Mangalavaaram Movie OTT Release: డిసెంబర్‌లో సినిమాల సందడి మామూలుగా లేదు.. కేవలం థియేటర్లలో మాత్రమే కాదు.. ఓటీటీల్లో కూడా చాలా సినిమాలు విడుదలకు సిద్ధమవుతూ మూవీ లవర్స్‌కు మంచి ఫీస్ట్ ఇవ్వనున్నాయి. ఈ శుక్రవారం ఇప్పటికే చాలా సినిమాలు ఓటీటీ సబ్‌స్క్రైబర్స్ ముందుకు రాగా.. మరికొన్ని చిత్రాలు కూడా ఓటీటీ రిలీజ్‌కు రెడీ అవుతున్నాయి. ఇప్పుడు ఆ లిస్ట్‌లోకి రీసెంట్ హిట్ ‘మంగళవారం’ కూడా యాడ్ అయ్యింది. పాయల్ రాజ్‌పుత్ లీడ్ రోల్ చేసిన ఈ థ్రిల్లర్ మూవీ.. ఏ ఓటీటీలో రిలీజ్ అవుతుందో మూవీ టీమ్ రివీల్ చేసింది. థియేటర్లలో పాన్ ఇండియా భాషల్లో విడుదలయిన ‘మంగళవారం’.. ఓటీటీలో కూడా అన్ని భాషల్లో విడుదల కానున్నట్టు తెలుస్తోంది.
‘మంగళవారం’తో సూపర్ హిట్..
‘ఆర్ ఎక్స్ 100’ లాంటి సెన్సేషనల్ హిట్‌తో టాలీవుడ్‌కు దర్శకుడిగా పరిచయమయ్యాడు అజయ్ భూపతి. కానీ తన రెండో సినిమా ‘మహాసముద్రం’తోనే భారీ డిసాస్టర్‌ను మూటగట్టుకున్నాడు. దీంతో నటీనటులు తనకు అవకాశం ఇవ్వడానికి ముందుకు రాలేదు. అందుకే తన ఫస్ట్ సినిమా హీరోయిన్‌తోనే ‘మంగళవారం’ అనే థ్రిల్లర్‌ను ప్లాన్ చేశాడు. అజయ్ భూపతి తెరకెక్కించిన ముందు సినిమాలకంటే ‘మంగళవారం’ చాలా డిఫరెంట్. ఇందులో థ్రిల్లర్, హారర్ లాంటి ఎలిమేంట్స్‌ను కూడా యాడ్ చేశాడు దర్శకుడు. దీంతో ఈ మూవీ థియేటర్లలో సూపర్ హిట్‌ను అందుకుంది. ఇక తాజాగా ఈ మూవీ ఓటీటీ రైట్స్‌ను ఏ ప్లాట్‌ఫార్మ్ దక్కించుకుందో బయటపడింది.
ఆ ఓటీటీలోనే..
అజయ్ భూపతి, పాయల్ రాజ్‌పుత్ కాంబినేషన్‌లో తెరకెక్కిన సెన్సేషనల్ హిట్ ‘మంగళవారం’ ఓటీటీ రైట్స్‌ను డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ దక్కించుకున్నట్టు సమాచారం. హిందీలో తప్పా మిగతా అన్ని భాషల్లో డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ‘మంగళవారం’ స్ట్రీమ్ కానుందని తెలుస్తోంది. కానీ హాట్‌స్టార్ ఈ మూవీ ప్రీమియర్ డేట్ ఎప్పుడు అనే విషయం ఇంకా బయటికి రాలేదు. త్వరలోనే ఈ ఓటీటీ ప్లాట్‌ఫార్మ్ స్వయంగా వివరాలను వెల్లడించనుంది. నవంబర్ 17న ‘మంగళవారం’ థియేటర్లలో విడుదలయ్యింది కాబట్టి వచ్చేవారం ఓటీటీ ప్రీమియర్స్ ఉండే అవకాశం ఉందని ప్రేక్షకులు అంచనా వేస్తున్నారు.
భయపెట్టే పాత్రలో ప్రియదర్శి..
అజయ్ భూపతి దర్శకత్వం వహించిన ‘మంగళవారం’లో పాయల్ రాజ్‌పుత్‌తో పాటు అజ్మల్ అమీర్, నందితా శ్వేతా, చైతన్య కృష్ణ, అజయ్ ఘోష్, దివ్య పిల్లై, రవీంద్ర విజయ్.. ఇతర కీలక పాత్రల్లో కనిపించారు. అంతే కాకుండా ఈ సినిమాలో ప్రియదర్శి క్యారెక్టర్ పెద్ద సర్‌ప్రైజ్‌గా నిలిచింది. ఎప్పుడూ కామెడీ పాత్రలు చేస్తూ ప్రేక్షకులను నవ్వించే ప్రియదర్శి.. మొదటిసారి ‘మంగళవారం’తో వారిని భయపెట్టాడు కూడా. ముద్ర మీడియా వర్క్స్, ఏ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్స్‌పై స్వాతి రెడ్డి గుణపాటి, సురేశ్ వర్మ, అజయ్ భూపతి.. ఈ సినిమాను సంయుక్తంగా నిర్మించారు. అజ్నీష్ లోక్‌నాథ్ అందించిన సంగీతం ‘మంగళవారం’ చిత్రానికి ప్రాణం పోసింది. ఇక చాలాకాలంగా హిట్ కోసం ఎదురుచూస్తున్న పాయల్.. ‘మంగళవారం’తో ఫార్మ్‌లోకి వచ్చింది. అంతే కాకుండా ఇందులో తన నటన కూడా మేకర్స్‌ను ఆకట్టుకునేలా ఉండడంతో తనకు మరిన్ని సినిమా ఆఫర్లు వస్తాయని ఆశపడుతోంది.
Also Read: అమ్మ క్లైమాక్స్ చూడలేదు, ఆ సీన్ చూడలేనని ఏడ్చేసింది - ‘యానిమల్’ విలన్ బాబీ డియోల్ ఆసక్తికర వ్యాఖ్యలు