Manjummel Boys OTT Release: థియేటర్లలో ఒక సినిమాను చూసినా కూడా ఓటీటీలో ఎప్పుడు రిలీజ్ అవుతుందా.. మళ్లీ ఆ సినిమాను ఎప్పుడు చూద్దామా అని ఎదురుచూసే మూవీ లవర్స్ చాలామందే ఉంటారు. అలా చాలామంది మూవీ లవర్స్ ఓటీటీలో చూడడానికి ఎదురుచూస్తున్న సినిమానే ‘మంజుమ్మెల్ బాయ్స్’. ఈ మూవీ ఏ రేంజ్‌లో హిట్ అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మలయాళ చిత్రమే అయినా కూడా మొత్తం సౌత్ ప్రేక్షకులను మెప్పించి.. అత్యధిక కలెక్షన్స్ సాధించిన మలయాళ చిత్రంగా రికార్డ్ సాధించింది. ఇప్పుడు ఈ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ ప్రారంభించుకుంది.


రేంజ్‌ను పెంచింది..


నిజంగా జరిగిన సంఘటన ఆధారంగా చిదంబరం ఎస్ పొడువల్ తెరకెక్కించిన చిత్రమే ‘మంజుమ్మెల్ బాయ్స్’. అతి తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కించిన ఈ చిత్రం రూ.200 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఏ జోనర్ సినిమాను అయినా ప్రేక్షకులను మెప్పించే విధంగా తెరకెక్కించడంలో మలయాళం మేకర్స్ ఎప్పుడూ సక్సెస్ సాధిస్తారు అని ఆల్రెడీ ప్రూవ్ అయ్యింది. కానీ ‘మంజుమ్మెల్ బాయ్స్’ చిత్రం.. మలయాళ మేకర్స్ రేంజ్‌ను మరింత పెంచేసింది. అందుకే ఈ మూవీని చాలామంది థియేటర్లలో చూసి ఆదరించారు. ఇప్పుడు ఇది అందరికీ అందుబాటులో ఉండేలా డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ ప్రారంభించుకుంది.


ఇప్పటికీ థియేటర్లలో సక్సెస్‌ఫుల్‌గా..


మే 4 అర్థరాత్రి నుంచి డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ మొదలైంది ‘మంజుమ్మెల్ బాయ్స్’. ఇప్పటికే చాలామంది ప్రేక్షకులు.. ఈ సినిమాను థియేటర్లలో చూసినా కూడా ఓటీటీలో వచ్చిన తర్వాత చూద్దాంలే అని ఆగినవారు కూడా ఉన్నారు. అలాంటి వారు డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ఈ సినిమాను చూసేయవచ్చు. ఓటీటీలో మాత్రమే కాదు.. ఇప్పటికీ పలు థియేటర్లలో ఇంకా ‘మంజుమ్మెల్ బాయ్స్’ మూవీ సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. ఇంకా ఈ సినిమాను చూడడానికి ప్రేక్షకులు థియేటర్లకు వస్తున్నారు. విడుదలయ్యి దాదాపు రెండు నెలలు అవుతున్నా కూడా ఇంకా థియేటర్లలో సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతుందంటే ‘మంజుమ్మెల్ బాయ్స్’ క్రియేట్ చేసిన ఇంపాక్ట్ అలాంటిది.






సర్వైవల్ డ్రామా..


‘మంజుమ్మెల్ బాయ్స్’లో సౌబిన్ షశీర్, శ్రీనాథ్ భాసీ, బాలు వర్గీస్, గణపతి, లాల్, దీపక్ ప్రమబోల్ లీడ్ రోల్స్‌లో నటించారు. మంజుమ్మెల్ బాయ్స్‌గా ఫేమస్ అయిన 11 మంది స్నేహితులు కేరళ నుంచి తమిళనాడుకు ట్రిప్ వెళ్దామని నిర్ణయించుకుంటారు. తమిళనాడులోని టూరిస్ట్ స్పాట్‌లో ఒకటి అయిన గుణ కేవ్స్‌కు వెళ్తారు. అక్కడ వారు ఊహించని పరిస్థితి ఎదురవుతుంది. దాని నుంచి వాళ్లు ఎలా బయటపడ్డారు అనేది ‘మంజుమ్మెల్ బాయ్స్’ కథ. ఒక సర్వైవల్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రంలో సరిపడా థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉండడంతో ఈ మూవీ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.



Also Read: పాకిస్తాన్ నుంచి ఎంతో ప్రేమను పొందుతున్నా- మనమంతా ఒక్కటేనని భావిస్తున్నా, బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు