హాలీవుడ్ సినిమాలను ఎక్కువగా చూసేవారికి ‘ప్రిడేటర్’ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఆర్నాల్డ్ స్క్వార్జెనెగర్ హీరోగా 1987లో విడుదలైన ‘ప్రిడేటర్’ సినిమాకు ఇది ప్రీక్వెల్. ‘ప్రిడేటర్’ నేపథ్యంలో ఇప్పటికే ఎన్నో సీక్వెల్స్ వచ్చాయి. ప్రిడేటర్ 2, ప్రీడేటర్స్, ది ప్రిడేలర్, ఎలియన్స్ vs ప్రిడేటర్, ఎలియన్స్ vs ప్రిడేటర్: రిక్వియం’ వంటి సినిమాలు వచ్చాయి. ఈ చిత్రాలకు మంచి విజయం కూడా సాధించాయి. అయితే, ‘ప్రిడేటర్’ ఏ విధంగా ఆవిర్భవించిందనే అంశంతో ప్రిక్వెల్ సిద్ధమైంది. దీనికి సంబంధించిన టీజర్‌ను ‘20th Century Studios’ సంస్థ ఇటీవల యూట్యూబ్‌లో విడుదల చేసింది. దీనికి సినీ ప్రేమికుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది.
‘10 క్లోవర్‌ఫీల్డ్ లేన్’ చిత్రానికి దర్శకత్వం వహించిన డాన్ ట్రాచ్టెన్‌బర్గ్ ‘ప్రే’ (Prey) చిత్రానికి దర్శకత్వం వహించారు. 300 సంవత్సరాల క్రితం భూమిపై ఏం జరిగింది? ప్రిడేటర్‌లు ఎలా ఆవిర్భవించాయనే అంశాన్ని ఈ చిత్రంలో చూపించనున్నట్లు తెలుస్తోంది. నరు అనే కోమంచె జాతికి చెందిన అమ్మాయి చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ప్రసిద్ధ వేటగాళ్ల వద్ద పెరిగిన యోధురాలిగా నరు పాత్ర ఉంటుంది. కంటికి కనిపించని, గుర్తుతెలియని జీవి ఆ తెగ ప్రజల ప్రాణాలు తీయడాన్ని చూసి చలిచింపోతుంది. ఆ జీవిని గుర్తించి ఎలాగైనా మట్టుబెట్టాలని నిర్ణయించుకుంటుంది.
Also Read: ఓటీటీలో ‘సన్ ఆఫ్ ఇండియా’, స్ట్రీమింగ్ మొదలైంది!
ఆ భయానక జీవి ‘ప్రిడేటర్’ అని, అది సాంకేతికంగా అభివృద్ధి చెందిన గ్రహాంతర వాసి అని తెలుసుకుంటుంది. ఆ తర్వాత ఆమె దాన్ని ఎలా ఎదుర్కొంటుంది. తమ జాతి ప్రజలను ఎలా రక్షిస్తుందనేది మిగతా కథనం. అయితే, ట్విట్టర్‌లో దీనిపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఎప్పుడో 300 ఏళ్ల కిందట అంత ఆధునిక జీవి ఎలా ఆవిర్భవించింది. కేవలం బాణాలతో మాత్రమే పోరాడగలిగే అప్పటి ప్రజలు దాన్ని ఎదుర్కోగలరనే సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే.. ప్రిడేటర్ చాలా ఆధునిక ఆయుధాలు కలిగిన తెలివైన జీవి. అది ప్రకృతిలో కలిసిపోయి కన్‌ఫ్యూజ్ చేయగలదు. భారీ ఆయుధాలు కలిగిన సైనికులే దాన్ని మట్టుబెట్టే ప్రయత్నంలో ప్రాణాలు కోల్పోవడాన్ని గత సీక్వెల్స్‌లో చూపించారు. మరి, ఆ యోధురాలు దాన్ని ఎలా ఎదుర్కొంటుందనేది బుల్లితెరపైనే చూడాలి. ఎందుకంటే.. ఈ చిత్రం ‘Hulu Originals’ ఓటీటీలో ఈ ఏడాది ఆగస్టు 5న విడుదల కానుంది.
Also Read: నయన తార ‘O2’ టీజర్, ఊపిరి బిగపెట్టుకుని చూడాల్సిందే!
Prey టీజర్‌ను ఇక్కడ చూడండి: