Vanda Devullu Movie OTT Streaming Date Platform: విజయ్ ఆంటోనీకి తెలుగు రాష్ట్రాల్లో మార్కెట్ క్రియేట్ కావడానికి కారణమైన సినిమా 'బిచ్చగాడు'. దానిని శశి దర్శకుడు. అతని దర్శకత్వంలో విజయ్ ఆంటోనీ మళ్ళీ నటించిన సినిమా 'వంద దేవుళ్ళు'. తమిళంలో 'నూరు సామి'గా తీసిన సినిమాకు తెలుగు డబ్బింగ్ ఇది. ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ అనౌన్స్ చేసింది జీ5. మూవీ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ZEE5లో ఆగస్టు 7 నుంచి 'వంద దేవుళ్ళు' స్ట్రీమింగ్!Vanda Devullu Zee5 Streaming Date Telugu: 'వంద దేవుళ్ళు' డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ వేదిక జీ5 సొంతం చేసుకుంది. తెలుగు, తమిళ భాషలతో పాటు మిగతా భాషల్లోనూ స్ట్రీమింగ్ చేయనుంది.
ఆగస్టు 7వ తేదీ నుంచి 'వంద దేవుళ్ళు'ను స్ట్రీమింగ్ చేయనున్నట్లు జీ5 సంస్థ తెలిపింది. ఈ శుక్రవారం నుంచి డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లో సినిమా అందుబాటులోకి వస్తుంది.
తల్లికి మళ్ళీ పెళ్లి చేయాలనుకునే కొడుకు!'వంద దేవుళ్ళు' కథ విషయానికి వస్తే... శ్వాసికకు ఇద్దరు అబ్బాయిలు జన్మించిన తర్వాత భర్త మరణిస్తాడు. అప్పట్నుంచి ఒంటరిగా జీవితాన్ని వెళ్లదీస్తుంది. తన ఇద్దరు పిల్లల్నీ పెంచి పెద్ద చేస్తుంది. మధ్యలో పెళ్లి చేసుకోవాలని అనుకున్నా... కొడుకు కోప్పడటంతో ఆ ఆలోచనను పక్కన పెడుతుంది. అయితే... కొన్ని రోజుల తర్వాత తల్లికి మళ్ళీ పెళ్లి చేయాలని కొడుకు ప్రయత్నిస్తాడు. అప్పుడు ఏమైంది? అనేది సినిమా.
'వంద దేవుళ్ళు' థియేటర్లలో ఏవరేజ్ హిట్ అనిపించింది. బాక్సాఫీస్ బరిలో ఈ సినిమాకు ఆశించిన వసూళ్ళు రాలేదు. అయితే... ఎమోషనల్ స్టోరీ పాయింట్, శ్వాసిక & విజయ్ ఆంటోనీ నటనకు కొంత మంది ప్రేక్షకుల నుంచి ప్రశంసలు దక్కాయి. అజయ్ ధీషన్, లిజోమోల్ జోస్, కరుణాస్, శక్తి కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమాను ఈ వారం నుంచి జీ5లో చూడవచ్చు.
