Ravi Teja's Mass Jathara OTT Release Date: మాస్ మహారాజా రవితేజ 75వ సినిమా 'మాస్ జాతర'. థియేటర్లలో అక్టోబర్ 31న రిలీజ్ అయ్యింది. ఇందులో ఆయనకు జంటగా యంగ్ సెన్సేషనల్ హీరోయిన్, తెలుగు అమ్మాయి శ్రీ లీల నటించింది. ఈ సినిమా ఓటీటీ రిలీజ్, స్ట్రీమింగ్ డేట్ అనౌన్స్ చేసింది నెట్‌ఫ్లిక్స్‌.

Continues below advertisement

ఓటీటీలోకి నాలుగు వారాలకు...నవంబర్ 28వ తేదీ నుంచి స్ట్రీమింగ్!Mass Jathara OTT Platform: థియేటర్లలో విడుదలైన నాలుగు వారాల వ్యవధిలో ఓటీటీలోకి 'మాస్ జాతర' వస్తోంది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ఇంటర్నేషనల్ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌ తీసుకుంది. నవంబర్ 28వ తేదీ నుంచి సినిమాను స్ట్రీమింగ్ చేయనున్నట్లు పేర్కొంది.

ఒక దశలో 'మాస్ జాతర' ఓటీటీ స్ట్రీమింగ్ విషయంలో నెట్‌ఫ్లిక్స్‌ వెనుకడుగు వేసినట్టు ప్రచారం జరిగింది. థియేటర్లలో సినిమా డిజాస్టర్ కావడంతో స్ట్రీమింగ్ చేసేందుకు 'నో' చెప్పినట్లు పుకార్లు గుప్పుమన్నాయి. అప్ కమింగ్ స్ట్రీమింగ్ మూవీస్ లిస్టులో 'మాస్ జాతర'ను నెట్‌ఫ్లిక్స్‌ యాడ్ చేయడంతో అటువంటిది ఏమీ లేదని అర్థమైంది.

Continues below advertisement

Also Read: ధర్మేంద్ర ఆస్తికి అసలైన వారసుడు ఎవరు? హేమామాలినికి వాటా ఎందుకు లేదు? 450 కోట్లు ఎవరికి వెళతాయి? చట్టం ఏం చెబుతోందంటే?

'మాస్ జాతర' కథ ఏమిటి? ఏముంది?'మాస్ జాతర' సినిమా కథ విషయానికి వస్తే... ఇందులో హీరో రైల్వే పోలీస్ ఆఫీసర్. నీతి నిజాయతీలకు మారుపేరు. అందువల్ల వరుసగా ట్రాన్స్‌ఫర్స్‌ అవుతాయి. ఓ మంత్రికి ఎదురు వెళ్లడంతో వరంగల్ నుంచి శ్రీకాకుళం ట్రాన్స్‌ఫర్ అవుతుంది. అక్కడ ఓ అమ్మాయిని చూసి ప్రేమిస్తాడు. ఆమె టీచర్ అని సంతోషిస్తాడు. అయితే ఆ అమ్మాయి గంజాయి అమ్ముతుందని తెలుస్తుంది. అదే సమయంలో ఆ గంజాయి వెనుక మరొక లోకల్ గ్యాంగ్ ఉందని తెలుస్తుంది. ఆ గ్యాంగ్ లీడర్ ను రైల్వే పోలీస్ ఎలా అడ్డుకున్నాడు? చివరికి ఏమైంది? అనేది 'మాస్ జాతర'.

Also Readధర్మేంద్ర లాస్ట్‌ సినిమా ఇంకా రిలీజ్ కాలేదు... మరణించిన రోజే ఫస్ట్ లుక్.... పోస్టర్ చూసి ఫ్యాన్స్‌ ఎమోషనల్

'మాస్ జాతర'లో రవితేజకు తాతయ్యగా నట కిరీటి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ కీలక పాత్ర చేశారు. హీరోయిన్ శ్రీలీల తండ్రిగా సీనియర్ నరేష్... విలన్ పాత్రలో నవీన్ చంద్ర నటించారు. థియేటర్లలో సినిమాకు ఆశించిన స్పందన రాలేదు. భీమ్స్ సిసిరోలియో సంగీతానికి కూడా మంచి పేరు రాలేదు. పాటలు సినిమా విడుదలకు ముందు హిట్ అయినప్పటికి... నేపథ్య సంగీతం బాలేదని విమర్శలు వచ్చాయి. మరి ఓటీటీ వీక్షకుల నుంచి సినిమాకు ఎటువంటి స్పందన వస్తుందో చూడాలి. ప్రస్తుతం రవితేజ 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' సినిమా చేస్తున్నారు.