Janhvi Kapoor's Param Sundari OTT Platform Locked: బాలీవుడ్ హీరో సిద్ధార్ధ్ మల్హోత్రా, అందాల సుందరి జాన్వీ కపూర్ జంటగా నటించిన లేటెస్ట్ లవ్ రొమాంటిక్ కామెడీ డ్రామా 'పరమ్ సుందరి'. శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ మిక్స్‌డ్ టాక్ సొంతం చేసుకుంది. రిలీజ్‌కు ముందే ఓటీటీ డీల్ ఫిక్స్ కాగా థియేట్రికల్ రన్ తర్వాత ఓటీటీలోకి స్ట్రీమింగ్ అయ్యే ఛాన్స్ ఉంది.
ఆ ఓటీటీలోకే...
'పరమ్ సుందరి' డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ 'అమెజాన్ ప్రైమ్ వీడియో' సొంతం చేసుకోగా... థియేట్రికల్ రన్ తర్వాత ఓటీటీలోకి వచ్చే ఛాన్స్ ఉంది. సాధారణంగా ఏ మూవీ అయినా థియేటర్లలో వచ్చిన 4 వారాల తర్వాత ఓటీటీలోకి వస్తోంది. ఈ మూవీ దాదాపు 8 వారాల తర్వాత ఓటీటీలోకి వచ్చే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.
Also Read: సడన్‌గా ఓటీటీలోకి మొగలిరేకులు హీరో క్రైమ్ థ్రిల్లర్ - ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో తెలుసా?
ఈ మూవీకి తుషార్ జలోటా దర్శకత్వం వహించగా... మడాక్స్ ఫిలిం బ్యానర్‌పై దినేష్ విజన్ నిర్మించారు. సిద్దార్ద్ మల్హోత్రా, జాన్వీ కపూర్‌లతో పాటే సంజయ్ కపూర్, సిద్ధార్థ్ శంకర్ కీలక పాత్రలు పోషించారు. రిలీజ్‌కు ముందే పలు కాంట్రవర్సీలకు వివాదంగా మారింది. చర్చిలో హీరో హీరోయిన్ మధ్య రొమాంటిక్ సీన్లపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. అలాగే, జాన్వీ కపూర్ యాసపై మలయాళీలు విమర్శలు చేశారు. కేవలం హిందీలోనే మూవీ రిలీజ్ చేశారు మేకర్స్.
స్టోరీ ఏంటంటే?
ఢిల్లీకి చెందిన వ్యక్తి పరమ్ (సిద్దార్థ్ మల్హోత్రా). తండ్రి తన బిజినెస్‌లు చూసుకోమని చెప్పినా అది ఇష్టం లేక స్టార్టప్స్ పెట్టి తనను తాను ప్రూవ్ చేసుకోవాలని అనుకుంటాడు. తండ్రి దగ్గర డబ్బులు తీసుకుని పలు స్టార్టప్స్‌లో ఇన్వెస్ట్ చేసి ఏదీ సక్సెస్ కాక ఫెయిల్ అవుతుంటాడు. ఈ క్రమంలోనే డేటింగ్ యాప్ 'ఫైండ్ మై సోల్ మేట్' సక్సెస్ ఇస్తుందని నమ్ముతాడు. ఇది డెవలప్ చేసేందుకు తండ్రిని రూ.5 కోట్లు అడుగుతాడు. అయితే, ఆ డబ్బులు ఇచ్చేందుకు ఓ కండిషన్ పెడతాడు.
తండ్రి పెట్టిన షరతులతో కేరళ వెళ్లిన పరమ్ అక్కడ సుందరి (జాన్వీ కపూర్) ఇంట్లోనే హోమ్ స్టేకి దిగుతాడు. ఆమెతో లవ్‌లో పడతాడు. అయితే సరిగ్గా పరమ్ ప్రపోజ్ చేసే టైంకు వేణు నాయర్ (సిద్ధార్థ్ శంకర్)తో సుందరి పెళ్లి నిశ్చయం చేస్తారు ఊరి పెద్దలు. ఆ పెళ్లి చేయాలనేది సుందరి తల్లిదండ్రుల ఆలోచన. అయితే వారి మరణంతో ఊరి పెద్దలు ఆమె పెళ్లి బాధ్యత తీసుకుంటారు. అయితే పరమ్‌తో ప్రేమలో పడిన సుందరి ప్రపోజ్ చేద్దామని అనుకుంటుంది. అప్పుడు తన డేటింగ్ యాప్ గురించి చెబుతాడు పరమ్. అతడు చెప్పిన ఓ విషయం సుందరికి కోపం తెప్పిస్తుంది. మనసు ముక్కలు అవుతుంది.
అసలు పరమ్ తండ్రి పెట్టిన కండిషన్ ఏంటి? పరమ్ సుందరి మధ్య లవ్ ఏం జరిగింది? వీరిద్దరి పెళ్లికి ఊరి పెద్దలు ఒప్పుకున్నారా? అనేది తెలియాలంటే మూవీ చూడాల్సిందే.