ్రెండ్ అంజిబాబు (ఫణి) శరీరంలోకి ప్రవేశిస్తుంది. ఆకలి ఎక్కువగా ఉన్న ఆత్మ ఇంట్లో ఫుడ్ అంతా ఒకటే తినేస్తుంది. అంజిబాబు శరీరం నుంచి ఆ ఆత్మను పరమేశ్వర్ అండ్ గ్యాంగ్ ఎలా బయటకు పంపించారు? అసలు బక్క సూరి ఆత్మగా ఎందుకు మారాడు? సొంతంగా రెస్టారెంట్ పెట్టుకోవాలనుకున్న పరమేశ్వర్ కల నెరవేరిందా? అనే విషయాలు తెలియాలంటే మూవీ చూడాల్సిందే.