'హ్యాపీ డేస్' నుంచి 'రాచరికం', 'కానిస్టేబుల్' వరకు పలు సినిమాల్లో వరుణ్ సందేశ్ (Varun Sandesh) హీరోగా నటించారు. కొన్ని సినిమాల్లో కీలకమైన క్యారెక్టర్లు, విలన్ రోల్స్ చేశారు. ఇన్నాళ్లూ సిల్వర్ స్క్రీన్ మీద సందడి చేసిన ఆయన... ఇప్పుడు డిజిటల్ స్క్రీన్ మీద డెబ్యూకు రెడీ అయ్యారు. ఆయన తొలిసారి ఓ వెబ్ సిరీస్ 'నయనం' చేశారు. డిసెంబర్ 19 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఇవాళ 'నయనం' ట్రైలర్ విడుదల చేశారు.
'నయనం' ట్రైలర్ లాంచ్‌లో వరుణ్ ఏమన్నారంటే?Varun Sandesh Speech At Nayanam Trailer Launch: ''చాలా రోజుల తర్వాత ఒక మంచి ప్రాజెక్ట్ (నయనం వెబ్ సిరీస్) చేశాననే సాటిస్పాక్షన్‌తో నేను ప్రేక్షకుల ముందుకు వస్తున్నాను. డిసెంబర్ 19 ఎప్పుడు వస్తుందా? ప్రేక్షకులు 'నయనం'ను ఎప్పుడు ఎప్పుడు చూస్తారా? అని వెయిట్ చేస్తున్నా'' అని వరుణ్ సందేశ్ చెప్పారు. ఇంకా ఆయన మాట్లాడుతూ... ''ముందు శేఖర్ గారు ఈ కథ గురించి చెప్పారు. స్వాతి, సాధిక ఇచ్చిన నెరేషన్ విని షాకయ్యాను. మరో ఆలోచన లేకుండా నయన్ క్యారెక్టర్ చేయాలని డిసైడయ్యా. జీ5 టీమ్ వండర్ఫుల్ ప్రాజెక్ట్ ప్రేక్షకులకు తీసుకు వస్తుండటం గొప్ప విషయం. ఎస్ఆర్‌టి ఎంటర్‌టైన్‌మెంట్ రామ్ తాళ్ళూరి గారు, రజినీ గారికి థాంక్స్'' అని అన్నారు.
'నయనం' వెబ్ సిరీస్ (Nayanam Web Series Cast)లో వరుణ్ సందేశ్, ప్రియాంక జైన్ ప్రధాన పాత్రల్లో నటించగా... అలీ రెజా, ఉత్తేజ్, రేఖా నిరోషా ఇతర కీలక తారాగణం. ఇదొక సీట్ ఎడ్జ్ సైకో థ్రిల్లర్. స్వాతి ప్రకాశ్ దర్శకత్వం వహించారు. ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్‌తో 'నయనం' రూపొందుతోందని సంగీత దర్శకుడు అజయ్ అరసాడ తెలిపారు.
ఇందులో పోలీస్ ఆఫీసర్ రోల్ చేశా... అలీ రెజా!''నా జీవితంలో ఓ దశలో సినిమాలు రాలేదు. నాకొచ్చిన సినిమాలు పూర్తి కాలేదు. ఏం చేయాలని ఆలోచిస్తూ ఫ్యామిలీ బిజినెస్ చేశా. ఓ రెస్టారెంట్ స్టార్ట్ చేశా. నాకు డబ్బులు వస్తున్నాయి. కానీ, ఏదో మిస్ అయిన ఫీలింగ్. ఆ సమయంలో హిందీ సీరియల్ ఒకటి, ఈ సిరీస్ ఒకటి చేసే ఛాన్స్ వచ్చింది'' అని అలీ రెజా చెప్పారు. 'నయనం' వెబ్ సిరీస్ గురించి ఆయన మాట్లాడుతూ... ''ఇందులో నేను పోలీస్ ఆఫీసర్ రోల్ చేశా. అనూరాధ గారు నా జర్నీలో ఎప్పుడూ భాగమే. నేను ఏదైనా యాక్టింగ్ ఛాన్స్ అడిగిన వెంటనే అవకాశం ఇస్తుంటారు. ఇప్పుడీ సిరీస్‌లోనూ ఛాన్స్ ఇచ్చారు. ఇందులో మీరు డిఫరెంట్ వరుణ్ సందేశ్‌ను చూస్తారు'' అని అన్నారు.
'నయనం' వెబ్ సిరీస్ ట్రైలర్ విడుదల కార్యక్రమంలో జీ5 తెలుగు ఒరిజినల్ కంటెంట్ సాయి తేజ దేశరాజ్, జీ5 తెలుగు చీఫ్ కంటెంట్ ఆఫీసర్ & బిజినెస్ హెడ్ అనురాధ గూడూరు, వెబ్ సిరీస్ నిర్మాత రజినీ తాళ్లూరి, దర్శకురాలు స్వాతి ప్రకాష్, హీరోయిన్ ప్రియాంక జైన్, వరుణ్ సందేశ్ వైఫ్ వితికా శేరు, ఎడిటర్ వెంకట కృష్ణ, సినిమాటోగ్రాఫర్ షోయబ్ సిద్ధికీ తదితరులు పాల్గొన్నారు.