OTT Releases This Week: 'రామ్ నగర్ బన్నీ' to 'పాతాళ్ లోక్' సీజన్ 2 వరకు... ఈ వారం ఓటీటీలోకి 8 ఇంట్రెస్టింగ్ సినిమాలు, సిరీస్‌లు

New OTT Releases This Week: ఎప్పటిలాగే ఈవారం కూడా ప్రేక్షకులకు ఓటీటీలలో మరింత ఎంటర్టైన్మెంట్ ఉండబోతోంది. నెట్ ఫ్లిక్స్, హాట్ స్టార్, ఆహా వంటి ఓటీటీలలో ఈ వారం స్ట్రీమింగ్ కాబోతున్న సినిమాల లిస్ట్.

Continues below advertisement

జనవరి 14 నుంచి 19 వరకు కొన్ని మోస్ట్ అవైటింగ్ తెలుగు, తమిళ, మలయాళ కొరియన్ సినిమాలు ఓటీటీలలో రిలీజ్ కాబోతున్నాయి. పాణి నుంచి అయామ్ కథలన్ వరకు ఈ వారం డిజిటల్ ప్లాట్ ఫామ్ లలో రిలీజ్ కాబోతున్న సినిమాలు ఏంటో తెలుసుకుందాం. 

Continues below advertisement

అన్ మాస్క్డ్
ఆఫీస్ కామెడీతో పాటు యాక్షన్, ఇన్వెస్టిగేషన్ వంటి అంశాలన్నీ ఉండే సినిమా కోసం చూస్తున్నారా? అయితే ఈ కొరియన్ డ్రామా 'అన్‌మాస్క్డ్' మీ కోసమే. ఇందులో కిమ్ హే-సూ, జంగ్ సంగ్-ఇల్, జూ జోంగ్-హ్యూక్ ప్రధాన పాత్రలు పోషించారు. 'అన్‌మాస్క్‌డ్' స్టోరీ విషయానికొస్తే... జర్నలిస్ట్ ల బృందం ఒక ప్రముఖ నటుడితో సంబంధం ఉన్న ఇరవై ఏళ్ల నాటి కోల్డ్ బ్లడెడ్ మర్డర్ కేసును ఇన్వెస్టిగేట్ చేసి, పరిష్కరించడానికి ప్రయత్నిస్తుంది. ఆ హత్యలో దాగి ఉన్న నిజాలు, కుట్రల నెట్‌వర్క్‌ను వెలికితీసే క్రమంలో దర్యాప్తు ఎలా సాగుతుందనేది ఆసక్తికరంగా ఉంటుంది. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఈ మూవీ జనవరి 15 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. 

పాణి   
'పాణి' కథ ఓ పెళ్ళయిన జంట చుట్టూ తిరుగుతుంది. సంతోషంగా బ్రతుకుతున్న ఈ జంట జీవితంలోకి అనుకోని విధంగా నేర ప్రవృత్తి ఉన్న ఇద్దరు యువకులు ఎంట్రీ ఇవ్వడంతో స్టోరీ మలుపు తిరుగుతుంది. ఈ చిత్రంలో జోజు జార్జ్, మెర్లెట్ ఆన్ థామస్, సాగర్ సూర్య, బాబీ కురియన్, జునైజ్ వీపీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ మలయాళ క్రైమ్ థ్రిల్లర్ జనవరి 16 నుంచి సోనీ లివ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. 

రైఫిల్ క్లబ్
ఆయుధ వ్యాపారి ముఠాను ఎదుర్కొనే చారిత్రక రైఫిల్ క్లబ్ స్టోరీనే ఈ మూవీ. ఈ చిత్రంలో హనుమాన్‌ కైంద్, అనురాగ్ కశ్యప్, దిలీష్ పోతన్, విష్ణు అగస్త్య, వాణీ విశ్వనాథ్, సురభి లక్ష్మి కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ మలయాళ చిత్రం జనవరి 16 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉంటుంది. 

అయామ్ కథలన్ 
ఒక కళాశాల విద్యార్థి... తన మాజీ ప్రియురాలి తండ్రికి చెందిన కంపెనీ భద్రతా వ్యవస్థను హ్యాక్ చేయాలని డిసైడ్ అవుతాడు. మరి అతను అనుకున్నది చేయగలిగాడా? అసలు అలా చేయాలని ఎందుకు అనుకున్నాడు? అనేది తెరపై చూడాల్సిందే. ఈ చిత్రంలో నస్లెన్ కె. గఫూర్, అనీష్మా, లిజోమోల్ జోస్, వినీత్ వాసుదేవన్, సజిన్ చెరుకైల్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.  ఈ మలయాళ చిత్రం మనోరమ మ్యాక్స్‌లో జనవరి 17 నుంచి స్ట్రీమింగ్ కానుంది.  

విడుతలై పార్ట్ 2 
విజయ్ సేతుపతి, మంజు వారియర్, భవానీ శ్రీ, సూర్య సేతుపతి, రాజీవ్ మీనన్ ముఖ్య పాత్రలు పోషించిన ఈ మూవీ గత ఏడాది డిసెంబర్ లో థియేటర్లలో రిలీజైన సంగతి తెలిసిందే. ఈ తమిళ చిత్రం జనవరి 17 నుంచి జీ5 లో స్ట్రీమింగ్ కానుందని సమాచారం.

Also Read: టీడీపీ, జనసేనకు బుల్లి రాజు ప్రచారం... ఏపీ ఎన్నికల్లో వెంకీ కొడుకుగా నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ రేవంత్ భీమల ఏం చేశాడో చూశారా?

పాతాళ్ లోక్ సీజన్ 2  
ఐదేళ్ల ఎదురు చూపుల తర్వాత 'పాతాళ్ లోక్' రెండవ సీజన్‌ తెరపైకి రాబోతోంది. ఈ సిరీస్ లో జైదీప్ అహ్లావత్, గుల్ పనాగ్, నీరజ్ కబీ, ఇష్వాక్ సింగ్, స్వస్తిక ముఖర్జీ, అభిషేక్ బెనర్జీ, తిలోటమా షోమ్, నగేష్ కుకునూర్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.  'పాతాళ్ లోక్' సీజన్ 2 జనవరి 17 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది.  

ది రోషన్స్ 
శశి రంజన్ దర్శకత్వం వహించిన ఈ డాక్యు-సిరీస్ భారతీయ సినిమాపై హృతిక్ రోషన్ ఫ్యామిలీ మూడు తరాల ప్రభావం ఎలా ఉంది? అనే విషయాన్ని ప్రేక్షకులకు చూపించనుంది. రోషన్ ఫ్యామిలీ విజయం, కష్టాలు, వారసత్వాన్ని ఇందులో చూడవచ్చు 'ది రోషన్స్' జనవరి 17న నెట్‌ఫ్లిక్స్ లో అందుబాటులో ఉంటుంది. 

అలాగే జనవరి 17న ఆహాలో 'రామ్ నగర్ బన్నీ' అనే తెలుగు మూవీ స్ట్రీమింగ్ కానుంది. 

Also Readకెరీర్‌లో ఒక్క ప్లాప్ కూడా చూడని బ్లాక్ బస్టర్ పొంగల్ డైరెక్టర్... అనిల్ రావిపూడి సక్సెస్ మంత్ర ఇదే

Continues below advertisement