Abhilash Sunkara's Paga Paga Paga Movie OTT Streaming On Aha: ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్ కోటి విలన్‌గా ఓ మూవీ చేశారని మీకు తెలుసా? స్టార్ హీరోలు, ఆర్భాటాలు లేకపోవడంతో ఈ మూవీకి అంతగా ఎలివేషన్ రాలేదు. దాదాపు మూడేళ్ల తర్వాత ఈ క్రైమ్ థ్రిల్లర్ ఇప్పుడు ఓటీటీలో అందుబాటులోకి వచ్చింది.

Continues below advertisement

ఏ మూవీ... ఎందులో స్ట్రీమింగ్ అంటే?

అభిలాష్ సుంకర హీరోగా పరిచయం అయిన ఫస్ట్ మూవీ 'పగ పగ పగ'. ఈ మూవీలో నెగిటివ్ రోల్‌లో ప్రముఖ సంగీత దర్శకుడు కోటి నటించారు. ఈ మూవీకి రవిశ్రీ దుర్గా ప్రసాద్ దర్శకత్వం వహించగా... దీపికా ఆరాధ్య హీరోయిన్‌గా నటించారు. వీరితో పాటు బెనర్జీ కీలక పాత్ర పోషించారు. సత్యనారాయణ సుంకర నిర్మించారు. 2022 సెప్టెంబర్ 22న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ అనుకున్నంత సక్సెస్ కాలేదు. దాదాపు మూడేళ్ల తర్వాత ప్రముఖ ఓటీటీ 'ఆహా'లో మూవీ అందుబాటులోకి వచ్చింది.   

Continues below advertisement

Also Read: తండ్రి కూతురు మధ్యలో ఓ లవర్ - ప్రతీ మిడిల్ క్లాస్ ఫాదర్‌ను టచ్ చేసే 'బ్యూటీ' ట్రైలర్ 

స్టోరీ ఏంటంటే?

ఇద్దరు ప్రాణ స్నేహితులు... నమ్మక ద్రోహం... వారి పిల్లల లవ్ చుట్టూ ఈ స్టోరీ సాగుతుంది. జగదీష్ (కోటి) కృష్ణ (బెనర్జీ) ఫ్రెండ్స్. దందాలు చేస్తూ ఎదుగుతూ ఉంటారు. జగదీష్ కోరిక మేరకు ఓ యువకుడిని మర్డర్ చేస్తాడు కృష్ణ. జైలుకు వెళ్తున్న కృష్ణ కుటుంబానికి అండగా ఉంటానని నమ్మబలుకుతాడు. ఆ తర్వాత కృష్ణ కుటుంబాన్ని జగదీష్ పట్టించుకోడు. కృష్ణ భార్య కష్టపడి తన కొడుకు అభి (అభిలాష్)ను చదివిస్తుంది. అటు జగదీష్ ఓ తిరుగులేని శక్తిగా ఎదుగుతాడు. అతని కూతురు సిరి అంటే ప్రాణం.

అభి సిరి ఇద్దరూ ఒకే కాలేజీలో చదువుతుండగా ఇద్దరికీ పరిచయం ఏర్పడి ప్రేమగా మారుతుంది. జగదీష్‌కు కుడి భుజంగా ఉన్న సూరిబాబు (భరణి శంకర్) ఈ విషయాన్ని జగదీష్‌కు చెబుతాడు. అయితే, అభి... కృష్ణ కొడుకు అని తెలుసుకున్న జగదీష్ వీరి పెళ్లికి నిరాకరిస్తాడు. దీంతో ఇద్దరూ లేచిపోయి పెళ్లి చేసుకుంటారు. అప్పుడు జగదీష్ ఏం చేశాడు? అసలు జైలు నుంచి కృష్ణ బయటకు వచ్చాడా? జగదీష్ మోసానికి కృష్ణ ఎలా బుద్ధి చెప్పాడు? అనేది తెలియాలంటే మూవీ చూడాల్సిందే.