Tigmanshu Dhulia's Web Series OTT Release Date On Sonyliv: క్రైమ్, హారర్, థ్రిల్లర్ కంటెంట్‌పై ఓటీటీ లవర్స్ ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపుతున్న క్రమంలో ప్రముఖ ఓటీటీ సంస్థలన్నీ ఆ జానర్‌లోనే మూవీస్, సిరీస్‌లను అందుబాటులోకి తెస్తున్నాయి. అలాంటి జానర్‌లోనే రూపొందిన సిరీస్ 'బ్లాక్, వైట్ అండ్ గ్రే – లవ్ కిల్స్' (Black White Gray Love Kills). ఈ సిరీస్ త్వరలోనే ఓటీటీలోకి రిలీజ్ అయ్యేందుకు సిద్ధమవుతుండగా.. తాజాగా మేకర్స్ ట్రైలర్ రిలీజ్ చేశారు.

ట్రైలర్ ఎలా ఉందంటే?

మర్డర్ మిస్టరీ నేపథ్యంలో రూపొందించిన 'బ్లాక్, వైట్ అండ్ గ్రే – లవ్ కిల్స్' సిరీస్ ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంటోంది. ఓ కారులో తన గర్ల్ ఫ్రెండ్‌తో వెళ్తుండగా.. ఆమె ప్రాణాలు కోల్పోవడంతో ట్రైలర్ ప్రారంభం అవుతుంది. ఆ తర్వాత వరుస హత్యలు, హంతకుల కోసం పోలీసుల వేట హైప్ పెంచేశాయి. ఆర్థికంగా వెనుకబడిన నేపథ్యం, వాటి నుంచి తప్పించుకునే యువకుడు, అతడితో ముడిపడి ఉన్న హత్యలు, వాటి వెనుకున్న రహస్యాల్ని ఛేదించే జర్నలిస్ట్ డేనియల్ చుట్టూ ఈ కథ తిరుగుతుంది. డేనియల్ దర్యాప్తు ఈ సిరీస్‌లో ఆద్యంతం ఉత్కంఠభరితంగా, ఆసక్తికరంగా ఉంటుంది. 

Also Read: ఓటీటీలను నమ్ముకుని సినిమా తీయకూడదు... 'అర్జున్ సన్నాఫ్ వైజయంతి' నిర్మాతలు, ఇంటర్వ్యూలో ఇంకేం చెప్పారంటే?

మే 2 నుంచి స్ట్రీమింగ్

టిగ్మాన్షు ధులియా (Tigmanshu Dhulia), మయూర్ మోర్ (Mayur More) ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సిరీస్ ప్రముఖ ఓటీటీ 'సోనీ లివ్‌'లో (Sonyliv) మే 2 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా సదరు ఓటీటీ సంస్థ వెల్లడించింది. 'అన్ని ప్రేమకథలు చరిత్ర సృష్టించవు. కొన్ని క్రైమ్ రిపోర్ట్స్‌గా మారతాయి. నాలుగు శరీరాలు, లెక్కలేనన్ని అబద్ధాలు.' అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ఈ సిరీస్‌కు పుష్కర్ సునీల్ మహాబల్మ్ దర్శకత్వం వహించగా.. స్వరూప్ సంపత్, హేమల్ ఎ. ఠక్కర్ నిర్మించారు. పాలక్ జైస్వాల్, దేవేన్ భోజని, ఎడ్వర్డ్ సోన్నెన్‌బ్లిక్, హక్కిమ్ షాజహాన్, అనంత్ జోగ్, కమలేష్ సావంత్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు.

'బ్లాక్, వైట్ అండ్ గ్రే – లవ్ కిల్స్‌' ప్రాజెక్టులో భాగం కావడం ఆనందంగా ఉందని నటుడు మయోర్ మోర్ అన్నారు. 'ఇది ఒక బోల్డ్, జానర్-బెండింగ్ డాక్యుమెంటరీ. క్రైమ్ థ్రిల్లర్‌ ఇన్వెస్టిగేటివ్ జానర్‌లో ఇది ది బెస్ట్‌గా నిలుస్తుంది. ఈ కథ  అపరాధం, అమాయకత్వం, న్యాయం వంటి వాటిపై అవగాహన కల్పించి.. ప్రశ్నించేలా చేస్తుంది. నా పాత్ర చాలా బాగా వచ్చింది. ఆడియెన్స్ అంతా కూడా ఈ కథకు కనెక్ట్ అవుతారు. ఇది మిమ్మల్ని చాలా కాలం వెంటాడుతుంది’ అని అన్నారు.