OTT Tamil Crime Thriller: 30 రోజుల్లోపే ఓటీటీలోకి వచ్చేస్తున్న తమిళ క్రైమ్ థ్రిల్లర్.... ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చు అంటే?
Once Upon A Time in Madras OTT Release: వన్స్ అపాన్ ఎ టైమ్ ఇన్ మద్రాస్ అనే తమిళ క్రైమ్ థ్రిల్లర్ సినిమా ఆహా తమిళ ఓటీటీలో స్ట్రీమింగ్ కు సిద్ధంగా ఉంది. ఈ మూవీ ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందంటే?

భరత్, అభిరామి లీడ్ రోల్స్ పోషించిన తమిళ క్రైమ్ థ్రిల్లర్ 'వన్స్ అపాన్ ఎ టైం ఇన్ మద్రాస్'. థియేటర్లలోకి వచ్చి నెల రోజులు కూడా గడవక ముందే ఈ మూవీ ఓటీటీలోకి అడుగు పెట్టబోతోంది.
ఆహాలో 'వన్స్ అపాన్ ఎ టైం ఇన్ మద్రాస్'
'వన్స్ అపాన్ ఎ టైం ఇన్ మద్రాస్' మూవీలో భరత్, షాన్, అభిరామి, తలైవాసల్ విజయ్, పిజిఎస్, రాజాజీ, అంజలి నాయర్, పవిత్ర లక్ష్మి, సయ్యద్, కల్కి, సిని తదితరులు నటించారు. దీనికి జోస్ ఫ్రాంక్లిన్ సంగీతం అందించగా, ప్రసాద్ మురుగన్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని ఫ్రైడే ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్ పై కెప్టెన్ ఎంపి ఆనంద్ నిర్మించారు. 'వన్స్ అపాన్ ఎ టైం ఇన్ మద్రాస్' మూవీ 2024 డిసెంబర్ 13న థియేటర్లోకి వచ్చింది. తమిళంలో రిలీజై, ఆడియన్స్ నుంచి పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ మూవీ జనవరి 17 నుంచి ఆహా తమిళ ఓటీటీలో స్ట్రీమింగ్ కి సిద్ధమైంది. ఊహించిన దాని కంటే ముందే 'వన్స్ అపాన్ ఎ టైం ఇన్ మద్రాస్' మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ కు సిద్ధం కావడంతో ఆసక్తి నెలకొంది.
Also Read: 'దేవర' విలన్ సైఫ్ అలీ ఖాన్ మీద దాడి... బలమైన కత్తిపోట్లు, తీవ్ర గాయాలతో ఆసుపత్రికి
'వన్స్ అపాన్ ఎ టైం ఇన్ మద్రాస్' స్టోరీ ఇదే
సినిమా మొత్తం ఒకే తుపాకీ చుట్టూ తిరుగుతుంది. ఆ ఒక్క తుపాకీ ఒక వ్యక్తి నుంచి ఇంకో వ్యక్తి దగ్గరికి మారి, చెన్నైలోని పలువురి జీవితాలను ఎలా మారుస్తుందో ఈ సినిమాలో చూడొచ్చు. రంగరాజ అనే రిటైర్డ్ ఆర్మీ అధికారితో సినిమా మొదలవుతుంది. అతను సుదర్శన్ అనే అబ్బాయిని కాల్చి చంపుతాడు. ఆ తర్వాత బుల్లెట్ మిస్ అవ్వడంతో, కథ మలుపు తిరుగుతుంది. దీంతో ఆ రిటైర్డ్ ఆర్మీ అధికారి తుపాకీని కాలువలో విసిరేస్తాడు. తరువాత అదే తుపాకీ సావిత్రి అనే మున్సిపాలిటీ వర్కర్ కి దొరుకుతుంది. అప్పుల్లో కూరుకుపోయిన ఆమె, ఆ అప్పులు తీర్చవచ్చు అనే ఆశతో ఈ తుపాకిని అమ్మడానికి ప్రయత్నిస్తుంది. కానీ అనుకోకుండా తన కుమార్తెపై దాడి చేసిన వ్యక్తి మూర్తిని కాల్చడానికి ఈ తుపాకీని ఉపయోగిస్తుంది.
అనంతరం ఆ తుపాకీతో అనిత తండ్రి తన కూతుర్ని లవ్ చేస్తున్నాడు అనుకుని కతిల్ అనే అమాయకుడిని చంపేస్తాడు. ఇక రాజా అనే వ్యక్తి తన భార్య రాచల్ ను రక్షించడానికి ప్రయత్నిస్తాడు. ఆపరేషన్ కోసం డబ్బులు అవసరమవుతాయి. దీంతో ఆ ప్రయత్నంలో రాజా ఒక సామాజిక కార్యకర్తను హత్య చేస్తాడు. కానీ చివరికి అతను ఒక్కడే తన భార్య జీవితాన్ని రక్షించగల వ్యక్తి అని గ్రహిస్తాడు. అలాగే మరోవైపు మది అనే నవవధువు తన భర్త రహస్యాలు తెలుసుకొని, అత్తమామలపై పగ తీర్చుకుంటుంది. ఇలా ఈ ఒక్క తుపాకీ పలువురి జీవితాలను ఎలా మార్చింది ? చివరికి ఏం జరిగింది? అనేదే 'వన్స్ అపాన్ ఎ టైం ఇన్ మద్రాస్' స్టోరీ. స్టోరీ లేయర్స్ లేయర్స్ గా, ఇంట్రెస్టింగ్ గా సాగుతుంది.