Tamannaah's Odela 2 Movie OTT Release On Amazon Prime: మిల్కీ బ్యూటీ తమన్నా (Tamannaah) శివశక్తిగా నటించిన లేటెస్ట్ మూవీ 'ఓదెల 2' (Odela 2) భారీ అంచనాల మధ్య గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఏ సినిమా రిలీజ్ అయినా.. ఆ మూవీ ఓటీటీ రిలీజ్‌పై అందరిలోనూ ఆసక్తి నెలకొంటుంది. థియేటర్లలోకి అలా రిలీజ్ అయ్యిందో లేదో ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందా? అనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది.

ఆ ఓటీటీలోకి..

'ఓదెల 2' మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ 'అమెజాన్ ప్రైమ్ వీడియో' భారీ ధరకు సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా రిలీజ్‌కు ముందే భారీ బిజినెస్ జరిగినట్లు సమాచారం. నాలుగేళ్ల క్రితం డైరెక్ట్‌గా ఓటీటీలో రిలీజ్ అయిన 'ఓదెల రైల్వే స్టేషన్' సినిమాకు సీక్వెల్‌గా మూవీ తెరకెక్కిన సంగతి తెలిసిందే. తమన్నా నాగసాధువుగా నటిస్తుండడం సినిమాపై అంచనాలు పెంచేసింది.

ఈ సినిమాను మధు క్రియేషన్స్, సంపత్ నంది (Sampath Nandi) టీమ్ వర్క్స్ బ్యానర్స్‌పై డి.మధు, సంపత్ నంది నిర్మించారు. సంపత్ నంది కథ అందించగా అశోక్ తేజ దర్శకత్వం వహించారు. దాదాపు రూ.25 కోట్ల బడ్జెట్‌తో మూవీ తెరకెక్కించగా.. డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను 'అమెజాన్ ప్రైమ్ వీడియో' రూ.18 కోట్లకు దక్కించుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు, తెలుగు శాటిలైట్ రైట్స్ కోసం చర్చలు జరుగుతున్నాయి.

ఈ సినిమాలో హెబ్బా పటేల్, వశిష్ఠ సింహ  కీలక పాత్రలు పోషించారు. 'ఓదెల రైల్వే స్టేషన్' మంచి హిట్ సొంతం చేసుకోగా.. 'ఓదెల 2' మూవీపై అంతే స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, టీజర్‌తో స్టోరీపై భారీ హైప్ నెలకొంది.

Also Read: పదేళ్ల తర్వాత కమెడియన్‌గా 'సంతానం' రీఎంట్రీ - 'శింబు' సినిమా కోసం భారీ రెమ్యునరేషన్ తీసుకుంటున్నారుగా!

ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?

సాధారణంగా ఏ సినిమా అయినా థియేటర్లలో రిలీజ్ అయిన 4 వారాల తర్వాత ఓటీటీలోకి స్ట్రీమింగ్ అవుతుంది. ఒకవేళ మూవీ హిట్ టాక్ సొంతం చేసుకుంటే ఓటీటీ రిలీజ్ కాస్త ఆలస్యం అవుతుంది. 'ఓదెల 2' మూవీ సైతం థియేట్రికల్ రన్ పూర్తైన తర్వాత ఓటీటీలోకి వచ్చే ఛాన్స్ ఉంది. 

తెలుగు రాష్ట్రాల నుంచే ఫస్ట్ టాక్

థియేటర్లలోకి ఏ కొత్త సినిమా విడుదలవుతున్నా ముందుగా ట్విట్టర్ రివ్యూ రావడం ఆనవాయితీ. విదేశాల్లో ప్రీమియర్ షోలు చూసి ట్విట్టర్‌లో నెటిజన్లు రివ్యూలు రాస్తుంటారు. అయితే, 'ఓదెల 2' మూవీ టీం మాత్రం రివ్యూలు రాకుండా జాగ్రత్తపడింది. ఈ సినిమాకు ప్రీమియర్ షోలు కూడా వేయలేదు.

అమెరికాలో ప్రీమియర్ షోలు‌ వేస్తే నెగిటివ్ టాక్ వచ్చే అవకాశం ఉందని అనుకున్నారో?, లేదా మరో కారణమో తెలియదు కానీ యూకే, ఆస్ట్రేలియా, దుబాయ్ వంటి దేశాల్లోనూ ఎలాంటి ప్రీమియర్ వేయలేదు. దీంతో సోషల్ మీడియాలోనూ సినిమా గురించి ఎలాంటి హడావుడి లేదు. తెలుగు రాష్ట్రాల నుంచే మూవీ ఫస్ట్ టాక్ బయటకు రానుంది. మరి శివశక్తిగా తమన్నా ప్రేక్షకులను ఎంతవరకూ ఆకట్టుకున్నారో తెలియాల్సి ఉంది.