Upcoming OTT release in May 2024: వీకెండ్ కంప్లీట్ అయ్యింది. మండే వచ్చేసింది. ఆఫీసు నుంచి ఇంటికి వచ్చాక ఉద్యోగాలు, ఉదయం నుంచి సాయంత్రం వరకు పని చేసిన హౌస్ వైఫ్ / హజ్బెండ్స్ సరదాగా ఇంటిపట్టున ఉండి కాలక్షేపం చేయడానికి ఈ వారం ఓటీటీల్లో వస్తున్న కొత్త వెబ్ సిరీస్‌లు, సినిమాలు ఏవో చూసేద్దామా!?


ప్రేక్షకులు అందరి చూపు 'హీరామండీ' వైపు
ఓటీటీలో ఈ వారం వస్తున్న క్రేజీ వెబ్ సిరీస్ అంటే 'హీరామండీ' (Heeramandi Web Series) అని చెప్పడంలో ఎటువంటి సందేహం అవసరం లేదు. ప్రముఖ హిందీ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ క్రియేట్ చేసిన సిరీస్ ఇది. ఆయనతో పాటు మితాక్షర కుమార్ దర్శకత్వం వహించారు. మనీషా కొయిరాలా, సోనాక్షీ సిన్హా, అదితి రావు హైదరి, రిచా చద్దా, సంజీదా షేక్, షర్మిన్ సెగల్ ప్రధాన తారాగణం. 



మే 1 నుంచి నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో 'హీరామండీ' స్ట్రీమింగ్ కానుంది. మొఘల్ కాలంలో లాహోర్ (ప్రస్తుతం పాకిస్తాన్ దేశంలో ఉన్న నగరం) సిటీలో నృత్యం చేసే కొందరు మహిళల నేపథ్యంలో సిరీస్ తెరకెక్కించారు. సంజయ్ లీలా భన్సాలీ దర్శకుడు కావడంతో పాన్ ఇండియా ప్రేక్షకుల చూపు 'హీరామండీ' వైపు ఉంది.



  • అజయ్ దేవగణ్, జ్యోతిక, మాధవన్ ప్రధాన పాత్రల్లో నటించిన హిందీ సినిమా 'సైతాన్' సైతం ఈ వారం నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో సందడి చేయనుంది. మే 3వ తేదీ నుంచి ఆ సినిమా స్ట్రీమింగ్ కానుంది.

  • నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో ఈ వారం విడుదల అవుతోన్న మరో వెబ్ సిరీస్ 'ది ఏ టిపికల్ ఫ్యామిలీ'. ఈ కొరియన్ డ్రామా మే 4 నుంచి స్ట్రీమింగ్ కానుంది.

  • ఏప్రిల్ 30న 'Fiasco' అనే హాలీవుడ్ వెబ్ సిరీస్ కూడా స్ట్రీమింగ్ కానుంది. ఇది 'ఎ'(అడల్ట్) సిరీస్! మే 2 నుంచి 'టిపి బాన్' అనే యానిమేషన్ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది.


Also Readశృతి హాసన్ మళ్లీ ఒంటరే... బాయ్‌ ఫ్రెండ్‌ తో బ్రేకప్, ఇన్‌స్టాలో అన్‌ ఫాలో!



మే 5 నుంచి హాట్‌స్టార్‌లో 'మంజుమ్మెల్ బాయ్స్'
మలయాళ మూవీ ఇండస్ట్రీలో బిగ్గెస్ట్ బాక్సాఫీస్ బ్లాక్ బస్టర్ 'మంజుమ్మెల్ బాయ్స్' (Manjummel Boys Movie). తెలుగులో డబ్బింగ్ చెయ్యగా... ఇక్కడ కూడా  బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించింది. ఇప్పుడీ సినిమా ఓటీటీలో సందడి చెయ్యడానికి రెడీ అయ్యింది. మే 5వ తేదీ నుంచి డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌ ఓటీటీలో సినిమా స్ట్రీమింగ్ కానుంది. తెలుగుతో పాటు మరో నాలుగు భాషల్లో అందుబాటులోకి వస్తుంది. 



  • 'మంజుమ్మెల్ బాయ్స్' కంటే ముందు హాట్‌స్టార్‌ ఓటీటీలో ఏప్రిల్ 30వ తేదీ నుంచి 'ది వెయిల్' వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. ఇది ఇంగ్లీష్ సిరీస్! 


జియో సినిమాలో Wonka Movie 2023



  • మే 3వ తేదీ నుంచి 'జియో సినిమా' ఓటీటీలో హాలీవుడ్ సినిమా 'వొంకా 2023' స్ట్రీమింగ్ కానుంది. ఆ రోజున 'హాక్స్ 3' వెబ్ సిరీస్, 'ది టాటూయిస్ట్ ఆఫ్ ఆష్‌విట్జ్' సిరీస్ కూడా విడుదల కానున్నాయి.

  • అమెజాన్ ప్రైమ్ వీడియోలో 'ది ఐడియా ఆఫ్ యు' సినిమా మే 2న, 'క్లార్క్‌సన్ ఫార్మ్' వెబ్ సిరీస్ మూడో సీజన్ మే 3న విడుదల కానున్నాయి.

  • ఆహా తమిళ్ ఓటీటీలో వైభవ్ హీరోగా, నందితా శ్వేతా, తాన్యా హోప్ హీరోయిన్లుగా నటించిన 'రణం ఆరం తవరెల్' సినిమా మే 1న విడుదలకు సిద్ధమైంది.


Also Readకాజల్‌ తో నవీన్ చంద్ర లవ్లీ రొమాంటిక్ సాంగ్ - సత్యభామ సరసం చూశారా?