Thiruveer's Oh Sukumari OTT Release Date Locked : టాలీవుడ్ యంగ్ హీరో తిరువీర్, ఐశ్వర్య రాజేష్ ప్రధాన పాత్రల్లో నటించిన రీసెంట్ రొమాంటిక్ కామెడీ ఓ సుకుమారి (Oh Sukumari). జులై 17న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మిక్స్‌డ్ టాక్ సొంతం చేసుకుంది. ఇప్పుడు 20 రోజుల్లోపే ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అవుతోంది.
ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఈ మూవీ ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఆగస్ట్ 7 నుంచి స్ట్రీమింగ్ కాబోతోంది. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో అందుబాటులోకి రానుంది. 'ఇది అందరినీ మరింత షాక్‌కు గురి చేయబోతోంది.' అంటూ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ మూవీకి భరత్ దర్శన్ దర్శకత్వం వహించగా... మురళీ ధర్ గౌడ్, మ్యాడ్ ఫేమ్ విష్ణు ఓయ్, ఝాన్సీ, ఆమని, ఆనందకోట జయరామ్ తదితరులు కీలకపాత్రలు పోషించారు.
స్టోరీ ఏంటంటే?
యాదగిరి అలియాస్ యాది (తిరువీర్) పెళ్లికి రెడీ అవుతాడు. పక్క ఊరిలోని ఓ అమ్మాయిని చూసేందుకు వెళ్లి ధామిని (ఐశ్వర్య రాజేష్)ని ఇష్టపడతాడు. ఆమెనే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంటాడు. ధామినిని ఎలాగైనా ఊరి నుంచి పంపించేయాలని ఆ గ్రామస్థులు కూడా ప్లాన్ చేస్తుంటారు. దీనికి కారణం ఆమెకు ఓ విచిత్రమైన సమస్య ఉంటుంది. ఎవరైనా ఆమెను ముట్టుకుంటే షాక్ కొడుతుంది. దీని వల్ల కుటుంబ సభ్యులకే కాక ఊళ్లో వాళ్లు కూడా చాలా ఇబ్బందులు పడుతుంటారు.
అయితే, ఈ విషయాన్ని దాచి పెట్టి మరీ యాదితో ధామిని పెళ్లి ఘనంగా చేస్తారు. ఆ తర్వాత అసలు చిక్కులు మొదలవుతాయి. ముట్టుకుంటేనే షాక్ కొట్టే భార్యతో ఆ భర్త ఎలా కాపురం చేశాడు? అత్తారింట్లో ధామిని ఎలా కలిసిపోయింది? అసలు ఆమెకు ఈ షాక్ సమస్య ఎలా వచ్చింది? దీని వెనుక ఏదైనా శక్తి ఉందా? యాది ఎందుకు ఆమెనే పట్టుబట్టి మరీ పెళ్లి చేసుకున్నారు? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
