Vijay Antony's Maargan OTT Streaming On Amazon Prime: క్రైమ్, హారర్ థ్రిల్లర్స్ మూవీస్, వెబ్ సిరీస్‌లకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మూవీ లవర్స్ ఇంట్రెస్ట్‌కు అనుగుణంగా ప్రముఖ ఓటీటీలు కూడా అలాంటి కంటెంట్‌నే స్ట్రీమింగ్ చేస్తున్నాయి.

తాజాగా... కోలీవుడ్ స్టార్ విజయ్ ఆంటోని రీసెంట్ క్రైమ్ థ్రిల్లర్ 'మార్గన్' ఓటీటీలోకి వచ్చేసింది. ఆద్యంతం సస్పెన్స్, థ్రిల్లింగ్ పంచే ఈ మూవీ తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతోంది. జూన్ 27న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మిక్స్‌డ్ టాక్ సొంతం చేసుకుంది.

ఎందులో చూడొచ్చంటే?

ప్రముఖ ఓటీటీ 'అమెజాన్ ప్రైమ్ వీడియో'లో శుక్రవారం నుంచి 'మార్గన్' స్ట్రీమింగ్ అవుతోంది. తమిళంతో పాటు తెలుగు భాషల్లో అందుబాటులో ఉంది. ఈ ఓటీటీతో పాటే 'Tentkotta' ప్లాట్ ఫాంలోనూ స్ట్రీమింగ్ అవుతోంది. ఈ మూవీకి లియో జాన్ పాల్ దర్శకత్వం వహించగా... మీరా విజయ్‌తో పాటు ఆంటోని కూడా నిర్మాతలుగా వ్యవహరించారు. విజయ్ ఆంటోనితో పాటు అజయ్ దిషాన్, సముద్రఖని, మహానంది శంకర్, బ్రిగడ సాగా, వినోద్ సాగా, ప్రీతిక తదితరులు కీలక పాత్రలు పోషించారు.

Also Read: నారా రోహిత్ 'సుందరకాండ' ఓటీటీ డీల్ ఫిక్స్ - ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో తెలుసా?

స్టోరీ ఏంటంటే?

అర్ధరాత్రి అమ్మాయిలను దారుణంగా ఓ సైకో కిల్లర్ హత్య చేస్తుంటాడు. వాటిని ఓ పోలీస్ ఆఫీసర్ ఎలా ఛేదించాడో అనేదే ఈ మూవీ స్టోరీ. హైదరాబాద్‌లో రమ్య అనే యువతి దారుణ హత్యకు గురవుతుంది. గుర్తు తెలియని వ్యక్తి వెనుక నుంచి ఆమెపై దాడి చేసి ఓ రేర్ డ్రగ్ ఆమెకు ఇంజెక్ట్ చేస్తాడు. అలా చేసిన వెంటనే శరీరమంతా కాలిపోయినట్లుగా నలుపు రంగులోకి మారిపోతుంది. యువతి మృతదేహాన్ని చెత్తకుప్పలో పడేసి దాన్ని సోషల్ మీడియాలో పోస్టే చేస్తాడు. దేశవ్యాప్తంగా ఈ కేసు సంచలనంగా మారుతుంది. ఈ విషయం ముంబయిలో అడిషనల్ డీజీపీ ధృవ కుమార్ (విజయ్ ఆంటోని) దృష్టికి వస్తుంది.

గతంలో తన కుమార్తె కూడా ఇలాగే దారుణ హత్యకు గురి కావడంతో ఈ కేసును పర్సనల్‌గా తీసుకుని ఓ స్పెషల్ టీంతో  హైదరాబాద్‌లో ఇన్వెస్టిగేషన్ చేస్తాడు ధ్రువ. సీసీ ఫుటేజీల ఆధారంగా అరవింద్ అనే యువకున్ని ట్రేస్ చేస్తారు. అతను ఇచ్చిన క్లూస్ ఆధారంగా వరుస మర్డర్స్‌కు సంబంధించి కీలక విషయాలు వెలుగులోకి వస్తాయి. అసలు ఈ హత్యలు చేస్తుందెవరు? ఎందుకు ఇలా ఇంజెక్షన్‌తో చంపుతున్నారు? ధ్రువ కూతురికి ఈ మర్డర్స్‌కు సంబంధం ఏంటి? అరవింద్ పోలీసులకు ఎలాంటి సాయం చేశాడు? కేసును సాల్వ్ చేసే క్రమంలో ధ్రువకు ఎదురైన సవాళ్లేంటి? ఈ హత్యల వెనుక ఏదైనా మెడికల్ మాఫియా ఉందా? అనేది తెలియాలంటే మూవీ చూడాల్సిందే. క్లైమాక్స్‌లో మూవీలో వచ్చే ట్విస్ట్ ఎవరూ ఊహించలేరు. ఆద్యంతం ట్విస్టులు, సస్పెన్స్‌తో ఆడియన్స్‌కు మంచి థ్రిల్ పంచుతుంది. ఇంకెందుకు ఆలస్యం వెంటనే అమెజాన్ ప్రైమ్‌లో మూవీని ఇప్పుడే చూసేయండి.