Sundeep Kishan's Ooru Peru Bhairavakona OTT Release Update : ఈ మధ్య చాలామంది సినిమాలను థియేటర్లకి వెళ్లి చూడటం మానేశారు. "ఆ ఓటీటీల్లోకి వచ్చేస్తున్నాయిగా" అనే ఫీలింగ్‌లో ఉంటున్నారు. ఇక వాళ్ల ఫీలింగ్స్ నిజమయ్యేలా చాలా సినిమాలో రిలీజైన కొద్దిరోజుల్లోనే ఓటీటీల్లోకి వచ్చేస్తున్నాయి. ఈ మధ్యకాలంలో సర్‌ప్రైజింగ్‌గా చాలా సినిమాలు ఓటీటీల్లో ప్రత్యక్షమయ్యాయి కూడా. ఇక ఇప్పుడు సందీప్ కిషన్ నటించిన 'ఊరు పేరు భైరవకోన' అనే హారర్ సినిమా కూడా ఓటీటీల్లోకి వచ్చేస్తోందట. ఫాంటసీ అడ్వెంచరస్ థ్రిల్లర్‌గా వచ్చిన ఈ సినిమా ఆడియన్స్‌ని థియేటర్ల దగ్గర బాగానే ఆకట్టుకుంది. అయితే, ఇప్పుడు అనుకున్న టైం కంటే ఒక వారం ముందుగానే ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేస్తుందని సోషల్ మీడియాలో టాక్ గట్టిగా నడుస్తోంది.
స్ట్రీమింగ్ ఎప్పుడు? ఎక్కడ?
సందీప్ కిషన్, వర్ష బొల్లమ్మ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా 'ఊరు పేరు భైరవకోన'. హర్రర్ జోనర్‌లో తీసిన ఈ సినిమా.. జనాల్లో మంచి క్రేజ్‌ని క్రియేట్ చేసుకుంది. ట్రైలర్, ఫస్ట్ పోస్టర్‌తో ఈ సినిమాపై భారీగానే అంచనాలు పెట్టుకున్నారు ప్రేక్షకులు. ఇక ఫిబ్రవరి 16న రిలీజైన ఈ సినిమా డీసెంట్ టాక్ తెచ్చుకుంది. దీంతో ఓపెనింగ్స్ బాగానే వచ్చాయి. కలెక్షన్స్ కూడా పర్వాలేదు అనిపించాయి. అయితే, ఈ సినిమాకి సంబంధించి ఓటీటీ రైట్స్ మాత్రం భారీగా అమ్ముడపోయినట్లు టాక్ నడుస్తోంది. ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ 'జీ 5' ఈ సినిమాకి భారీగా డబ్బులు చెల్లించినట్లు టాక్ వినిపిస్తోంది.
ఇక, రూల్స్ ప్రకారం సినిమా రిలీజైన 45 రోజులకి ఓటీటీలోకి రావాలి. దీంతో అటు ఇటుగా మార్చి 15న ఓటీటీలో రీలీజ్ అవుతుంది అనుకున్నారు. అయితే, ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్‌కి సంబంధించి వార్త నెట్టింట్లో వైరల్‌గా మారింది. అనుకున్న టైం కంటే.. ముందే రిలీజ్ అవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. మార్చి 8న ఈ సినిమా రిలీజ్ కానుందని సమాచారం. జీ 5 నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
సందీప్ కిషన్ హీరోగా నటించిన 'ఊరు పేరు భైరవకోన' సినిమాని వీఐ ఆనంద్ డైరెక్ట్ చేశారు. ఈ సినిమా అనిల్ సుంకర సమర్పణలో హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేశ్ దండా నిర్మించారు. వర్ష బొల్లమ్మ, కావ్య థాపర్ హీరోయిన్లుగా చేశారు. శేఖర్ చంద్ర మ్యూజిక్ ఇచ్చాడు. వెన్నెల కిశోర్, హర్ష, రవి శంకర్ కీలక పాత్రలను పోషించారు. 'ఊరు పేరు భైరవకోన' సినిమా రిలీజ్‌కి ముందు చిక్కులు ఎదుర్కొంది. లీగల్ ఇష్యూస్ రావడంతో సినిమా అనుకున్న టైం కంటే ఆలస్యంగా విడుదలైంది. కాగా.. ఫిబ్రవరి 16న ఎట్టకేలకు రిలీజైంది ఈ సినిమా.
ఇక ఈ సినిమా పెయిడ్ ప్రీమియర్స్‌కి మంచి టాక్ వచ్చింది. దీంతో కలెక్షన్లు కూడా బాగానే వచ్చాయి. ఫస్ట్‌డే కలెక్షన్లు బాగానే వచ్చాయి. సందీప్ కిషన్ కెరీర్‌లో హయ్యస్ట్ ఓపెనింగ్ ఇచ్చిన సినిమా 'ఊరు పేరు భైరవకోన'.
Also Read: ‘జై హనుమాన్’కు అంతా సిద్ధం - ఆసక్తికర విషయాలు చెప్పిన ప్రశాంత్ వర్మ