Baipan Bhaari Deva: రూ.5 కోట్ల బడ్జెట్.. రూ.90.5 కోట్ల కలెక్షన్స్ - థియేటర్లలో రికార్డ్ క్రియేట్ చేసిన సినిమా ఇప్పుడు ఓటీటీలోకి!

Baipan Bhaari Deva: ఒక రీజియనల్ సినిమా కేవలం రూ.5 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కి.. ఏకంగా రూ.90 కోట్ల కలెక్షన్స్‌ను సాధించింది. అలాంటి సెన్సేషనల్ మూవీ ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది.

Continues below advertisement

Baipan Bhaari Deva OTT: కేవలం మౌత్ టాక్‌తో హిట్ కొట్టిన మరాఠీ చిత్రం ‘బైపన్ భారీ దేవ’ ఎట్టకేలకు ఓటీటీకి వచ్చేసింది. ఇది కేవలం మరాఠీలో మాత్రమే తెరకెక్కి.. అక్కడ మాత్రమే విడులదయిన చిత్రం. ఈ మూవీ కేవలం రూ.5 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కి బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ.90 కోట్లకు పైగా వసూళ్లను సాధించి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇప్పుడు ఓటీటీలో విడుదలయ్యింది.

Continues below advertisement

గతేడాది విడుదల..

కేదర్ షిండే దర్శకత్వంలో తెరకెక్కిన మరాఠీ చిత్రమే ‘బైపన్ భారీ దేవ’. ఇది ఒక కమర్షియల్ సినిమా కాదు. ఇందులో స్టార్ హీరోలు కూడా ఎవరూ లేరు. కేవలం కంటెంట్‌తో, నటీనటులు యాక్టింగ్‌తో ప్రేక్షకులను ఇంప్రెస్ చేసింది ఈ మూవీ. ఇది ఒక ఆరుగురు అక్కాచెల్లెళ్ల కథ. ఈ కథ ఫ్యామిలీ ఆడియన్స్‌ను బాగా ఆకట్టుకుంది. అందుకే రూ.5 కోట్లు పెట్టి తెరకెక్కించిన ఈ మూవీకి రూ.90.5 కోట్ల కలెక్షన్స్ వచ్చాయి. మరాఠీ భాషలో తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కి అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాల లిస్ట్‌లో చోటు దక్కించుకుంది. 2023 జూన్ 30న ‘బైపన్ భారీ దేవ’ థియేటర్లలో విడుదలయ్యింది. ఫైనల్‌గా ఇన్నాళ్లకు ఈ సినిమా రెండు ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫార్మ్స్‌లో స్ట్రీమింగ్ ప్రారంభించుకుంది. 

‘సైరట్’ తరువాతి స్థానంలో..

కొన్నేళ్ల క్రితం మరాఠీలో తెరకెక్కిన ప్రేమకథ ‘సైరట్’ కూడా ఇదే విధంగా సెన్సేషన్ క్రియేట్ చేసింది. రీజియనల్ భాషలో విడుదలయ్యి అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా ‘సైరట్’ రికార్డును ఇప్పటివరకు ఏ మూవీ టచ్ చేయలేదు. ఇక ఇప్పుడు దాని తరువాతి స్థానంలో ‘బైపన్ భారీ దేవ’ నిలిచింది. థియేటర్లలో ఈ మూవీకి వచ్చిన రెస్పాన్స్‌ను దృష్టిలో పెట్టుకొని ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫార్మ్ నెట్‌ఫ్లిక్స్.. ఈ సినిమా రైట్స్‌ను కొనుగోలు చేసింది. దీంతో పాటు హులూ యాప్‌లో కూడా ఈ చిత్రం స్ట్రీమింగ్‌ను ప్రారంభించుకుంది. థియేటర్లలో విడుదలయిన ఆరు నెలల తర్వాత ‘బైపన్ భారీ దేవ’ ఓటీటీ వ్యూయర్స్‌కు అందుబాటులోకి వచ్చింది. 

ఆరుగురి నటనే ప్రాణం పోసింది..

కేదార్ షిండే దర్శకత్వం వహించిన ‘బైపన్ భారీ దేవ’ను మాధురి భోస్లే నిర్మించారు. పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్.. ఈ సినిమాను డిస్ట్రిబ్యూట్ చేయడానికి ముందుకు రావడంతో అక్కడే మూవీకి కాస్త హైప్ క్రియేట్ అయ్యింది. దీపా పరాబ్, రోహిని హత్తంగాడి, వందనా గుప్తే, సుచిత్రా బండేకర్, సుకన్య కులకర్ణి మోనే, శిల్పా నావల్కర్.. ‘బైపన్ భారీ దేవ’లో అక్కాచెల్లెళ్లుగా నటించారు. ఈ ఆరుగురి నటన సినిమాకు ప్రాణం పోసింది. ఎమోషనల్ సీన్స్‌‌లో వారు కంటతడి పెట్టుకోవడంతో పాటు ప్రేక్షకులకు కూడా కంటతడి పెట్టించారు. నెట్‌ఫ్లిక్స్, హులూతో పాటు ఈ మూవీ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ సబ్‌స్క్రైబర్లకు కూడా అందుబాటులో ఉంది. అసలు ‘బైపన్ భారీ దేవ’ గురించి ఏ మాత్రం ఐడియా లేకుండా ఓటీటీలో చూసినవారు మూవీ బాగుందంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.

Also Read: యోగిబాబుతో భూమిక మూవీ - ‘స్కూల్’ ఫస్ట్ లుక్ చూశారా?

Continues below advertisement
Sponsored Links by Taboola