Prince And Family OTT Release On Zee 5: ఓటీటీ ఆడియన్స్ ఇంట్రెస్ట్‌కు అనుగుణంగా ప్రముఖ ఓటీటీలన్నీ క్రైమ్, కామెడీ కంటెంట్‌నే ఎక్కువగా స్ట్రీమింగ్ చేస్తున్నాయి. తాజాగా.. మలయాళంలో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి క్రైమ్ కామెడీ మూవీ 'ప్రిన్స్ అండ్ ఫ్యామిలీ' ఓటీటీలోకి రాబోతోంది.
ఎప్పుడు స్ట్రీమింగ్ అంటే?
మే 9న రిలీజ్ అయిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. ఈ నెల 20 నుంచి ప్రముఖ ఓటీటీ 'జీ5'లో స్ట్రీమింగ్ కానుంది. మలయాళం, తమిళ భాషల్లో అందుబాటులోకి రానుంది. ఈ మూవీకి బింగో స్టీఫెన్స్ దర్శకత్వం వహించగా.. దిలీప్, సిద్ధిక్, రానియా, ధ్యాన్ శ్రీనివాసన్, జానీ ఆంటోనీ, మంజు పిళ్లై తదితరులు కీలక పాత్రలు పోషించారు. మ్యూజిక్ ఫ్రేమ్ బ్యానర్‌పై మూవీని నిర్మించారు.
2017లో వచ్చిన 'రామలీల' తర్వాత యాక్టర్ దిలీప్‌కు ఎక్కువ క్రేజ్ సంపాదించి పెట్టిన మూవీ 'ప్రిన్స్ అండ్ ఫ్యామిలీ'. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.25.47 కోట్లు వసూళ్లు సాధించింది. మలయాళం ఇండస్ట్రీ నుంచి వచ్చిన ఈ ఏడాది బ్లాక్ బస్టర్ మూవీస్‌లో ఈ మూవీ ఒకటిగా నిలిచింది.
Also Read: ఘాటీ ఓటీటీ: రేటు యమా ఘాటు... అనుష్క సినిమాకు అమెజాన్ ప్రైమ్ వీడియో భారీ ఆఫర్
స్టోరీ ఏంటంటే?
ప్రిన్స్ చక్కక్కల్ (దిలీప్) ఫ్యామిలీకే అతనే దిక్కు. ఎంత వయసొచ్చినా అతనికి ఇంకా పెళ్లి కాదు. తనకు, తన ఫ్యామిలీకి తగిన అమ్మాయిని వెతకే ప్రయత్నంలో అతను చాలా ఇబ్బందులు పడతాడు. ఈ క్రమంలో ఓ మ్యారేజ్ సైట్ నుంచి వచ్చిన ప్రపోజల్ అతనితో పాటు కుటుంబసభ్యుల జీవితాలనే మార్చేస్తుంది. ప్రిన్స్ ఇష్టాలు, అభిప్రాయాలకు పూర్తి భిన్నంగా ఓ క్లాత్ షోరూం నడిపే అమ్మాయి అతని జీవితంలోకి వస్తుంది. ఆ తర్వాత ఫ్యామిలీలో ఏం జరిగిందనేదే మూవీ. ఈ మూవీ కామెడీ జానర్‌లో ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందించారు.