Nithiin's Robinhood Creates Records In OTT Streaming: నితిన్, శ్రీలీల జంటగా నటించిన లేటెస్ట్ మూవీ 'రాబిన్ హుడ్'. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ప్లాప్ టాక్ తెచ్చుకున్నా ఓటీటీలో మాత్రం అదరగొడుతోంది. ఈ నెల 10 నుంచి ప్రముఖ ఓటీటీ 'జీ5'లో సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. అదే రోజున 'జీ తెలుగు' ఛానల్‌లోనూ ప్రీమియర్ అయ్యింది.
ఓటీటీలో రికార్డులు
ఓటీటీలో రిలీజ్ అయినప్పటి నుంచీ 'రాబిన్ హుడ్' మూవీ రికార్డులు సృష్టించింది. యాక్షన్, ఎంటర్‌టైన్‌మెంట్‌తో ఫ్యామిలీ ఆడియన్స్‌తో పాటు మాస్ యూత్ ఆడియన్స్‌ను ఆకట్టుకుంటోంది. ఇప్పటివరకూ 100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ సాధించింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా సదరు ఓటీటీ సంస్థ వెల్లడించింది.
Also Read: వాట్ ఏ మూమెంట్ 'పెద్ది' - ఆ విలేజ్‌లో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్.. కొత్త షెడ్యూల్ స్టార్ట్
ఈ మూవీని మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై.. నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్ నిర్మించగా.. వెంకీ కుడుముల దర్శకత్వం వహించారు. నితిన్ సరసన హీరోయిన్ శ్రీలీల నటించారు. లవ్, యాక్షన్, కామెడీ ఎంటర్‌టైనర్‌గా ఈ మూవీ తెరకెక్కింది. మూవీలో సీనియర్ యాక్టర్ రాజేంద్ర ప్రసాద్, వెన్నెల కిశోర్, బ్రహ్మాజీ, షైన్ టైమ్ చాకో, దేవదత్ నాగే, శుభలేఖ సుధాకర్ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాతోనే ప్రముఖ క్రికెటర్ డేవిడ్ వార్నర్ టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. ఎన్నో అంచనాలతో వచ్చిన ఈ మూవీ అనుకున్నంత సక్సెస్ సాధించలేకపోయింది.
స్టోరీ ఏంటంటే?
అనాథగా పెరిగిన రామ్ (నితిన్) ఓ అనాథాశ్రమంలో ఆశ్రయం పొందుతుంటాడు. తనలాంటి ఎందరో అనాథల ఆకలి తీర్చేందుకు దొంగగా మారతాడు. ఆ డబ్బును వివిధ అనాథ శరణాలయాలకు విరాళంగా ఇస్తాడు. అలా ఓ రోజు హోం మినిస్టర్ (ఆడుకాలం నరేన్) బిజినెస్ పార్ట్‌నర్ ఇంట్లోనే చోరీ చేస్తాడు. దీంతో ఎలాగైనా 'రాబిన్‌హుడ్'ను పట్టుకోవాలని సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ విక్టర్ వర్గీస్ (షైన్ టామ్ చాకో)ను రంగంలోకి దించుతారు. అతనికి దొరికినట్లే దొరికి తప్పించుకుంటాడు రామ్. అయితే, తన వల్ల అనాథ శరణాలయాలకు ఇబ్బంది కలగకూడదని కొద్ది రోజులు చోరీలకు విరామం ఇచ్చిన రామ్.. జాన్ స్నో (రాజేంద్రప్రసాద్) నడిపే సెక్యూరిటీ ఏజెన్సీలో ఉద్యోగిగా చేరతాడు.
ఇదే టైంలో ఆ కంపెనీకి భారీ డీల్ వస్తుంది. ఆస్ట్రేలియాలో ఫేమస్ బిజినెస్ మ్యాన్ కూతురు నీరా వాసుదేవ్ (శ్రీలీల) ఇండియాకు వస్తుంది. ఆమె సెక్యూరిటీ బాధ్యతలు ఈ కంపెనీకి వస్తాయి. అసలు నీరా ఎందుకు ఇండియా వచ్చింది?, రుద్రకొండకు ఆమెకు సంబంధం ఏంటి?, అంతర్జాతీయ స్థాయిలో డ్రగ్ మాఫియా వెనుక ఉన్నది ఎవరు?, దానికి నీరా తండ్రి కంపెనీకి ఉన్న సంబంధం ఏంటి?, రాబిన్ హుడ్ అయిన రామ్‌ను పోలీసులు కనిపెట్టారా? అనేది తెలియాలంటే మూవీ చూడాల్సిందే.