పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan), రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ (Devi Sri Prasad) కాంబినేషన్ అంటే చార్ట్ బస్టర్ హిట్టు. వాళ్ళిద్దరి కలయికలో వచ్చిన సినిమాల్లో పాటలు మ్యూజికల్ హిట్టు. అందులోనూ పవన్ వీరాభిమానుల్లో ఒకరైన హరీష్ శంకర్ (Harish Shankar) దర్శకత్వం వహించిన 'గబ్బర్ సింగ్' పాటలు అభిమానులతో పాటు ప్రేక్షకులకు ఫేవరెట్టు. పవన్, దేవి, హరీష్... ఇప్పుడు ఈ ముగ్గురి కలయికలో రూపొందుతున్న సినిమా 'ఉస్తాద్ భగత్ సింగ్' (Ustaad Bhagat Singh). ఇందులో మొదటి పాట ప్రోమో వచ్చింది.
'ఉస్తాద్...'లో దేఖ్‌లేంగే సాలా...డ్యాన్సుతో కుమ్మేసిన పవర్ స్టార్!Watch Dekhlenge Saala Song Promo: 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమాలోని మొదటి పాట 'దేఖ్‌లేంగే సాలా' సాంగ్ ప్రోమో విడుదల అయ్యింది. దేవి శ్రీ ప్రసాద్ ఇచ్చిన బాణీకి భాస్కరభట్ల రవికుమార్ సాహిత్యం అందించగా... ప్రముఖ హిందీ సంగీత దర్శకుడు - గాయకుడు విశాల్ డడ్లాని ఆలపించారు.
'దేఖ్‌లేంగే సాలా' సాంగ్ ప్రోమోలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లుక్కు స్టైలిష్‌గా ఉంది. హ్యండ్సమ్‌గా కనిపించారు. ఆయన వేసిన స్టెప్పులు చూస్తే... మైఖేల్ జాక్సన్ స్వాగ్ గుర్తుకు వస్తుంది. విడుదలైన కొన్ని క్షణాల్లో సాంగ్ ప్రోమో వైరల్ అయ్యింది. డిసెంబర్ 13న ఫుల్ సాంగ్ రిలీజ్ చేయనున్నట్లు చెప్పారు.
Also Read: Japan Earthquake: జపాన్‌లో భూకంపం... మన బాహుబలి ప్రభాస్ సేఫ్ - రాజా సాబ్ డైరెక్టర్ క్లారిటీ
పవన్ సరసన రాశీ ఖన్నా & శ్రీ లీల'ఓజీ' (దే కాల్ హిమ్ ఓజీ) విజయం తర్వాత పవన్ కళ్యాణ్ నుంచి వస్తున్న సినిమా 'ఉస్తాద్ భగత్ సింగ్'. మాఫియా, గ్యాంగ్‌స్టర్ నేపథ్యంలో యాక్షన్ డ్రామాగా 'ఓజీ' తెరకెక్కింది. పోలీస్ నేపథ్యంలో పవర్ ఫుల్ కమర్షియల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా 'ఉస్తాద్ భగత్ సింగ్' రూపొందుతోంది. 'గబ్బర్ సింగ్' తర్వాత పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబినేషన్ కావడంతో అభిమానుల్లో అంచనాలు మరింత పెరిగాయి.
Also Read: Nivetha Pethuraj: పెళ్ళికి ముందు బ్రేకప్... స్మృతి మంధాన రూటులో హీరోయిన్ నివేదా పేతురాజ్
'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన రాశీ ఖన్నా, శ్రీ లీల నటించారు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకం మీద నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి నిర్మిస్తున్న చిత్రమిది. ఇందులో తమిళ నటుడు పార్తీబన్ కీలక పాత్ర చేస్తున్నారు.