Varalaxmi Sarath Kumar's Madhushala Movie OTT Streaming On ETV Win: ప్రముఖ నటి వరలక్ష్మీ శరత్ కుమార్ (Varalaxmi Sarath Kumar) ప్రధాన పాత్రలో నటించిన క్రైమ్ థ్రిల్లర్ మూవీ 'మధుశాల' (Madhushala). ఈ సినిమా సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసింది. ఈ మూవీకి జి.సుధాకర్ దర్శకత్వం వహించగా.. ఎస్ఐఏ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్‌పై తమ్ముడు సత్యం నిర్మించారు.
ఆ ఓటీటీలోకి స్ట్రీమింగ్
కిడ్నాప్ ప్రధానాంశంగా సాగే ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీ సోమవారం (మార్చి 31) నుంచి సైలెంట్‌గా 'ఈటీవీ విన్' (ETV Win) ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ విషయాన్ని సదరు ఓటీటీ సంస్థ సోషల్ మీడియా వేదికగా తెలిపింది. 'మధుశాల.. ఓ థ్రిల్లింగ్ కిడ్నాప్ డ్రామా. ఓ ప్లాన్, షాకింగ్ ట్విస్ట్, టైమ్‌తో రేస్. కిడ్నాపర్లను పట్టుకుని ఎమ్మెల్యే తనకు ఇష్టమైన వ్యక్తులను కాపాడుకున్నాడా.?' అని పేర్కొంది.
Also Read: 'సర్దార్ 2'లో కార్తీ ఫస్ట్ లుక్ అదుర్స్ - విలన్ ఎవరో తెలుసా?, కాన్సెప్ట్ చూస్తే భయపడాల్సిందేనా!
ఈ మూవీలో వరలక్ష్మి శరత్ కుమార్‌తో పాటు మనోజ్ నందం, యానీ, తనికెళ్ల భరణి, రఘుబాబు, గెటప్ శీను, చిన్నా, రవివర్మ, ఇనయా సుల్తానా కీలక పాత్రలు పోషించారు. ఈ మూవీకి సెబాస్టియన్ వర్గీస్ సంగీతం అందించారు.
స్టోరీ ఏంటంటే?
ఓ కిడ్నాపర్ ఎమ్మెల్యే కోడలిని కిడ్నాప్ చేయాలని ప్లాన్ చేస్తాడు. ఇందుకోసం మరో ఐదుగురి హెల్ప్ తీసుకుంటాడు. అంతా కలిసి ఆమెను కిడ్నాప్ చేస్తారు. ఇదే టైంలో కిడ్నాపర్లలో ఒకరు ప్రమాదంలో చనిపోతాడు. అసలు వారెందుకు కిడ్నాప్ చేశారు?, కిడ్నాపర్ల నుంచి ఎమ్మెల్యే తన కోడలిని ఎలా కాపాడుకున్నాడు?, ఈ క్రమంలో ఎదురైన సవాళ్లు ఏంటి? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఈటీవీ విన్‌లో డిఫరెంట్ కాన్సెప్ట్
హారర్, క్రైమ్, థ్రిల్లర్, కామెడీ, కార్టూన్ కంటెంట్‌తో అటు చిన్నారులను ఇటు పెద్దలను ఎంటర్‌టైన్ చేస్తోన్న 'ఈటీవీ విన్' మరో కొత్త కాన్సెప్ట్‌తో ముందుకొస్తోంది. ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు పర్యవేక్షణలో 'కథా సుధ' (Katha Sudha) పేరిట ప్రతీ ఆదివారం కొత్త స్టోరీస్ స్ట్రీమింగ్ కానున్నాయి. ఏప్రిల్ 6 నుంచి ఇవి అందుబాటులో ఉంటాయని.. పలువురు కొత్త నటీనటులు ఈ కథా సుధ ద్వారా పరిచయం కానున్నారు.
17 రోజుల్లో నాలుగు కథలు రూపొందించామని.. కొత్త వారిని పరిచయం చేసేందుకు 'కథా సుధ' చాలా ఉపయోగపడుతుందని ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు తెలిపారు. మరోవైపు, తన ఆరేళ్ల కుమార్తెతో కలిసి 'కథా సుధ'లో 'వెండి పట్టీలు' అనే కథలో నటించానని నటుడు బాలాదిత్య చెప్పారు.