Guruvayoor Ambalanadayil OTT Release Date: గత కొన్నాళ్లుగా మలయాళ సినిమాలకు తెలుగులో ఒక రేంజ్‌లో డిమాండ్ పెరిగిపోతోంది. తెలుగులో అందుబాటులోకి లేకపోయినా కూడా మలయాళ భాషలోనే ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్‌తో ఈ సినిమాలను చూడడానికి ముందుకొస్తున్నారు తెలుగు ప్రేక్షకులు. అలా ఎన్నో మలయాళ చిత్రాలు.. ఇప్పుడిప్పుడే తెలుగులో కూడా డబ్ అవుతున్నాయి. వాటి డబ్బింగ్ వర్షన్స్.. థియేటర్లలో విడుదల అవ్వకపోయినా ఓటీటీలో మాత్రం అందుబాటులోకి వస్తున్నాయి. ఇప్పుడు ఆ లిస్ట్‌లోకి పృథ్విరాజ్ సుకుమారన్ హీరోగా నటించిన ఒక ఫ్యామిలీ డ్రామా మూవీ చేరనుంది.


అదే ఓటీటీలో..


మే 16న పృథ్విరాజ్ సుకుమారన్ హీరోగా నటించిన ‘గురువాయురంబల నడయిల్’ సినిమా థియేటర్లలో విడుదలయ్యింది. ఈ మూవీ తెలుగులో డబ్ అవ్వకపోయినా తెలుగు రాష్ట్రాల్లోని పలు థియేటర్లలో మలయాళ భాషలో విడుదలయ్యింది. ఇప్పటికే మలయాళ సినిమాలకు తెలుగు రాష్ట్రాల్లో ఒక రేంజ్‌లో పాపులారిటీ దక్కడంతో ‘గురువాయురంబల నడయిల్’ను థియేటర్లలో చూడడానికి చాలామంది ప్రేక్షకులు వెళ్లారు. ఇప్పుడు ఈ మూవీ ఓటీటీలో రావడానికి సిద్ధమయ్యింది. దీనిని ఓటీటీ పార్ట్‌నర్ అయిన డిస్నీ ప్లస్ హాట్‌స్టార్.. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో అనౌన్స్ చేసింది. ఇప్పటికే డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో చూడడానికి ఎన్నో మలయాళ సినిమాలో అందుబాటులో ఉండగా ఇప్పుడు ‘గురువాయురంబల నడయిల్’ కూడా అందులో యాడ్ అవ్వనుంది.


అన్ని సౌత్ భాషల్లో..


‘గురువాయురంబల నడయిల్’లో పృథ్విరాజ్ సుకుమారన్‌కు జోడీగా నిఖిలా విమల్ నటించింది. వీరితో పాటు బాసిల్ జోసెఫ్, అనస్వరా రాజన్ కూడా ఇందులో లీడ్ రోల్స్‌లో అలరించారు. పూర్తిస్థాయి ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీలో కామెడీ.. ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఇక ఈ సినిమా.. జూన్ 27 నుండి డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమ్ కానుంది. అయితే థియేటర్లలో కేవలం మలయాళంలో మాత్రమే విడుదలయిన ఈ మూవీ.. ఓటీటీలోకి వచ్చేసరికి ప్రతీ సౌత్ భాషలో స్ట్రీమ్ అవ్వడానికి సిద్ధమయ్యింది. అంటే డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో మలయాళంతో పాటు తమిళ, తెలుగు ఆడియోలు కూడా అందుబాటులోకి రానున్నాయి.






కామెడీతో హిట్..


ప్రభాస్ హీరోగా నటించిన ‘సలార్’ మూవీతో తెలుగు ప్రేక్షకులను నేరుగా పలకరించాడు పృథ్విరాజ్ సుకుమారన్. అది చూసిన తర్వాత పృథ్విరాజ్ పర్సనాలిటీకి ఇలాంటి మాస్ సినిమాలు, మాస్ పాత్రలే సూట్ అవుతాయని ప్రేక్షకులు అనుకోవడం మొదలుపెట్టారు. కానీ దానికి పూర్తి భిన్నంగా ‘గురువాయురంబల నడయిల్’ అనే కామెడీ మూవీతో హిట్ కొట్టాడు ఈ హీరో. ఇందులో ముఖ్యంగా పృథ్విరాజ్, బాసిల్ జోసెఫ్ చేసిన కామెడీ.. మూవీకే హైలెట్‌గా నిలిచింది. విపిన్ దాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా.. దేశవ్యాప్తంగా రూ.90 కోట్ల కలెక్షన్స్ సాధించి అందరినీ ఆశ్చర్యపరిచింది.



Also Read: ఏపీలో 'కల్కి 2898 ఏడీ' టికెట్ రేట్స్ పెరిగాయ్ - తెలంగాణలో కంటే ఎక్కువ రోజులు, ఎక్కువ రేట్లు