August First Week OTT Releases: మూవీ లవర్స్‌కు ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ అందించేందుకు శుక్రవారం ఒక్కరోజే ఏకంగా 16 సినిమాలు పలు ఓటీటీల్లో అందుబాటులోకి వచ్చాయి. యాక్షన్ ఎంటర్‌టైనర్స్‌తో పాటు ఫ్యామిలీ, ఫన్ డ్రామా మూవీస్ స్ట్రీమింగ్ అవుతున్నాయి. తెలుగులోనే 6 మూవీస్ ఉన్నాయి. మరి ఆ లిస్ట్ ఓసారి పరిశీలిస్తే...
సిద్దార్థ్ '3BHK'
సిద్దార్థ్, ఆర్.శరత్ కుమార్ తండ్రీ కొడుకులుగా నటించిన లేటెస్ట్ మూవీ '3BHK'. థియేటర్లలోకి వచ్చిన నెల రోజుల్లోపే ప్రముఖ ఓటీటీ 'అమెజాన్ ప్రైమ్'లో శుక్రవారం నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగు, తమిళ భాషల్లో అందుబాటులో ఉంది. ఈ మూవీకి శ్రీ గణేష్ దర్శకత్వం వహించగా... దేవయాని, మీతా రంగనాథ్, చైత్ర, యోగిబాబు కీలక పాత్రలు పోషించారు. ఓ మధ్య తరగతి కుటుంబం తమ సొంతింటి కలను నెరవేర్చుకునేందుకు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చిందనేదే ఈ మూవీ స్టోరీ.
సుహాస్ 'ఓ భామ అయ్యోరామ'
యంగ్ హీరో సుహాస్, మాళవిక మనోజ్ ప్రధాన పాత్రల్లో నటించిన లేటెస్ట్ కామెడీ ఎంటర్‌టైనర్ 'ఓ భామ అయ్యో రామ'. ఈ మూవీ 'ఈటీవీ విన్'లో శుక్రవారం (ఆగస్ట్ 1) నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. ఈ మూవీకి రామ్ గోదల దర్శకత్వం వహించగా... అలీ, ప్రభాస్ శీనులు కీలక పాత్రలు పోషించారు.
ఈ మూవీతో పాటే తమిళ యాక్షన్ థ్రిల్లర్ 'రెడ్ శాండల్ వుడ్' మూవీ కూడా 'ఈటీవీ విన్'లో అందుబాటులోకి వచ్చింది. నిజ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ మూవీకి గురు రామానుజం దర్శకత్వం వహించారు.
నితిన్ 'తమ్ముడు'
యంగ్ హీరో నితిన్ లేటెస్ట్ మూవీ 'తమ్ముడు' ప్రముఖ ఓటీటీ 'నెట్ ఫ్లిక్స్'లో శుక్రవారం (ఆగస్ట్ 1) నుంచి స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో అందుబాటులో ఉండనుంది. ఈ మూవీకి వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించగా... దిల్ రాజు నిర్మించారు. సీనియర్ హీరోయిన్ లయతో పాటు సప్తమి గౌడ, వర్ష బొల్లమ్మ హీరోయిన్లుగా నటించారు. స్వాసిక, సౌరభ్ సచ్ దేవ్ కీలక పాత్రలు పోషించారు.
Also Read: పాక్ జలాల్లోకి వెళ్లిన ఏపీ మత్స్యకారుల స్టోరీ - 'అరేబియా కడలి' సిరీస్ ట్రైలర్ అదుర్స్
తెలుగు మూవీస్ ఇవే...
తమ్ముడు - నెట్ ఫ్లిక్స్, 3BHK - ప్రైమ్ వీడియో, ఓ భామ అయ్యో రామ - ఈటీవీ విన్, జిన్ (ది పెట్) - సన్ నెక్స్ట్, రెడ్ శాండిల్ వుడ్ - ఈటీవీ విన్, థాంక్యూ నాన్న - ఈటీవీ విన్, సట్టముం నీతియుం (వెబ్ సిరీస్ - జీ5).
తమిళ మూవీస్ - 3BHK - ప్రైమ్ వీడియో & సింప్లీ సౌత్, చక్రవ్యూహం - ఆహా తమిళ్, గట్స్ - Tentkotta
మలయాళం మూవీస్ - సూపర్ జిందగీ - మనోరమ మ్యాక్స్, సురబిల సుందర స్వప్నం - సన్ నెక్స్ట్
హిందీ మూవీస్ - సితారే జమీన్ పర్ (యూట్యూబ్ రెంటల్), బకైటీ (వెబ్ సిరీస్ - జీ5)
ఇంగ్లీష్ మూవీస్ - బ్లాక్ బ్యాగ్ (జియో హాట్ స్టార్), ట్రైన్ వ్రెక్ (నెట్ ఫ్లిక్స్), WWE (వెబ్ సిరీస్ - నెట్ ఫ్లిక్స్), హాట్ మిల్క్ (ప్రైమ్ వీడియో), 28 ఇయర్స్ లేటర్ (ప్రైమ్ వీడియో), ది లిటిల్ ఆఫ్ చుక్ (ప్రైమ్ వీడియో), మై ఆక్స్‌ఫర్డ్ ఇయర్ (నెట్ ఫ్లిక్స్), ట్విస్టెట్ మెటల్ (సీజన్ 2 - సోనీలివ్), కోడ్ ఆఫ్ సైలెన్స్ (ఇంగ్లీష్ సిరీస్ - లయన్స్ గేట్ ప్లే), బోర్డర్ లైన్ (Peacock), విలియమ్ టెల్ - Hulu